శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా ?

త్రిమూర్తులలో ఒకరు పరమశివుడు అయన కైలాస అధిపతి. ఈయనను శంకరుడు, త్రినేత్రుడు, లయకారుడు, అర్ధనాదీశ్వరుడు ఇలా అనేక రకాల పేర్లతో కొలుస్తారు. మరి శివపార్వతుల వివాహం ఎలా జరిగింది? వారి వివాహం జరిగిందని చెప్పబడే ఆ పుణ్యస్థలం ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

త్రిమూర్తులలో ఒకరు పరమశివుడు అయన కైలాస అధిపతి. ఈయనను శంకరుడు, త్రినేత్రుడు, లయకారుడు, అర్ధనాదీశ్వరుడు ఇలా అనేక రకాల పేర్లతో కొలుస్తారు. మరి శివపార్వతుల వివాహం ఎలా జరిగింది? వారి వివాహం జరిగిందని చెప్పబడే ఆ పుణ్యస్థలం ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి తలపెట్టిన యాగం లో అవమాన భారానికి గురై సతీదేవి ఆత్మహుతి చేసుకుంటుంది. అప్పుడు శివుడు కోపానికి గురై వీరభద్రుడు సృష్టించి దక్ష ప్రజాపతి తలని నరికి సంహరిస్తాడు. ఆ తరువాత, శివుడు సతీదేవి నిర్జీవ దేహాన్ని తన భుజాన వేసుకుని ప్రళయ తాండవం చేస్తుండగా, శివుడిని శాంతిప చేయడానికి విష్ణువు తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు. దాంతో ఆమె దేహం 18 ఖండాలై భూలోకంలోని వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. కాలక్రమంలో అవే అష్టాదశ శక్తి పీఠాలు గా అవతరించాయి. ఇక ఆ తరువాత శివుడు దక్షుడిని పునర్జన్మని ప్రసాదిస్తాడు. ఆ తరువాత శివుడు అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేసుకుంటాడు. అయితే దేవతలందరు కూడా సతీదేవి మళ్ళీ జన్మిస్తేనే శివుడు తిరిగి ప్రపంచంలోకి వస్తాడని భావించిన దేవతలు సతీదేవిని మళ్ళీ జన్మించాలంటూ ప్రార్ధించారు. అప్పుడు హిమాలయాల రాజు హిమవంతుడికి, మేనకా దంపతులకి పార్వతీదేవి జన్మించింది. ఇక తల్లితండ్రుల ద్వారా తానూ జన్మించింది శివుడిని వివాహం చేసుకోవడానికే అని తెలుసుకొని శివుడి కోసమై రోజు తపస్సు చేసుకుంటూ ఉండేది. పార్వతీదేవి తపస్సుని తెలుసుకున్న శివుడు ఆ దేవిని అనుగ్రహించగా, వీరి వివాహానికి వచ్చిన శ్రీమహావిష్ణువు పెళ్లి పనులన్నీ చూసుకుంటే, బ్రహ్మ దేవుడు వివాహంలో పండితుడిగా వ్యవహరించాడని పురాణం. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రం, సొన్ ప్రయాగకు పడమరగా సుమారు 5 కి.మీ. దూరంలో త్రియుగీ నారాయణ్ అనే ఆలయం ఉంది. ఈ ఆలయం బయట గోడలు లేకుండా నాలుగు మూలాల రాతిస్థంబాలు, రాతి పైకప్పు మాత్రం ఉండి, మందిరం మధ్యలో ఒక నేలమీద నుండి నాలుగు అంగుళాల ఎత్తులో, సుమారు 3 అడుగుల ఉన్న రాతిపలక పానవట్టం లాగ ఉండి మధ్యలో ఒక చిన్న శివలింగం ఉంటుంది. అయితే శివపార్వతులు వివాహం ఈ పీఠం పైన జరిగిందని స్థల పురాణం చెబుతుంది. ఇచట శివపార్వతుల కళ్యాణం సత్యయుగంలో జరిగింది. ఇప్పటికి ఇక్కడ వెలుగుతున్న వాహనకుండ్ జ్యోతి సమక్షంలో శివపార్వతుల వివాహం జరిగినట్లు చెబుతారు. ఈ అగ్ని నుండి వచ్చే బూడిద ధిపతుల వివాహ బంధాన్ని ఆశీర్వదిస్తుందని చెబుతారు. ఇంకా ఇలా మూడు యుగముల నుండి మంట నిరంతరం అలాగే మండుతూ ఉండగా దీనికి నారాయణుడే సాక్షి అని ఈ స్వామికి త్రియుగీ నారాయణ్ అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయం ప్రాంగణంలోనే 3 కుండములు వరుసగా ఉన్నాయి. వీటిని బ్రహ్మ కుండం, విష్ణు కుండం, సరస్వతి కుండం అని అంటారు.

దక్ష ప్రజాపతి తలపెట్టిన యాగం లో అవమాన భారానికి గురై సతీదేవి ఆత్మహుతి చేసుకుంటుంది. అప్పుడు శివుడు కోపానికి గురై వీరభద్రుడు సృష్టించి దక్ష ప్రజాపతి తలని నరికి సంహరిస్తాడు. ఆ తరువాత, శివుడు సతీదేవి నిర్జీవ దేహాన్ని తన భుజాన వేసుకుని ప్రళయ తాండవం చేస్తుండగా, శివుడిని శాంతిప చేయడానికి విష్ణువు తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు. దాంతో ఆమె దేహం 18 ఖండాలై భూలోకంలోని వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. కాలక్రమంలో అవే అష్టాదశ శక్తి పీఠాలు గా అవతరించాయి. ఇక ఆ తరువాత శివుడు దక్షుడిని పునర్జన్మని ప్రసాదిస్తాడు.

How Lord Shiva married Goddess Parvati

ఆ తరువాత శివుడు అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేసుకుంటాడు. అయితే దేవతలందరు కూడా సతీదేవి మళ్ళీ జన్మిస్తేనే శివుడు తిరిగి ప్రపంచంలోకి వస్తాడని భావించిన దేవతలు సతీదేవిని మళ్ళీ జన్మించాలంటూ ప్రార్ధించారు. అప్పుడు హిమాలయాల రాజు హిమవంతుడికి, మేనకా దంపతులకి పార్వతీదేవి జన్మించింది. ఇక తల్లితండ్రుల ద్వారా తానూ జన్మించింది శివుడిని వివాహం చేసుకోవడానికే అని తెలుసుకొని శివుడి కోసమై రోజు తపస్సు చేసుకుంటూ ఉండేది. పార్వతీదేవి తపస్సుని తెలుసుకున్న శివుడు ఆ దేవిని అనుగ్రహించగా, వీరి వివాహానికి వచ్చిన శ్రీమహావిష్ణువు పెళ్లి పనులన్నీ చూసుకుంటే, బ్రహ్మ దేవుడు వివాహంలో పండితుడిగా వ్యవహరించాడని పురాణం.

How Lord Shiva married Goddess Parvati

ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రం, సొన్ ప్రయాగకు పడమరగా సుమారు 5 కి.మీ. దూరంలో త్రియుగీ నారాయణ్ అనే ఆలయం ఉంది. ఈ ఆలయం బయట గోడలు లేకుండా నాలుగు మూలాల రాతిస్థంబాలు, రాతి పైకప్పు మాత్రం ఉండి, మందిరం మధ్యలో ఒక నేలమీద నుండి నాలుగు అంగుళాల ఎత్తులో, సుమారు 3 అడుగుల ఉన్న రాతిపలక పానవట్టం లాగ ఉండి మధ్యలో ఒక చిన్న శివలింగం ఉంటుంది. అయితే శివపార్వతులు వివాహం ఈ పీఠం పైన జరిగిందని స్థల పురాణం చెబుతుంది.

How Lord Shiva married Goddess Parvati

ఇచట శివపార్వతుల కళ్యాణం సత్యయుగంలో జరిగింది. ఇప్పటికి ఇక్కడ వెలుగుతున్న వాహనకుండ్ జ్యోతి సమక్షంలో శివపార్వతుల వివాహం జరిగినట్లు చెబుతారు. ఈ అగ్ని నుండి వచ్చే బూడిద ధిపతుల వివాహ బంధాన్ని ఆశీర్వదిస్తుందని చెబుతారు. ఇంకా ఇలా మూడు యుగముల నుండి మంట నిరంతరం అలాగే మండుతూ ఉండగా దీనికి నారాయణుడే సాక్షి అని ఈ స్వామికి త్రియుగీ నారాయణ్ అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయం ప్రాంగణంలోనే 3 కుండములు వరుసగా ఉన్నాయి. వీటిని బ్రహ్మ కుండం, విష్ణు కుండం, సరస్వతి కుండం అని అంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR