Home Health చెవిలో గులిమి ఎలా తయారవుతుంది?

చెవిలో గులిమి ఎలా తయారవుతుంది?

0

వ్యక్తిగత శుభ్రతలో భాగంగా ప్రతీ ఒక్కరు చెవిలోని గులిమిని శుభ్రం చేస్తూ ఉంటారు. ఈ గులిమినే ఇయర్ వాక్స్ అని కూడా అంటారు. నిజానికి గులిమి అనేది మన చెవి నుంచి సహజంగా వెలువడే మలిన పదార్థం. చెవి నాళాల్లోంచి సహజంగా వెలువడే మలినాన్నే గులిమి అంటారు. చెవి గులిమిని రెండు రకాలు ఉంటుంది.. ఒకటి తడి, మరొకటి పొడి. గులిమి చెవి లోపలి గ్రంథుల్లో ఉత్పత్తి అవుతుంది. దీనికి అనేక విధులు ఉంటాయి.

ear waxఇది చెవులను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. చెవుల్లో ఉన్న నాళాలు ఎండిపోకుండా, పగుళ్లు రాకుండా కాపాడుతుంది. ధూళికణాలు, నీరు చెవిలోపలికి పోకుండా రక్షిస్తుంది. ఎలాంటి వ్యాధులూ సోకకుండా అరికడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు గుమిలిలో ఉంటాయి. చాలావరకు చెవుల్లో నాళాలు వాటిని అవే శుభ్రపరచుకుంటూ ఉంటాయి.

గులిమి దానతంట అదే బయటకు వెళ్లేలా చెవి నిర్మాణం ఉంటుంది. మాట్లాడేటప్పుడు, తినేటప్పుడు, ఏదైనా నమిలేటప్పుడు దవడను కదిలించినప్పుడు.. ఆ కదలికల వల్ల చెవిలోని గుబిలి బాహ్య చెవిలోకి వస్తుంది. చాలా తక్కువ గులిమి ఉన్న వ్యక్తులు చెవి దురదతో బాధపడుతుంటారు.. చెవి పోటు, తక్కువపాటి చెవుడు, చెవిలో ఏదో ఉన్న భావం, టిన్నిటస్, ఇన్ఫెక్షన్లు ఇతర సమస్యలకు కారణమవుతుంది.

ఇక కొంతమందిలో సాధారణ స్థాయి కంటే ఎక్కువ తయారవుతుంటుంది. అలా తయారవడం కాస్త ఇబ్బందితో కూడుకున్నది. అలాంటి వారు ఇయర్ వాక్స్ తీయడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు పేపర్‌ను చుట్టలా చుట్టి, ఇంకొందరు బట్టను పెట్టి దాన్ని తీస్తుంటారు. మరికొంతమంది బేబీ పిన్నులు, పేపర్ క్లిప్స్, ఇయర్ బడ్స్, చిటికెన వేలు ని చెవులో పెట్టి గులిమి తీయడం వంటివి చేస్తుంటారు.

అయితే ఇయర్ వాక్స్ తొలగించడానికి చెవులలో ఏది పడితే అది పట్టడం మంచిది కాదు. ముఖ్యంగా కాటన్ బడ్స్‌తో మరీ జాగ్రత్త. ఎందుకంటే వాటివల్ల వినికిడి లోపం వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైద్యులే కాదు.. కాటన్ బడ్స్ తయారు చేసే కంపెనీలు కూడా వాటిపై ‘కాటన్ బడ్స్ ప్రమాదకరం’ అని రాస్తారు. కాటన్ బడ్ వాడటం వల్ల అది గులిమిని మరింత లోపలికి నెట్టివేస్తుంది. కర్ణభేరికి తగిలితే వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం ఉంది.

ఒక్కోసారి కాటన్ బడ్స్‌తో గులిమి తీసుకున్నప్పుడు చెవిపైన చర్మం మండుతుంది లేదా దురద పెడుతుంది. అక్కడ మనం మళ్లీ గోక్కోవడమో, రాపిడి కలిగించడమో చేస్తూ ఉంటే అక్కడ తిరిగి బ్యాక్టీరియా చేరవచ్చు. దానివలన మళ్లీ చెవి నొప్పి వస్తుంది. ఇదొక విషవలయంలా తయారవుతుంది. మరి చెవిలోని గులిమిని ఎలా శుభ్రం చేసుకోవాలి? దానికి ఒక సహజ చిట్కా ఉంది.

చెవిలో గులిమి సాధారణ స్థితి కంటే ఎక్కువ తయారైన వారు గోరువెచ్చని నీళ్ళలో కాస్త ఉప్పు వేసి కలపాలి. ఆ నీటిలో ఒక దూది ఉండను ముంచి అందులో ఉన్న నీటిని చెవిలోకి పిండాలి. అలా ఒక చెవి తర్వాత మరొక చెవితో లో పోయాలి. ఒక ఐదు నిమిషాల తర్వాత ద్వారా చెవిలో గులిమి తొలగిపోతుంది.. అలాగే బేబీ ఆయిల్ ను కూడా ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు.. ఇలా సులువుగా చెవులను శుభ్రం చేసుకోవచ్చు.

చెవిలో దురదను తగ్గించేందుకు హెల్ప్ చేసే అద్భుతమైన హోమ్ రెమెడీగా ఆలివ్ ఆయిల్ గురించి చెప్పుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ అనేది అదనపు ఇయర్ వ్యాక్స్ ను తొలగిస్తుంది. ఇయర్ కెనాల్ ను లూబ్రికేట్ చేస్తుంది. ఇది గట్టిగా ఉన్న ఇయర్ వ్యాక్స్ ను మృదువుగా మారుస్తుంది. దాంతో, ఇయర్ వాక్స్ అనేది సులభంగా బయటికి వస్తుంది. ఆలివ్ ఆయిల్ లో యాంటీ సెప్టిక్ ప్రాపర్టీస్ కలవు. దాంతో ఇయర్ ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా తగ్గుతుంది.

Exit mobile version