గర్భిణీలు చింతపండు ఎంత వరకు తీసుకోవచ్చు?

గర్భం ధరించిన మహిళ జీవనశైలి, ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోతాయి. వారాలు గడుస్తున్న కొద్దీ తినే ఆహారంలో, తాగే నీరు, ఇతర ద్రవాల పట్ల, ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక గర్భం ధరించిన మొదటి నెలల్లో మహిళలకు ఎక్కువగా పుల్లటి పదార్థాలు తినాలనిపిస్తుందట. చాల మంది గర్భధారణ సయమంలో పుల్లగా ఉండే పండ్లను, ఊరగాయ, తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటి పండ్లలో చింతపండు ముందు వరుసలో ఉంటుందని చెప్పాలి.
  • ఇది మనం సహజంగా తరచూ తినే పండ్ల మాదిరి పండు కాకపోయినా గర్భిణీలకు మాత్రం చింతపండు ఎంతో మేలు చేస్తుంది. మరి దాని వల్ల గర్భిణీలకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం… చింతకాయల్లో ఉండే నియాసిన్ (విటమిన్ బి3) కడుపులోని బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది. బిడ్డ మెదడు, జీర్ణవ్యవస్థ, మ్యూకస్ తదితర అవయవాలు సరిగ్గా పెరిగేలా చేయడానికి ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • ఇక చాలా మంది గర్భందాల్చిన కొన్న రోజుల పాటు ఉదయం నిద్ర లేవగానే వికారంగా వాంతులు అయ్యేలా అనిపిస్తుంది. అలాంటి వారు చింతకాయలు లేదా కొద్దిగా చింతపండు తింటే ఫలితం ఉంటుంది. డైటరీ ఫైబర్ చింతకాయల్లో ఉండడం వలన మలబద్దకం రాకుండా చేస్తుంది. అధిక బరువు పెరగకుండా కాపాడుతుంది.
  • గర్భిణీల్లో జస్టేషనల్ డయాబెటిస్ సహజం. కాబట్టి, గర్భిణీల్లో జస్టేషనల్ డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. అలాగే క్యాన్సర్ కణాలు పెరగకుండా చూసే ఔషధ గుణాలు కూడా చింతకాయల్లో ఉంటాయి. ఇక గర్భిణీలలో హైబీపీ సమస్య ఉంటే  చింతకాయలను తీసుకోవడం మంచిది. చింతకాయలను తినడం వల్ల శిశువు నెలలు నిండకుండా పుట్టే స్థితి రాకుండా ఉంటుంది.
  • చింతపండులో ఉండే విటమిన్ సి ఆరోగ్యకరమైన న్యూట్రీషియన్ కాబట్టి దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిదే కానీ మోతాదుకు మించి విటమిన్ సి తీసుకుంటే మాత్రం గర్భిణీ స్త్రీకి ప్రమాదం అనేచెప్పాలి. దీని వలన గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయి. విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రొజెస్టరాన్ ఉత్పత్తితగ్గిపోయి గర్భస్రావానికి కారణమవుతుంది. కాబట్టి మోతాదు ముంచకుండా చూసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
  • గర్భిణీలు ఆస్పిరిన్ తీసుకోనేటప్పుడు చింతపండు తినకూడదు. యాస్పిరిన్ చింతపండుతో ఇంటరాక్ట్ అవుతుంది. చింత పండు తింటే ఆస్పిరిన్ మరింత ఎక్కువ అబ్సార్బ్ అవుతుంది. ఆస్పిరిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల గర్భస్రావానికి కారణమవ్వచ్చు. ఆస్పిరిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లేట్ ప్రెగ్నెన్సీ మరియు ప్రసవం ఆలస్యమవ్వడానికి కారణమవుతుంది . ఆస్పిరిన్ వల్ల చిన్న పిల్లల్లో హార్ట్ మరియు లంగ్స్ సమస్యలకు దారితీస్తుంది.
  • గర్భిణీలు తీసుకునే డైట్ లో జొన్నలు, రాగులు, ఓట్స్, బ్రౌన్ రైస్ ఉండేలా చూసుకోవాలి. ఇవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కలిగి ఉంటాయి. అదే విధంగా ప్రోటీన్స్ కూడా చాలా ముఖ్యం. గుడ్లు, చికెన్, చేపలు, పాలు, పన్నీర్, పప్పులు, గింజలు, నట్స్, ప్రోటీన్ షేక్ మొదలైన వాటిలో మనకు ఇవి లభిస్తాయి. వీటిని కూడా డైట్ లో ఉండేటట్లు చూసుకోండి. ఎక్కువ ఫైబర్ కలిగి ఉన్న ఆహారాన్ని కూడా తీసుకోవడం మంచిది. ఇవి ఎక్కువగా ఆపిల్, జామ. పీచ్, బెర్రీస్ మొదలైన వాటిలో ఉంటాయి.
  • అదే విధంగా మంచి కాయగూరలను తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా తోటకూర, పాలకూర, క్యాబేజి, కాలీఫ్లవర్, బ్రోకలీ ఇలాంటివి డైట్ లో ఉండేలా చూసుకోండి వీటి వల్ల మంచి ప్రయోజనాలు మీకు లభిస్తాయి. ఇదిలా ఉంటే క్యాబేజి, కాలీఫ్లవర్, క్యారెట్ లో మంచి గట్ బూస్టింగ్ గుణాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది. పసుపు, అల్లం, వెల్లుల్లి, తులసి కూడా ఆరోగ్యానికి మంచి చేస్తుంది. నిమ్మకాయ నీళ్లు, ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా తీసుకోవచ్చు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR