గంజాయి నూనెతో ఇన్ని లాభలా?

గత కొన్నేళ్ల నుండి గంజాయి అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దేశంలో ఎప్పటినుంచో గంజాయి వాడుతున్నా ఈ మధ్యే ఎక్కువగా సీజ్‌‌‌‌ అవుతోంది. కొన్నాళ్ల నుంచి ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో గంజాయి దొరికిందనే వార్తలు వింటున్నాం. యువత ఎక్కువగా దీని బారిన పడుతున్నారని, గంజాయి మత్తుకు బానిసలవుతున్నారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ నిజానికి నాలుగు వేల ఏండ్ల క్రితమే గంజాయిని సాగు చేసినట్టు ఆర్కియాలజిస్ట్‌‌‌‌లు చెబుతున్నారు. దీన్ని అప్పట్లో మత్తు పదార్థంగా కన్నా నార కోసం ఎక్కువగా పండించారు.
గంజాయి మొక్క ఆకులను నాటు వైద్యంలో వాడేవాళ్లు. గంజాయితో పాటు ఇలాంటి డ్రగ్స్‌‌‌‌ వాడకం కొన్ని వేల ఏండ్ల క్రితమే మొదలైంది. మన దేశంతోపాటు ఈజిప్టు, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో గంజాయి వాడకం ఎక్కువగా ఉండేది. మన దగ్గర పొగ పీల్చడంతో పాటు, గంజాయి ఆకు నూరి తయారు చేసిన‘భంగు’ను ఎక్కువగా వాడేవాళ్లు. దీంతోపాటు కొన్ని రకాల చెట్ల వేర్లను, గింజలను కూడా మత్తు కోసం వాడేవాళ్లు.
ఎక్కువ రోజుల నుంచి వాడడం వల్లే ఇక్కడి ఆచారాల్లో కూడా గంజాయి భాగమైంది. మన దేశంలో గంజాయి చట్ట విరుద్ధం అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భక్తి పరంగా యాక్సెప్టెన్సీ ఉంది. కాకపోతే కొన్ని లిమిటేషన్స్‌‌‌‌తో ప్రత్యేక రోజుల్లో మాత్రమే తీసుకుంటారు. మన దేశంలో కొందరు సన్యాసులు ఎక్కువగా తీసుకుంటారు. కొన్ని రకాల ఉత్సవాల్లో గంజాయితో తయారు చేసిన ‘భంగ్’ అనే డ్రింక్‌‌‌‌ని తాగుతారు. దీన్ని దేవతలు తాగేవాళ్లని కూడా చెబుతుంటారు.  మన పురాణ కథల్లో కూడా గంజాయి గురించి ఉన్నట్టు చెబుతుంటారు.
గంజాయి గురించి దాని ఔషధ లక్షణాల గురించి అధర్వణ వేదంలో ప్రస్తావన ఉంది. గంజాయి జబ్బులను నయం చేస్తుందని, రాక్షసులతో పోరాడటానికి ఉపయోగపడుతుందని ఇందులో ఉంది. దీన్ని అనారోగ్యం, నిరాశ, విపత్తులను ఎదిరించే శక్తి కోసం తీసుకునే ‘పవిత్రమైన గడ్డి’గా చూసేవాళ్లు. ఆయుర్వేద గ్రంథం ‘శుశ్రుత సంహిత’లో కూడా దీని గురించి ఉంది. ఈ గ్రంథాన్ని క్రీస్తుపూర్వం మూడు నుంచి ఎనిమిది శతాబ్దాల మధ్య రాశారు. ఇందులో కఫం, పిల్లికూతలు(క్యాటర్‌‌‌‌‌‌‌‌), విరేచనాలు తగ్గటానికి గంజాయిని వాడొచ్చని చెప్పారు.
పురాణాల్లో దానికున్న ఇంపార్టెన్స్‌‌‌‌ వల్ల కొందరు సాధువులు గంజాయి తీసుకోవడాన్ని ఆచారంగా భావిస్తారు. వాళ్లు  గంజాయి మొక్క ఆకుల్ని ‘చిల్లమ్‌‌‌‌’ అని పిలిచే చిన్న మట్టి పైపులో పెట్టి కాలుస్తారు. సాధువులు చిల్లమ్‌‌‌‌తో సర్కిల్‌‌‌‌ స్మోకింగ్‌‌‌‌ ఎక్కువగా చేస్తుంటారు. అయితే ఎలా ఉంతుణ్హదో ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం పూర్తిగా తన కంట్రోల్‌‌‌‌లోకి తీసుకుంటది గంజాయి. దానికి అలవాటు పడితె జీవితం నాశనం అయినట్టె. సరదాగ మొదలుపెట్టిన ఈ అలవాటు వ్యసనమవుతుంది. ఒకసారి వ్యసనమైతె.. దానికి బానిసైనట్టె.
అయితే గంజాయిని పొగ రూపంలో  సిగరెట్‌లాగా తాగితే… ఆరోగ్యానికి చాలా హానికరం. అదే గంజాయి నుంచీ తీసిన నూనెతో మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గంజాయి నూనెను సైంటిఫిక్ రూపంలో CBD అంటారు. గంజాయి మొక్క నుంచీ 104 రకాల రసాయనాల్ని సేకరిస్తారు. వాటన్నింటినీ కలిపి కన్నబినాయిడ్స్ అంటారు. వాటిలో నూనె అనేది ఒకటి. ఈ గంజాయిని కాన్నబిస్ లేదా మారిజువానా మొక్క అని కూడా పిలుస్తారు.
CBD వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉండటంతో… ఔషధాల తయారీలో దాన్ని ఎక్కువగా వాడుతున్నారు. CBD క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలను, క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన దుష్ప్రభావాలను, వికారం, వాంతులు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుందని గతంలో చేసిన పరిశోధనల్లో తేలింది.
 గంజాయి నూనెను కొబ్బరినూనె లాంటి వాటితో కలిపి వాడుకోవాలి. విపరీతమైన నొప్పులను, టెన్షన్లను దూరం చెయ్యడంలో ఈ నూనె చాల బాగా పనిచేస్తోంది. గంజాయి నూనెను నొప్పి నివారిణిగా  క్రీస్తుపూర్వం 2900 నుంచీ వాడుతున్నట్లు తెలిసింది. గంజాయి నూనెతో మసాజులు, మర్దనల వంటివి చేసుకుంటే, ఎంతో చల్లగా,హాయిగా ఉంటుందనీ, టెన్షన్ల నుంచీ ఉపశమనం పొందుతామని పరిశోధనల్లో తేలింది.
టెన్షన్ తగ్గేందుకు వాడే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ గా ఉంటాయి. అదే ఈ నూనె వాడితే అలాంటివి చాలా తక్కువ గాఉంటాయి అంటున్నారు డాక్టర్లు.CBD ఆయిల్‌తో తలకు మర్దన చేసుకుంటే, చక్కగా నిద్ర పడుతుందట. బ్రెయిన్‌ మత్తులోకి జారుకొని… కలల ప్రపంచంలోకి తీసుకెళ్తుందట.
ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, మొటిమలు, మచ్చల ను పూర్తిగా తగ్గిస్తాయట. మతిమరపు లక్షణాలు తగ్గాలన్న  ఈ  నూనెతో తలకి మసాజ్ చేసుకోవాలి. అల్జీమర్స్, పార్కిన్‌సన్స్ వంటి వ్యాధుల నుంచీ మనల్ని ఈ నూనె బాగా కాపాడుతుంది.
హైబీపీని తగ్గించడంలో కూడా CBD ఆయిల్ బాగా పనిచేస్తోంది. గంజాయి నూనె వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆకలి ఎక్కువగా వేస్తుంది. డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. కొంతమంది అలసటగా ఉన్నట్లు అనిపిస్తోందని కూడాచెప్పారు. అందువల్ల డాక్టర్ల సలహా తీసుకున్న తర్వాతే ఈ నూనె వాడటం అన్నివిధాలా మంచిదంటున్నారు

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,620,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR