ఎంత తిన్నా ఇంకా ఆకలిగా అనిపిస్తుందా… కారణాలివే!

ఆకలి అనేది ఒక భావన. మన శరీరానికి శక్తి అవసరమైనప్పుడు మెదడు భోజనం చేయాలని ఆదేశాలిస్తుంది. అప్పుడు మనకు ఆకలి అనిపిస్తుంటుంది. ఆహారం తీసుకుంటే శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. ఆక‌లి అవుతున్నా అలాగే ఉంటే త‌ల‌నొప్పి, విసుగు, ఏకాగ్ర‌త లోపించ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక ఆక‌లిని నియంత్రించుకోకూడ‌దు. ఆక‌లి అవుతుంటే త‌ప్ప‌నిస‌రిగా భోజనం చేయాలి.

eatingఅయితే సాధారణంగా మనం తీసుకొనే ఆహారం పరిమాణం బట్టి ఆకలి అనేది ఉంటుంది.ఎక్కువగా ఆహారం తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు. అదే తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకుంటే తొందరగా ఆకలి వేస్తూ ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి ఆహారం తీసుకున్న కొంతసేపటికే ఆకలి వేయటం మొదలు అవుతుంది. భోజనం చేసిన 30 నిమిషాల్లోనే మళ్లీ ఆకలి వేస్తుంది. ఏదైనా తినాలనిపిస్తుంది. పెద్దగా దాహం కూడా వేయదు. నిత్యం ఏదో ఒకటి తింటూ కూర్చోవలని అనిపిస్తుంది.

lentils and sproutsఅలా ఎందుకు జరుగుతుంది? కడుపు నిండుగా ఉన్నా.. ఆకలి ఎందుకు వేస్తుంది? దాని వెనుక ఉన్న కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం…. మధుమేహం ఉన్నవారిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కర స్థాయిలు పెరిగిన లేదా తగ్గినా ఈ సమస్య వస్తుంది.అందువల్ల మధుమేహం ఉన్నవారు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకుంటే ఈ ఆకలి సమస్య నుండి బయట పడవచ్చు. చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తూ ఉంటారు. అలాంటి వారికి మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు ఎక్కువగా ఆకలి వేస్తుంది. ఎంత తిన్నా ఆకలి వేస్తూనే ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ మానకుండా చేయాలి.

green peasప్రోటీన్ల‌ను స‌రిగ్గా తిన‌క‌పోయినా ఆక‌లి బాగా అవుతుంది. ప్రోటీన్ల వ‌ల్ల ఎక్కువ సేపు ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది. అవి త‌గ్గితే త్వ‌ర‌గా ఆక‌లి వేస్తుంది. క‌నుక ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకుంటుండాలి. దీంతో ఆక‌లిని నియంత్రించుకోవ‌చ్చు. రీఫైన్ చేయ‌బ‌డిన పిండి ప‌దార్థాలైన సోడా, క్యాండీ, బేక‌రీ ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తింటున్నా, చక్కెర ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తింటున్నా.. ఆక‌లి ఎక్కువ‌గా అవుతుంది. రోజూ మ‌నం తినే ఆహారంలో కొవ్వు ప‌దార్థాలు కూడా ఉండేలా చూసుకోవాలి. వాటి శాతం త‌గ్గితే ఆక‌లి అవుతుంది.

breakfastఒత్తిడి ఎక్కువగా ఉండేవారిలో అడ్రినలిన్, కార్టిసోల్ వంటి స్ట్రెస్ హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతాయి.దాంతో ఆకలి విపరీతంగా ఉంటుంది. ఇటువంటి వారు ఒత్తిడిని తగ్గించుకుంటే ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. ప్రతి రోజు నిద్ర అనేది రోజుకి 6 నుంచి 8 గంటల పాటు ఉండాలి. అలా కాకుండా నిద్ర సరిగా లేని వారికి కూడా ఆకలి విపరీతంగా వేస్తుంది.అందువల్ల నిద్రకు వేళలను పాటిస్తే ఆకలి సమస్య తీరుతుంది. రోజూ త‌గినంత నిద్ర మ‌న‌కు అవ‌స‌రం క‌నుక నీళ్ల‌ను కూడా త‌గిన మోతాదులో తాగాలి. లేదంటే ఆక‌లి బాగా అవుతుంది.

good sleepతినే స‌మ‌యంలో ఆహారంపై దృష్టి పెట్టాలి. లేదంటే ఎంత తింటున్నాం అనే విష‌యం తెలియ‌దు. ఫ‌లితంగా శ‌రీరం ఆక‌లి సూచ‌న చేస్తుంది. క‌నుక తినే ఆహారం మీద దృష్టి ఉంచాలి. దీని వ‌ల్ల ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. బీన్స్‌, పచ్చి బఠానీలు, శనగలు, పప్పు ధాన్యాలు, ఆకు కూరల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే అంత త్వరగా ఆకలి కాదు. దీంతో ఆకలిని నియంత్రించవచ్చు. గుడ్లు, మాంసాహారం, పెరుగు, సోయా ఉత్పత్తులను తీసుకున్నా ఆకలి కంట్రోల్‌లో ఉంటుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో ఆహారం తినాలనే యావ తగ్గుతుంది.

భోజనానికి ముందు ఫ్రూట్ లేదా వెజిటబుల్ సలాడ్లు తింటే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఇక కాఫీ తాగినా, డార్క్ చాకొలెట్లను తిన్నా ఆకలిని నియంత్రించవచ్చు. భోజనానికి ముందు సూప్ తాగితే ఆకలి నియంత్రణలోకి వస్తుంది. లేదా మంచినీటిని అయినా తాగవచ్చు. ఆలివ్ ఆయిల్‌, అవకాడో, నట్స్‌, సీడ్స్‌లలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందువల్ల ఈ ఆహారాలను కొద్దిగా తీసుకున్నా చాలు.. దాంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆకలి కంట్రోల్‌లో ఉంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,600,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR