Home Unknown facts రాక్షసులు మరణం వెనుక ఆశ్చర్యకరమైన రహస్యాలు ఏంటి ?

రాక్షసులు మరణం వెనుక ఆశ్చర్యకరమైన రహస్యాలు ఏంటి ?

0

భగవంతుడు లోకకల్యాణం కోసం, చెడుని అంత చేసేందుకు కొన్ని అవతారాలు ఎత్తాడు. అయితే మన పురాణాల ప్రకారం కొందరు రాక్షసులు, కొందరు చెడు వైపుకి మొగ్గు చూపిన వారి మరణం వెనుక కొన్ని నిజాలు అనేవి ఉన్నాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కో వరాన్ని పొంది చావుని జయించాలని భావించారు. కానీ ధర్మం ఎప్పుడు గెలుస్తుంది కనుక వారికీ వరం ఉన్నపటికీ చావు నుండి తప్పించుకోలేకపోయారు. మరి వారు ఎవరు? ఎలా చనిపోయారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హిరణ్యకశిపుడు: 

Hiranya Kaspyaకశ్యప ప్రజాపతి భార్యయైన దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే వారు జన్మిస్తారు. అయితే హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం గోరమైన తపస్సు చేయగా ఒకరోజు బ్రహ్మ అతడి భక్తికి మెచ్చి ఏం వరం కావాలో అని కోరగా, దేవా, గాలిలో కానీ, ఆకాశంలో కానీ, భూమి పైన కానీ, నీటిలో కానీ, అగ్నిలో కానీ, పగలు కానీ, రాత్రి కానీ, దేవుళ్ళ చేత కానీ, మనుషుల చేత కానీ, జంతువుల చేత కానీ, ఆయుదాలచే కానీ అసలు నాకు మరణం ఉండకూడదు అని కోరతాడు. అప్పుడు బ్రహ్మ ఆ వరాన్ని ప్రసాదిస్తాడు, ఇలా వర గర్వముతో హిరణ్యకశిపుడు దేవతలని హింసిస్తుండగా, ఒకానొక సందర్భంలో ప్రహ్లదుని విషయంలో విసిగిపోయిన హిరణ్యకశిపుడు ఎక్కడ నీ ఈ స్తంభం నందు ఉన్నాడా అని స్థంబాన్ని పగులగొట్టగా వాటిని చీల్చికుంటూ ఉగ్ర నరసింహ రూపంలో, సగం మనిషి అవతారం, తల ఏమో సింహ భాగం తో తన ఒడిలో హిరణ్యకశిపుడు పడుకోబెట్టుకొని తన చేతి వ్రేళ్ళతో చీల్చి హిరణ్యకశిపుడుని సంహరిస్తాడు.

భస్మాసురుడు:

భస్మాసురుడు శివుడి భక్తుడు. శివుడి కోసం ఘోర తపస్సు చేయగా అప్పుడు శివుడు ప్రత్యేక్షమవ్వగా భస్మాసురుడు శివుడికి నమస్కరించి, నాకు అమరత్వాన్ని ప్రసాదించమని అడుగగా, శివుడు అమరత్వాన్ని ప్రసాదించలేను అని చెప్పడంతో భస్మాసురుడు నేను ఎవరి తలమీద చేయి పెడితే వారు భస్మం అయిపోవాలని అడుగుతాడు. దానికి శివుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. అయితే భస్మాసురుడు వరాన్ని ఎవరి మీదో ఎందుకు శివుడి మీదనే పరీక్షిద్దామని శివుడి తల పైన చేయి పెట్టడానికి ప్రయత్నిస్తుండగా శివుడు పారిపోతాడు. అయినను భస్మాసురుడు అలానే వెంటపడటంతో శ్రీమహావిష్ణువు సహాయాన్ని శివుడు కోరగా అప్పుడు శ్రీమవిష్ణువు మోహిని వేషంలో అక్కడి వచ్చి భస్మాసురుడుని దారి మళ్లించాలని చూడగా అప్పుడు భస్మాసురుడు మోహిని అందానికి ఆకర్షితుడై పెళ్లి చేసుకుంటావా అడుగగా నాతో సరిపాటుగా నాట్యం చేసి మెప్పించి చేసుకుంటాను అని చెప్పి, నాట్య భంగిమల్లో భస్మాసురుడు తన చేతిని తన తలపైనే పెట్టుకునేలా చేస్తుంది. అప్పుడు భస్మాసురుడు భస్మం అయిపోతాడు.

జరాసంధుడు:

మగధదేశానికి మహారాజైన బృహద్రథుని కి ఇద్దరు భార్యలు. వీరు కాశీరాజు పుత్రికలు, కవలలు. బృహద్రధుడు సంతానం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు చేశాడు. ఒక ముని ఒక మామిడి పండుని ఇచ్చి భార్యకి తినిపించు సంతానం లభిస్తుందని చెప్పగా ఆ రాజు పండుని కోసి సగం సగం ఇద్దరు భార్యలకు పంచగా వారు గర్భం దాల్చి ప్రసవించగా సగం సగం ఆకారాలతో అందవికారంతో ఒక రూపం జన్మించగా వారిని చూసి బయపడి వారిని వనంలో పడివేసారు. అప్పుడు జరా అనే రాక్షసి ఆ రెండు మాంసపు ముక్కలను గట్టిగ పట్టుకోగా అవి మనిషి రూపం దాల్చాయి. ఇలా జరా అనే రాక్షసుడు కలిపినందుకే రూపం దాల్చదని ఆ శిశువే జరాసంధుడు అయ్యాడు. ఇక జరాసంధుని ఆయుధాలతో చావు అనేది ఉండదు. ఇక జరాసంధుడు భీమునితో పదమూడు రోజులు పోరాడి కృష్ణుడు గడ్డిపోచను విరిచి చూపగా, భీముడు జరాసంధుని రెండు భాగాలుగా చీల్చి, రెండు సగాలుగా పుట్టినవాణ్ని రెండు సగాలుగానే చేసి యమలోకానికి పంపాడు.

వాలి మరణం:

రామాయణం లో వాల్మీకి ఒక వరం ఉంటుంది. అదేంటంటే ఎవరితో అయితే వాలి యుద్ధం చేస్తాడో ఎదురుగా యుద్ధం చేసే వ్యక్తి యొక్క శక్తిలో సగం వాలికి లభిస్తుంది. దీంతో మహాబలవంతుడు గా వాలి అందరిని ఎదిరిస్తాడు. ఒకానొక సమయంలో అన్నదమ్ములు అయినా వాలి, సుగ్రీవుడు శత్రువులుగా మారతారు. ఆ సమయంలో సుగ్రీవుడికి రాముడు అరణ్యం లో కనిపిస్తాడు. ఇక ఇద్దరికీ స్నేహం కుదిరాక జరిగిన విషయం చెప్పడంతో సుగ్రీవునికి రాముడు సహాయం చేస్తానని చెప్పి వాలితో సుగ్రీవుడు యుద్ధం చేస్తుండగా ఒక చెట్టు చాటు నుండి తన బాణంతో వాలిని హతమారుస్తాడు.

సైంధవుడు:

సింధు దేశాధిపతి అయినా వృద్ధక్షత్త్రుని కొడుకు సైంధవుడు. అయితే సైంధవుడు చిన్నతనంలో ఆడుకుంటుండగా ఏమరపాటుగా ఉన్నప్పుడు ఇతని తల నరకబడుతుంది అని ఆకాశవాణి పలుకుతుంది. అప్పుడు ఆకాశవాణి మాటలను విన్న అతడి తండ్రి వృద్ధక్షత్త్రుని బాధపడుతూ ఎవరైతే సైంధవుడి శిరస్సుని నేలపైన పడివేస్తారో వారి తల వెయ్యి ముక్కలు అవుతుందని శపిస్తాడు. అయితే సైంధవుడి పేరు జయధ్రదుడు. సింధు దేశానికి రాజు కావున సైంధవుడు అనే పేరు వచ్చింది. ఈ సైంధవుడు కౌరవుల చెల్లి అయినా దుస్సలకి భర్త. ఇతడికి స్త్రీ వ్యామోహం ఎక్కువ.

ఇక కురుక్షేత్రంలో కౌరవుల తరపున ఉన్న సైంధవుడు పద్మవ్యూహంలో ఉన్న అభిమన్యుడి మరణానికి కారణం అవుతాడు. ఆ సమయంలో సైంధవుడి ని సంహరించడం కోసం అర్జునుడు బయలుదేరి యుద్ధంలో అర్జునుడు సైంధవుడి తలని నైకివేస్తాడు. ఇక ఆ సమయంలో ఆ శిరస్సు నేలపైన పడకుండా శ్రీకృష్ణుడు ఉపాయం చెప్పడం వలన పాశు పతాస్త్రాన్ని ఉపయోగించి శిరస్సును తపస్సు చేసుకుంటున్న సైంధవుని తండ్రి అయినా వృద్ధక్షత్త్రుని ఒడిలో పడేలా చేస్తాడు.

Exit mobile version