సీజనల్ వ్యాధి లక్షణాలు – కరోనా లక్షణాలను ఎలా గుర్తించాలి ?

భారతదేశంలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంబిస్తున్న విషయం తెలిసిందే… ఎంతో మంది కరోనా వైరస్ కారణంగా భయంతో వణికి పోతున్నారు. ఓ వైపు కరోనా విజృంభిస్తున్న తరుణంలో మరోవైపు తుఫాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూన్ మొదటి వారం నుంచి దేశమంతా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే, వర్షాల కారణంగా దేశంలో జ్వరాలు భారీగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

సీజనల్ వ్యాధి లక్షణాలుకాలం మారుతున్న నేపథ్యంలో వాతావరణం కూడా మారుతుంది. ఎండాకాలంలో జ్వరాలు కాస్త తక్కువగా ఉంటాయి. వర్షాలు వచ్చేసరికి సీజనల్ వ్యాధులు కొన్ని వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే కరోనా వైరస్ లక్షణాలైన జ్వరం దగ్గు జలుబు లాంటివి వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధుల్లో కూడా ఉన్నాయి. దీంతో ఏది సీజనల్ వ్యాధి ఏది కరోనా వ్యాధి అన్నది ప్రస్తుతం ఎటు తేల్చుకోలేని అయోమయ స్థితిలో ఉన్నారు చాలా మంది.

సీజనల్ వ్యాధి లక్షణాలుగతేడాది కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సీజనల్ వ్యాధులు వచ్చి దగ్గు జలుబు లాంటి లక్షణం కనిపించినా భయంతో వణికిపోతున్నారు. వాతావరణ మార్పుల వలన సీజనల్ వ్యాధులు వచ్చినప్పటికీ కరోనా వైరస్ సోకిందేమో అని భయంతో ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో పరీక్షలు చేసుకోవడానికి వెళ్లి అక్కడ కరోనా వ్యాధి బారిన పడుతున్నారు.

సీజనల్ వ్యాధి లక్షణాలుకరోనా లక్షణాలు సీజనల్ వ్యాధుల లక్షణాలు మధ్య తేడా ఉంటుంది ప్రధానంగా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుందని.. అయితే జ్వరం వచ్చిన ప్రతిసారి కూడా కరోనా టెస్ట్ కి వెళ్లడం అనవసరమని తెలియచేస్తున్నారు వైద్య నిపుణులు.

కరోనా వచ్చిన వారిలో :

  • తీవ్రమైన జ్వరం ఉంటుంది. మూడు రోజులైనా తగ్గొద్దు.
  • జలుబు ఉన్నా ముక్కు కారాదు. పొడి దగ్గు వస్తుంది.
  • రుచి, వాసన తెలియదు.
  • తీవ్రమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఉంటాయి.
  • గొంతులో నొప్పి, ఛాతిలో నొప్పి ఉంటుంది.
  • కళ్ళు ఎర్రబడతాయి.
  • వాంతులు, విరేచనాలు ఉంటాయి.

సీజనల్ వ్యాధి లక్షణాలుసీజనల్ వ్యాధుల లక్షణాలు

  • సాధారణ జ్వరం ఉంటుంది. మూడు, నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది.
  • జలుబుతో ముక్కు కారుతుంది. కఫంతో కూడిన దగ్గు వస్తుంది.
  • రుచి, వాసన తెలుస్తుంది.
  • సాధారమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఉంటాయి.
  • గొంతులో నొప్పి ఉంటుంది,
  • ఛాతిలో నొప్పి ఉండదు.
  • కళ్ళు ఎర్రబడవు.
  • వాంతులు, విరేచనాలు ఉంటాయి.

ఈ లక్షణాలు గమనించి కరోనాకి, సీజనల్ వ్యాధులకు మధ్య వ్యత్యాసం తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డెంగీ, చికెన్‌గున్యా, స్వైన్‌ప్లూ, ఇన్‌ప్లూయంజా.. ఇవన్నీ వైరస్‌ సంబంధిత వ్యాధులే. ఇందులో కొన్ని ఫిజికల్‌ కాంటాక్టు ద్వారా వస్తాయి. కాబట్టి వీలైనంత దూరంగా ఉండాలి. అయితే ఇక్కడ ఊరటనిచ్చే విషయం ఏమిటంటే శరీరంలో ఒక వైరస్‌ ఉంటే.. రెండో వైరస్‌ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంటుంది. అందుకు కారణం.. యాంటీబాడీలు అప్పటికే యాక్టివేట్‌ అవ్వడం. కొత్త వైరస్‌ రాగానే దానిపై దాడిచేయడం. మాస్కులు, భౌతిక దూరం వల్ల వీటి వ్యాప్తి జరగలేదు. కాబట్టి కరోనా వచ్చిన వారు వేరే వైరస్ బారిన పడే అవకాశం చాలా తక్కువ.

సీజనల్ వ్యాధి లక్షణాలుకరోనా కట్టడికి ప్రభుత్వాలు, ప్రజలు తీసుకుంటున్న చర్యలు కూడా ఇతర సీజనల్‌ వ్యాధుల తగ్గుముఖానికి కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కరోనా కట్టడి చర్యలు.. సీజనల్‌ వ్యాధుల వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి దోహదపడతాయి. తరచూ డిస్‌ఇన్ఫెక్షన్‌ స్ర్పే చేయడం, బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లడం, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడడం వంటి చర్యలు గ్రామాల్లో సైతం ఒక నిత్యకృత్యంగా మారిపోయాయి. ప్రజలూ పరిశుభ్రతను పాటించడం, శానిటైజర్ల వినియోగం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, మాస్కులను ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. ఇంట్లో వండిన ఆహారాన్నే తింటున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుకుంటున్నారు. మల్టీ విటమిన్‌ ట్యాబ్లెట్లను తీసుకుంటున్నారు. అంటువ్యాధులకు అడ్డుకట్ట వేయడంలో ఈ చర్యలు ఇతోధికంగా దోహదపడతాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR