Home Health శరీరానికి ఇమ్మ్యూనిటి తగ్గుతుందని ఎలా తెలుసుకోవాలి?

శరీరానికి ఇమ్మ్యూనిటి తగ్గుతుందని ఎలా తెలుసుకోవాలి?

0
immunity

కోట్ల ఆస్తి ఉన్నా మంచి ఆరోగ్యం లేకపోతే సంపాదించిన అర్థం ఉండదు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. మనం తినే ఫుడ్, సరైన నిద్ర, వ్యాయామం ఇవన్నీ కూడా మన శరీర రోగనిరోధకవ్యవస్దను బలంగా మారుస్తాయి.ముఖ్యంగా రోగ నిరోధక శక్తి శరీరంలో సన్నగిల్లినప్పుడు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వచ్చి మీద పడిపోతూ ఉంటాయి.

అసలు ఇమ్యునిటీ పవర్ తగ్గింది అని ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.. చాలా మంది తరచూ జలుబు, దగ్గు, ఇన్ ఫెక్షన్, జ్వరం ఇలాంటివి ఎదుర్కొంటారు.. నెల గడిచే లోపు ఇలా జలుబు, ఒత్తిడి, జ్వరం లాంటివి తగ్గి మళ్లీ వేధిస్తున్నాయి అంటే కచ్చితంగా మీకు ఇమ్యునిటీ పవర్ తగ్గినట్లే గుర్తించాలి అంటున్నారు వైద్యులు. ఇమ్మ్యూనిటి పవర్ తగ్గితే గాయాలు కూడా వెంటనే మానవు.

ఇంకొందరికి తరచూ ఒంటి నొప్పులు, కాళ్లు మోకాళ్ల నొప్పులు వస్తాయి. ఇలాంటివి కూడా ఇమ్యునిటీ పవర్ లేకపోతేనే వచ్చే సమస్యలు.

ఇమ్యూనిటీపవర్ వీక్ గా ఉన్నప్పుడు ఆరోగ్య సమస్య తో బాధపడుతూ ఉంటారు. తరచూ ఇలాంటి సమస్య వస్తోందంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించండి.

 

Exit mobile version