రుద్రాక్షలు ఎన్ని రకాలు ? ఎవరు ఏ రుద్రాక్షను ధరించాలి?

రుద్రాక్షలను శివ స్వరూపాలుగా భావిస్తారు. వీటిని సాక్షాత్తు శివుడి ఆశ్రువులు భూమిమీద పడి రుద్రాక్షలుగా ఆవిర్భవించాయని పురాణోక్తి. రుద్రాక్ష ధారణ వల్ల పలు లాభాలు కలుగుతాయి. ఆ రుద్రాక్షలు 21 రకాలు. అయితే ఎవరు ఏ రుద్రాక్షను ధరించాలి? అనేది చాలామందికి తెలియదు. ఆ వివరాలు తెలుసునే ప్రయత్నం చేద్దాం.

రుద్రాక్షప్రతి ఒక్కరికి ఒక్కో జన్మనక్షత్రం ఉంటుంది. వారి వారి జన్మనక్షత్రాల ప్రకారం రుద్రాక్షలను ధరించాలి. జన్మ నక్షత్రం ప్రకారం ధరించవలసిన రుద్రాక్షలు:

 • అశ్వని నక్షత్రం- నవముఖి నక్షత్రం
 • భరణి- షణ్ముఖి
 • కృత్తిక- ఏకముఖి ద్వాదశముఖి
 • రోహిణి- ద్విముఖి
 • మృగశిర- త్రిముఖి
 • ఆరుద్ర- అష్టముఖి
 • పునర్వసు- పంచముఖి
 • పుష్యమి- సప్తముఖి
 • ఆశ్లేష- చతుర్ముఖి

రుద్రాక్ష

 • మఖ- నవముఖి
 • పుబ్బ- షణ్ముఖి
 • ఉత్తర- ఏకముఖి, ద్వాదశముఖి
 • హస్త- ద్విముఖి
 • చిత్త- త్రిముఖి
 • స్వాతి- అష్టముఖి
 • విశాఖ- పంచముఖి
 • అనురాధ- సప్తముఖి
 • జ్యేష్ఠ- చతుర్ముఖి

రుద్రాక్ష

 • మూల- నవముఖి
 • పూర్వాషాఢ- షణ్ముఖి
 • ఉత్తరాషాఢ- ఏకముఖి లేదా ద్వాదశముఖి
 • శ్రవణం- ద్విముఖి
 • ధనిష్ట- త్రిముఖి
 • శతభిషం- అష్టముఖి
 • పూర్వాభాద్ర- పంచముఖి
 • ఉత్తరాభాద్ర- సప్తముఖి
 • రేవతి-చతుర్ముఖి

రుద్రాక్షవీటితోపాటు ఆయా కామ్యాలు నెరవేరడానికి అంటే కోరికలు, సంకల్పాలు నెరవేరడాకి కొన్ని కాంబినేషన్లలలో రుద్రాక్షలను ధరించాలని పండితులు పేర్కొంటున్నారు. విద్య కావాలనుకున్నవారు చతుర్ముఖి, ఆరోగ్యం కోసం షణ్ముఖి, గ్రహబాధలు పోవడానికి నవముఖి తదితర రుద్రాక్షలను ధరించాలి. అయితే వాటి వివరాలను పండితులు, జ్యోతిష నిపుణుల సూచనలతో ధరిస్తే మంచిది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR