కరోనా నుండి రక్షించడానికి డబుల్ మాస్కింగ్ ఎలా సహాయపడుతుందో మీకు తెలుసా?

మనదేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. సెకండ్ వేవ్ కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా అంటే ప్రజల్లో నిర్లక్ష్యం, ప్రభుత్వ నియమాలు సరిగా పాటించకపోవడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం, మాస్క్ సరిగా ధరించకపోవడం అన్నీ వెరసి ఈ రోజు పరిస్థితి ఇంత వరకు వచ్చింది. ఇక ఇప్పుడు జాగ్రత్తలు పాటించినా కరోనా వైరస్ నుంచి తప్పించుకోవడం చాలా కష్టసాధ్యం అవుతోంది. అయితే సెకండ్ వేవ్ లో విజృంభిస్తున్న కరోనా బారిన పడకుండా ఉండాలంటే కొన్ని నియమాలు సూచిస్తున్నారు వైద్యులు.

how double masking can help protect against coronaకొంతమంది మేము మాస్క్ ధరిస్తూనే ఉన్నాం అయినా ఆ మహమ్మారి బారిన పడాల్సి వచ్చింది అని చెబుతున్నారు. మరి నిజంగా మాస్క్ ధరించి బయట తిరిగే ప్రజలకు ఎక్స్‌ట్రా ప్రొటెక్షన్ లేకపోతే వారు కరోనా బారిన పడాల్సిందేనా? అనే ఒక ప్రశ్న ప్రస్తుతం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎందుకంటే మాస్కు ధరించి.. భౌతిక దూరం పాటించినా కూడా కొందరికి కరోనా సోకుతోంది. దీంతో కరోనా సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికి సమాధానంగా నిపుణులు డబుల్ మాస్క్ ధరించాలని సిఫార్సు చేస్తున్నారు.

how double masking can help protect against coronaడబుల్ మాస్క్ ధరించడం వలన కరోనా వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తుందని అంటారు. అసలు డబుల్ మాస్క్ అంటే ఏంటి? డబుల్ మాస్క్ ధరించడం వల్ల కరోనా నివారణ ఎంత ప్రభావవంతంగా ఉంటుంది? డబుల్ మాస్క్ ఎలా ధరించాలి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

how double masking can help protect against coronaడబుల్ మాస్క్ అంటే ఒక మాస్క్ మీద అదనపు పొరలు లేదా రెండు మాస్క్ లు ధరించడం. పైన ధరించే రెండవ మాస్క్ భాగం. లోపల ధరించిన మొదటి మాస్క్ అంచులను సున్నితంగా తాకే విధంగా ధరిస్తే రెండు లేయర్స్ నుంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది. మూతి, ముక్కు, గడ్డం పూర్తిగా కవర్ అయ్యేలాగా మాస్క్ ధరించాలి. దీని వల్ల మనకు దగ్గరగా ఉన్న వారు ఎవరైనా ఆకస్మాత్తుగా తుమ్మినా దగ్గినా వైరస్ని శ్వాస రంధ్రాల్లోకి రాకుండా నిలిపివేస్తాయి.

how double masking can help protect against coronaఅంతేకాదు డబుల్ మాస్క్ అంటువ్యాధులు మరియు వైరస్ వ్యాప్తిని నిరోధిస్తుంది. డబుల్ మాస్క్ ధరించడం వలన శ్వాస రంధ్రాలలోకి ఎటువంటి వైరస్లు గాని బ్యాక్టీరియా గాని వెళ్లే అవకాశమే ఉండదు. దీనివల్ల కరోనా వైరస్ కూడా సోకే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. అయితే ఎంత మాస్క్ వేసుకున్నా, బేసిక్స్ పాటించడం, వాటిని సరిగ్గా అనుసరించడం కూడా ముఖ్యమే. నిపుణుల అభిప్రాయం ప్రకారం, డబుల్ మాస్క్‌లు సరిగ్గా వేసుకుంటే చాలా ప్రభావవంతంగా వ్యాధి వ్యాప్తిని నిరోధించవచ్చు.

how double masking can help protect against coronaఒక అధ్యయనం ప్రకారం డబుల్ మాస్కులు ధరించడం వలన 94.5 శాతం కరోనా సోకే ప్రమాదాలు తగ్గుతాయట. అయితే ఒక ఎన్5 మాస్క్ పై క్లాత్ మాస్క్ గానీ లేక రెండూ కూడా క్లాత్ మాస్క్స్ గానీ 3 క్లాత్ మాస్కులు కూడా ధరించవచ్చని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల కరోనా బారిన పడే అవకాశాలు సన్నగిల్లుతాయి. అయితే ప్రతి రోజు బయట ప్రదేశాల్లో తిరిగే ప్రజలు తమ మాస్కులను వేడి నీటిలో కొద్దిసేపు నానబెట్టి శుభ్రంగా కడుక్కోవాలి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,730,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR