చిలగడదుంపలు కల్తీవా, మంచివా తెలుసుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసా ?

మనం మార్కెట్ లో కూరగాయలు, పండ్లు తీసుకుంటప్పుడు తాజాగా ఎటువంటి మరక లేకుండా మంచి రంగులో ఉన్నవి చూసి తీసుకుంటాం. అయితే కంటికి ఇంపుగా కనిపించేవి అన్నీ మంచివి కాదు. మంచి ఆకర్షనీయమైన రంగులో కనిపిస్తుంది అంటే దానిపై రంగు కలిపి ఉంటారు అనే విషయం తెలుసుకోవాలి.

Sweet Potatoఎందుకంటే నేచురల్ గా వచ్చేదానికి అంత రంగు రాదు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పండ్లు కూరగాయలు చాలా మంది నేరుగా మార్కెట్ నుంచి తీసుకువచ్చి కడగకుండా నేరుగా అలాగే కూర వండడమో, పచ్చిగా తింటామో చేస్తూ ఉంటారు. కానీ వాటిపై ఎన్ని రంగులు చల్లుతున్నారు, అవి కల్తీవా, మంచివా తెలుసుకోవాలి.

Sweet Potatoఇప్పుడు చిలగడదుంపలు కల్తీవా, మంచివా తెలుసుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూద్దాం… రోడమైన్ బి అనేది ఒక పారిశ్రామిక రంగు. ఇది విషపూరితమైనది. ఇది నీటిలో కలిపి దేనిమీద అయినా రాస్తే అది ఎర్రగా మారుతుంది, కొన్నిసార్లు గులాబీరంగులో మారుతుంది.

Sweet Potatoదీనిని కూడా కొందరు ఎర్రగా దుంపలు కనిపించడానికి రాస్తున్నారు. మరి కల్తీవి ఎలా గుర్తించాలి అంటే, కొంచెం కాటన్ ను తీసుకుని వెజిటల్ నూనెలో ముంచండి. తర్వాత చిలగడ దుంప తీసుకోవాలి, ఆ దుంపపై కాటన్ రుద్దండి, కాటన్ కు ఎరుపురంగు అంటుకుంటే అది రంగు కలిపింది. లేదు సాధారణంగా ఉంటే అది మంచిది. చిలకడ దుంప కల్తీది అయితే కాటన్ ఎర్రటి వైలెట్ రంగులోకి మారుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,750,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR