స్ట్రెచ్ మార్క్స్ ఎందుకొస్తాయి? సహజంగా ఎలా తగ్గించుకోవాలి?

గర్భం దాల్చినప్పటి నుండి డెలివరీ అయ్యేంత వరకు మహిళల శరీరాకృతిలో ఎన్నో మార్పులు సంభవిస్తుంటాయి. గర్భం ధరించినప్పటి నుంచి తొమ్మిది నెలల వరకు గర్భంలో బిడ్డ ఎదుగుదలను బట్టి పొట్ట ఎత్తు పెరుగుతూ వస్తుంది. అయితే ప్రసవానంతరం పొట్ట తిరిగి మామూలు స్థితిలోకి రావాలి. కానీ చాలామంది మహిళల్లో ప్రసవం అయిన తర్వాత కూడా పొట్ట కాస్త ఎత్తుగానే కనిపిస్తుంటుంది. ఒకరకంగా చెప్పాలంటే.. వారిని చూస్తే మళ్లీ గర్భం ధరించారేమో అనిపిస్తుంటుంది.
pregnent
ఇక ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ బరువు పెరుగుతారు.. దాని వల్ల పొట్ట భాగంలో గీతలు పడే అవకాశం ఉంటుంది. పొట్ట భాగంలో స్కిన్ వెనకాల ఫైబర్ కాస్త విరిగిపోవడం వల్ల ఇలాంటి గీతలు కనిస్తాయని తెలుస్తుంది. అంతేకాదు కవలలు కడుపులో ఉన్నా.. కడుపులో బేబీ వెయిట్ ఎక్కువగా ఉన్న ఈ గీతలు వస్తాయట. కేవలం పొట్టమీద మాత్రమే కాదు తొడలు, చాతిపై కూడా ఈ గీతలు వచ్చే అవకాశం ఉంది.
సాధారణంగా అధికబరువు, సెడెన్ గా బరువు తగ్గడం వల్ల ఇవి ఏర్పడుతుంటాయి. ఫ్యాట్ కణాలు ఎక్కడ చేరుతాయో అక్కడ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. గర్భధారణ సమయంలో నార్మల్ డెలివరీనా, సిజేరియన్ అనా తేడా లేకుండా స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడటం అనేది సహజ సమస్యే అయినా చాలామంది మహిళలు అసౌకర్యంగా ఫీలవుతుంటారు.
pregnent
ఈ స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించేందుకు కొన్ని సర్జరీలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాస్కులర్ లేజర్, టంమ్నీ టక్స్ మరియు ఫ్రాక్షనల్ లేజర్ చికిత్స లాంటివి. అయితే వీటి వలన అనేక ప్రమాదాలు కలగవచ్చు, కాబట్టి వీటిని తగ్గిచుకోవడానికి ఇంటి చిట్కాలను వాడటమే మంచిది. గర్భిణీగా ఉన్నప్పటి నుండే బాదం నూనె, కోకోవా బటర్ తో పొట్ట భాగాల్లో మసాజ్ చేసుకుంటూ ఉంటే స్ట్రెచ్ మార్క్ వచ్చే అవకాశం ఉండదు.
పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత గర్భిణీలో ఏర్పడే స్ట్రెచ్ మార్క్ ను తొలగించుకోవడానికి అలోవెర గ్రేట్ గా సహాయపడుతుంది . దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే స్ట్రెచ్ మార్క్స్ కనపడకుండా చర్మంలో కలిసిపోతాయి . అంతే కాదు, ఇతర స్కిన్ సమస్యలను నివారించడంలో అలోవెర గ్రేట్ గా సహాయపడుతుంది. దీనికోసం స్ట్రెచ్ మార్క్స్ ఉన్నప్రదేశంలో అలోవెర జెల్ అప్లై చేసి డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి
pregnent
తేనెలోని యాంటీ-సెప్టిక్ గుణాలు స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించేందుకు చక్కగా తోడ్పడతాయి. ఒక వస్త్రంపై తేనె రాసి, ఈ వస్త్రంను చారలపై ఉంచండి. తేనె ఆరిన తరువాత, వెచ్చని నీటితో కడగండి. దీనిని స్క్రబ్ లా కూడా ఉపయోగించవచ్చు. తేనె, ఉప్పు మరియు గ్లిసెరిన్ ను కలిపి చారలపై మృదువుగా మర్దన చేయండి. 5 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి.
pregnent
పొటాటో జ్యూస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ స్ట్రెచ్ మార్క్స్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. బంగాళదుంపను కట్ చేసి తురుముకోవాలి. తురిమిన బంగాళదుంపను ఒక క్లాత్ లో వేసి స్క్వీజ్ చేయాలి. రసం తీశాక దీన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే స్ట్రెచ్ మార్క్స్ సులభంగా తొలగిపోతాయి. ఈ పొటాటో జ్యూస్ ను ఒక సారి అప్లై చేసిన తర్వాత , డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి.
pregnent
షుగర్, బాదం నూనె, విటమిన్ ఈ ఉండే క్రీం తో పాటుగా కలబంద రసాన్ని కలుపుకుని ఆయిల్ గా తయారు చేసుకుని దాన్ని స్ట్రెచ్ మార్క్స్ మీద రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. చక్కెర చర్మపు చారలను తొలగించేందుకు చక్కెర ఒక ఉత్తమ సహజ నివారిణి. స్నానం చేసే ముందు ఒక చెంచా చక్కెరను కొద్దిగా బాదాం నూనె మరియు నిమ్మరసంలో కలుపుకొని, చారలపై రాసి కొన్ని నిమిషాలపాటు మర్దన చేయండి. ఇలా ఒక నెల రోజులు చేయటం వలన మీ స్ట్రెచ్ మార్క్స్ తగ్గడాన్ని గమనించవచ్చు. అలాగే ఆముదం ద్వారా కూడా పొట్టపై గీతలను పోగొట్టవచ్చు. నిమ్మరసం కూడా స్ట్రెచ్ మార్క్ పై రాసుకోవచ్చు.
pregnent1

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR