పాలు పొంగి స్టవ్ పాడవుతుందా? ఈ చిట్కాలు పాటించండి!

వంటగదిలో పాలు పొంగడం అనేది ప్రతి ఇంటిలోనూ జరిగేదే. స్టవ్ దగ్గర ఉన్నంతసేపు చలనం లేకుండా ఉండే పాలు అలా ఒక్కనిమిషం పక్కకు తిరగగానే పొంగిపోతాయి. రోజూ కాకపోయినా వారానికి రెండు, మూడుసార్లు తప్పనిసరిగా ప్రతీ ఇంట్లోనూ ఈ పొంగుడు కార్యక్రమం మామూలే. అవి పొంగడం, ఆ తరువాత స్టౌ శుభ్రం చేసుకోవడం..ఇదంతా పెద్ద తలనొప్పి.

3-Mana-Aarogyam-786పాలు పొంగకుండా ఉండాలంటే, సన్నటి మంట పైన (సిమ్ లో పెట్టి) మరిగించాలి. కాకపోతే ఇలా చేసే సమయంలో పాలు కాగడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. హడావిడి జీవితాలకు అలవాటు పడిన మనం అంత ఓపికగా లుక్ ఉండలేము.

శుభకార్యానికి ముందు ఇంట్లో పాలు పొంగితే మంచిదే కానీ సమయం సందర్భం లేకుండా పాలు పొంగకుండా జాగ్రత్త పడాలి. దీనివల్ల ధననష్టం. అంతేకాదు.. పాలు మంట మీద పడటం ద్వారా వచ్చే గాలి మంచిది కాదు. మరి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి? పాలు కాగబెట్టే గిన్నెలో ఓ గరిటె పెట్టండి. దీనివల్ల పాలు కాగినప్పుడు అందులోని ఆవిరి బైటికి పోవడానికి దారి ఏర్పడడం వల్ల పొంగకుండా ఉంటాయి.

4-Mana-Aarogyam-786మన అమ్మలు, అమ్మమ్మలు పాలు లేదా నీళ్లు మరిగించే గిన్నెపై చిన్న చెక్క గరిటె ఉంచుతారు. గిన్నెలోని పాలు, నీళ్లు పొంగకుండా ఉండాలంటే, దానిపై చెక్క స్పూన్ ఉంచడం మంచి మార్గం. దీనివల్ల మీగడ బయటకు రాకుండా ఉంటుంది. ఇది మనం పాత పద్ధతిగా కొట్టి పారేసినా.. ఈ ట్రిక్ చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు.. దీని వెనుక చిన్న సైన్స్ కూడా ఉందట.

2-Mana-Aarogyam-786చెక్కకి రెండు లక్షణాలు ఉంటాయి. ఇది నీటిని పీల్చుకుంటుంది. రెండోది చెక్క మంచి ఇన్సులేటర్‌లా పనిచేస్తుంది. వేడిని కూడా పీల్చుకుంటుంది. చెక్క గరిటను గిన్నెపై ఉంచినప్పుడు.. గరుకుగా ఉండే దాని ఉపరితలం, మరుగుతున్న నీరు లేదా పాలపై ఏర్పడుతున్న నీటి ఆవిరి బిందువులను పీల్చుకుంటుంది. అలా గిన్నె నుంచి పాలు లేదా నీరు పొంగకుండా కాపాడుతుంది.

దీంతోపాటు నీటి బుడగలు ఒకదానికి మరొకటి దగ్గరగా కాకుండా కూడా చెక్క గరిట కాపాడుతుంది. దీనివల్ల నీటి సర్ఫేస్ టెన్షన్ తగ్గుతుంది. స్టీల్ లేదా అల్యూమినియం స్పూన్లతో పోలిస్తే ఇది నీటి బిందువులను, ఆవిరిని ఎక్కువగా పీల్చుకుంటుంది. హీట్ రెసిస్టెంట్‌గా కూడా పనిచేస్తుంది.

పాలు వేడిచేసేముందు గిన్నె అడుగున చిన్న స్టీల్ ప్లేట్ వేసినా ఫలితం ఉంటుంది. పాలు పొంగు వచ్చేటప్పుడు కొన్ని చన్నీళ్లు చిలకరించినా పొంగు ఆగిపోతుంది. గిన్నె అంచున కొంచెం నెయ్యి రాసి పాలు మరిగిస్తే పొంగవు. నెయ్యిలోని గ్రీజ్ లాంటి పదార్థం పాలని పొంగనివ్వకుండా చూస్తుంది. ఒకవేళ పొంగినా గిన్నెకి మరకలు కావు.

7-Mana-Aarogyam-786పాలు కాగబెట్టడానికి బాయిలర్ వాడుతున్నట్టైతే.. అది డబుల్ బాయిలర్ అయి ఉండేలా చూసుకోండి. లేదంటే ఓ పెద్ద పాన్ లో నీళ్లు వేడిచేసి అందులో చిన్నగిన్నెలో పాలు పోసి కాగబెట్టండి. దీనివల్ల పాలు పొంగవు.

మైక్రోవేవ్ లో పాలు వేడిచేస్తున్నట్లైతే..ఇది చాలా ఈజీ. ఒక కప్పు లేదా 250 మి.లీ పాలు 45 సెకన్లలో గది ఉష్ణోగ్రతకు వచ్చి 2.5 నిమిషాల్లో మరుగుతాయి. ఇలాగే 500 మి.లీ పాలను వేడి చేయడానికి 5 నిమిషాలు పడుతుంది. అయితే మైక్రోవేవ్‌లో పాలను వేడి చేయడానికి మైక్రో సేఫ్ పాత్రను ఉపయోగించాలని గుర్తుంచుకోండి

1-Mana-Aarogyam-786

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR