యాంటీ బాడీస్ అంటే ఏంటి? వాటిని ఎలా పెంపొందించుకోవాలి

కరోనా వైరస్ మహమ్మారి నుంచి రక్షణగా ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చేసింది. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగానే..కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. వ్యాక్సిన్ వాడుతున్నప్పటికీ కరోనా మాత్రం అదుపులోకి రావడం లేదు. కరోనా సోకిన వ్యక్తుల్లో చాలా మంది ఇళ్ళకే పరిమితమైన కొన్ని మందులు.. మరికొన్ని జాగ్రత్తలు పాటించి గట్టెక్కుతున్న పరిస్థితి. కానీ మరికొందరు మాత్రం ఆస్పత్రుల పాలై లక్షలాది రూపాయలు వెచ్చించి కరోనా నుంచి బయటపడుతున్నారు. ఇలాంటి వారికి ఇచ్చే చికిత్సతో వారిలో యాంటీ బాడీస్ డెవలప్ అవుతాయి. ఆ యాంటీ బాడీస్ కారణంగానే కరోనా సోకిన వ్యక్తుల కోలుకుంటున్నారు.

యాంటీ బాడీస్అసలు యాంటీ బాడీస్ అంటే ఏంటి? వాటిని ఎలా పెంచుకోవాలి? యాంటీ బాడీస్ అంటే వ్యాధి నిరోధక శక్తి. అంటే మన శరీరంలో చొరబడే కరోనా లాంటి వ్యాధులను ఎదుర్కొనే శక్తి మన శరీరం కలిగి వుండటం. దాన్ని పెంచుకోవడం కోసం మనం వ్యాక్సిన్లు వేసుకుంటున్నాం. అసలు వ్యాక్సిన్‌ లేకుండానే యాంటీబాడీలను బాగా పెంచుకుంటే అప్పుడు కరోనా సోకినా దానితో శరీరం పోరాడగలదు. అమెరికాలో ఆల్రెడీ కరోనాను జయించిన వారి నుంచి యాంటీ బాడీస్ సేకరించి కరోనా పేషెంట్లకు ఎక్కిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు కరోనాకు యాంటీబాడీసే వ్యాక్సిన్ లాంటివి. దాని కోసం మందుల మీద ఆధార పడకుండా మనం తీసుకునే ఆహారంతోనే శరీరంలో యాంటీ బాడీస్ ను పెంచుకోవచ్చు. అయితే యాంటీ బాడీస్ ఏం తింటే కుప్పలుతెప్పలుగా పెరుగుతాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

యాంటీ బాడీస్రోజూ మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు ఉండేలా చూసుకుంటే, మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా ఎన్నో వ్యాధులను తరిమి కొట్టొచ్చని వైద్య ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు చెబుతున్నాయి.ప్రొటీన్ అధికంగా వుండే మాంసం, చికెన్, గుడ్లు బాగా తినాలి. అంతేకాదు మొలకలు, జీడిపప్పు, బాదం వంటి వాటిలో ప్రోటీన్స్ బాగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. వీటిని కూడా మితంగా నే తీసుకోవాల్సి వుంటుంది. ఉడకబెట్టినవి, పులుసు వంటలు ఎక్కువగా తినండి. వేపుళ్లు, మసాలాలు తగ్గించండి. బాడీలో కొవ్వు రాకుండా చూసుకోండి. అప్పుడు యాంటీబాడీస్ పెద్ద సంఖ్యలో తయారవుతాయి.

యాంటీ బాడీస్ఫ్రూట్స్ బాగా తినాలి. ఏ సీజన్లో దొరికే పండ్లను రెగ్యులర్ గా తీసుకుంటూ వుండాలి. విటమిన్ A, C, E ఉండే పండ్లు బాగా తినండి. నిమ్మకాయలు, కమలాలు, బత్తాయిలు, ద్రాక్ష వంటి సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తింటే… యాంటీబాడీస్ బాగా పెరుగుతాయి. వాటితో పాటు టమాటాలు, పుచ్చకాయ, బొప్పాయి, బ్రకోలీ ఇవన్నీ తినేయాలి.

యాంటీ బాడీస్మద్యం తాగడం మానేయాలి ఎందుకంటే యాంటీ బాడీస్‌ని చంపేస్తుంది. కరోనాని కట్టడి చేయడానికి లాక్ డౌన్ పెట్టినా అది మందుబాబులను ఆపలేకపోయింది. కానీ మద్యం కంటే ప్యాయానం ముఖ్యం కదా! ప్రాణం ఉంటె తరువాత ఎంతైనా తాగొచ్చు. కరోనా సమయంలో మాత్రం యాంటీబాడీస్‌ని కాపాడుకొని తీరాలి.

యాంటీ బాడీస్నడక ఆరోగ్యానికి మంచిది. అందుకే రోజూ ఓ అరగంటైనా ఖచ్చితంగా నడవాలి. కుదరకపోతే కనీసం 10 నిమిషాలైనా నడవాలి. అలాగే ఒళ్లంతా వంగేలా రకరకాల పనులు చేసుకోవాలి. ఆల్రెడీ లాక్‌డౌన్ కాబట్టి మన పనులు మనమే చేసుకుంటాం. ఇంటిని శుభ్రం చేసుకోవడం, మొక్కలకు నీళ్లు పొయ్యడం ఇలా ఏవో ఒక పనులు చేస్తుంటే శారీరక శ్రమ ఉంటుంది. అయితే కొంతమందిలా గంటలతరబడి జిమ్‌ ఎక్సర్‌సైజ్‌లు చెయ్యవద్దు. అలా చేయకూడదు, దాని వల్ల తెల్లరక్తకణాలకు సమస్య వస్తుంది.

యాంటీ బాడీస్శరీరాన్ని మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. టెన్షన్ లేని జీవితాన్ని అలవరుచుకోవాలి. ఏ పనైనా అవుతుందిలే అని మనసులో గట్టిగా అనుకోవాలి. మైండ్ ని రిలాక్స్ చేయడం కోసం యోగా చెయ్యండి. ఇంట్లో పెంపుడు జంతువులతో కాసేపు ఆడుకోండి. కామెడీ బిట్లు చూడండి. చిన్న పిల్లలతో కాస్త సమయం గడపండి. మీకు ఇష్టమైన పని చెయ్యండి. ఇష్టమైన వాళ్లతో మాట్లాడండి ఇలా చేయడం వల్ల ఒత్తిడి పరారవుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,690,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR