ఆరోగ్యకరమైన పద్ధతులు పాటిస్తూ బరువు పెరిగేందుకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి

బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు దాన్ని తగ్గించుకోడానికి నానాతంటాలు పడుతుంటారు. డైటింగ్ లు, వర్క్ అవుట్ లు అంటూ తెగ కష్టపడిపోతుంటారు. అదే సన్నగా ఉన్నవాళ్లు కొంచెం లావుగా అవ్వాలి అనుకుంటే… బరువు పెరగడం ఎంత సేపు రోజూ పుష్టిగా తిని కూర్చుంటే ఆటోమెటిక్ గా బరువు పెరుగుతారు అని సింపుల్ గా సజేషన్ ఇచ్చేస్తుంటారు.

ఆరోగ్యంగా బరువు పెరగడం ఎలాఇది చెప్పడానికి సులువుగానే ఉంటుంది. కానీ కొందరు ఎంత ఆహారాన్ని తీసుకున్నా సన్నగానే కనబడుతారు. అయితే తిని కూర్చోని బరువు పెరగాలని భావించేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్య పద్ధతులు పాటించకుండా బరువు పెరిగితే ఆరోగ్య సమస్యలు తలెత్తె ప్రమాదం ఉంది.

ఆరోగ్యంగా బరువు పెరగడం ఎలామరి ఆరోగ్యకరమైన పద్ధతులు పాటిస్తూ సులువుగా బరువు పెరిగేందుకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలనే విషయంలో నిపుణులు సలహాలు తెలుసుకుందాం.

ఆరోగ్యంగా బరువు పెరగడం ఎలావేరుశనగలో ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు అధిక మోతాదులో ఉంటాయి. పీనట్ బటర్ ను బ్రెడ్ పై రాసుకుని బ్రేక్ ఫాస్ట్ చేస్తే సులభంగా బరువు పెరుగుతారు. టీ, కాఫీలకు దూరంగా ఉంటూ… రోజూ ఉదయం వ్యాయామం చేయాలని, కంటి నిండా నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే సులభంగా బరువు పెరుగుతారని వారు అంటున్నారు.

ఆరోగ్యంగా బరువు పెరగడం ఎలాఒక చెంచాడు వెన్నకు ఓ చెంచాడు చక్కెరను కలిసి రోజూ ఆహారంగా తీసుకోండి. ఇలా నెలరోజుల పాటు వెన్న, చక్కెర మిశ్రమాన్ని తీసుకోవడం ద్వారా సులభంగా బరువు పెరుగుతుంటారు. వెన్నలో బరువు పెంచేందుకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి.

ఆరోగ్యంగా బరువు పెరగడం ఎలాఖర్జూర పండ్లు బరువు పెరిగేందుకు ఎంతో మేలు చేస్తుంటాయి. ఇందులో విటమిన్లు ఏ, సీ, ఇ, కే, బీ2, బీ6, థయామిన్, నియాసిన్ అధికంగా ఉంటాయి. వీటితోపాటు ప్రోటీన్, చక్కెర శాతం కూడా అధికమే. అనవసరమైన కొవ్వు పేరుకోపోకుండా మంచి కొవ్వును అందిస్తుంది. ఖర్జూరాన్ని పాలల్లో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే బరువుతో పాటు కండరాలు కూడా ధృడంగా మారుతాయి.

ఆరోగ్యంగా బరువు పెరగడం ఎలామామిడి పండ్లలో కార్బోహైడ్రేట్స్, చక్కెర, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వీటితో కండరాలు సులభంగా బరువు పెరుగుతాయి. త్వరగా బరువు పెరగాలంటే మామిడి పండును తిన్న తర్వాత వేడి వేడి పాలను తాగండి. అలా చేస్తే తొందరగా ప్రభావం కనిపిస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR