This Hyderabadi Guy’s Short Story About Lockdown Is Freaking Relatable & Totally Spot On

Contributed By: keenimages

After 8 days అనుకుంట హాస్పిటల్ పని మీద బయటకు వచ్చి దారిలో మిత్రులను బయటి ప్రపంచాన్ని చూడటానికి వెళ్ళా.

1 Raghuvaran Btechఎప్పుడో ఒక సారి కార్ లేదా బైక్స్ పైన జనాలు , చాలా ప్రశాంతమైన రోడ్లు , సౌండ్ పొల్యూషన్ లేదు, స్వచ్ఛమైన గాలి లో చాలా నీరసంగా తమ డ్యూటీ నిర్వహిస్తున్న పోలీసులు కొట్టటం ఆపేశారో లేక అలిసిపోయి కొట్టటం లేదో , చాలా మర్యాదగా వివరాలు కనుక్కొని పంపారు పంపిస్తున్నారు. , చుట్టు పక్కల ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదు, ఒకతను తనవల్ల ఇనన్ని రోజులు నిమ్మరసం , చల్లని నీళ్లు ఇచ్చివెళ్ళాడట., GHMC, అన్నపూర్ణ సెంటర్స్ వీళ్లకు సప్లై చేయలేరా ? or చేస్తున్నారేమో నాకైతే ఎక్కడా కనిపించలేదు.

4 Streetsచాలా కాళీరోడ్లు అస్సలు మనిషినే చూడనేమో ( పోలీస్వాళ్ళని తప్ప ) అనుకున్న నాకు మోతీ నగర్ ఎంటర్ కాగానే రోడ్మధ్యలో ఒక ఇద్దరు జండా అరుగుపైన బీడీ తాగుతుంటే , లెఫ్ట్ అండ్ రైట్ షాప్స్ ముందు ఆడా మగా తేడా లేకుండా చిల్ అవుతున్నారు. ఫోటో తీద్దాం అనుకున్నకానీ కార్ కి నెంబర్ ప్లేట్ విరిగిపోవటం తో ఎక్కడా ఆగకుండా నా డెస్టినేషన్ కి బయలుదేరా…

3 Peopleఇందాక స్వచ్ఛమైన గాలి అనగానే మన హైదరాబాద్ లో ఆక్సిజన్ లెవెల్స్ ఏంటోచూద్దాం అని ట్రై చేశా…ఒక్క సనత్ నగర్ ఏరియా తప్ప మిగిలిన అన్ని ప్లేసులు డేంజర్ జోన్ లోనె వున్నాయి.

7 Pollution 1How is it possible ? నేనొక్కడినే దిగ్బంధం లో ఉన్నానా ?

కిరాణా షాప్స్ , మెడికల్ షాప్స్ అక్కడక్కడా పాన్షాప్స్ ఓపెన్ వున్నాయి., మంచిదే కానీ త్రిపుల్ రైడర్స్ నుంచి గల్లీ గ్యాంగ్స్ అన్ని రోడ్లపైనే వితౌట్ మాస్క్ శ్రీనగర్ కాలనీ, s.r నగర్ , మోతీ నగర్ మూసాపేట్ అన్ని ఏరియాలలో ఇంటీరియర్స్ లో తిరుగుతున్నారు ..

2 Empty Streetsఅలిసిపోయిన పోలీసులు మధ్యలో అనుకోకుండా కలిసిన ఒక పాతదోస్తు., పక్కా హైద్రాబాది. టీషీర్ట్ అండ్ త్రీ ఫోర్త్ షార్ట్ లో గుట్కా నములుతూ షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. మాస్క్ అడిగితే మాకు అవసరం ఏముంటది ఐనా పక్కనే కదా ఇల్లు అని రోడ్ పైనవుమ్మేస్తూ సగం దిగి వున్న కార్ అద్దంపైన చేయిపెట్టి మాట్లాడుతున్నాడు. ఇదంతా రోడ్ మధ్యలో ఆగి మాట్లాడుకుంటున్నాం..

ఇది రాస్తూ తొంభయ్ ఏళ్ళ మా అమ్మమ్మతో నోట్లో సీసం పోసి చంపేస్తా అని ఒక పదేళ్ల పిల్లకు సవతి తల్లి వార్నింగ్ ఇస్తున్న జీ తెలుగు సీరియల్ చూస్తుంటే మధ్య మధ్యలో కరోనా అవగాహనా ప్రోగ్రాం లో భాగంగా చిరంజీవి ఒక ఐదారు సార్లు ఐదు , ఐదు సెకండ్లు చెప్పి వెళ్ళిపోతున్నాడు ..

అసలు చిరంజీవి ఎవరికి తెలుసు?

నన్ను కలిసిన నా ఫ్రెండ్ కి ఇద్దరు పెళ్ళాలు ,ఇద్దరు పిల్లలు , ప్రముఖ చాకోలెట్ కంపెనీ లో మార్కెటింగ్ మేనేజర్ , హైద్రాబాద్ లోనే పుట్టి పెరిగాడు కాని ఒక్క ముక్క తెలుగు రాదు , వాళ్ళ ఏరియా , వాళ్ళ వాళ్ళున్న ఏరియాలు తప్ప ఎక్కడికి వెళ్ళడు.. ఎప్పుడో , ఎదో సందర్భం లో తెలుగు సినిమా లు చూసావా ఎప్పుడైనా అని అడిగితే ఓ బహుత్ బడా హీరో ఆటో చెలాయతా ఓ “ ఆటో జానీ “ షార్ట్ ఫిలిం టీవీ పే దేఖాత అన్నాడు..గుర్తొచ్చి గూగుల్ చేశా నిజమే..

5 Auto Jhonnyఅసలు ఇంత కేర్లెస్ గా ఎలా అని అడిగేలోపే governament బోలా తీన్ కిలోమీటర్ కె అందర్ కుచ్ భీ కర్సక్తే , బాహర్ గఏతో హడ్డియా తొడ్ర బాప్ అన్నాడు..

జనాలు గొర్రెలు అనేది సామెతగానో , సినిమా పొలిటీషన్స్ చెప్తుంటేనో వినేది ఇప్పుడు ప్రత్యక్షం గా చూస్తున్న…

6 Sheepsమీ ఇంటి పన్ను, కరెంట్ బిల్లు , నల్లా బకాయి లు సమయానికి కట్టక పోతే మీ ఆస్తులు జప్తు చేయబడును అని ఒక ఆటో లో lockdown కి ఒకరోజు ముందు బాలాపూర్ ఏరియా లో తిరుగుతుంటే చూసా.. మరి కరోనా గురించి ఎవరూ తిరగరే ? తిరిగారేమో నేను దిగ్బంధం లో వున్నా గత కొద్ది కాలంగా…

కరోనా సందేశం తో మీరు మీకంపెనీ ప్రకటనలు 50% డిస్కౌంట్ లో పొందటానికి వెంటనే సంప్రదించండి అని రేడియో లో వస్తున్న ప్రకటన వింటూ నిస్సహాయం గా ఇంటికి తిరిగి వచ్చేసా.. సార్ మందుకొట్టేటోళ్లు అపార్ట్మెంట్ లోపల కొట్టటం లేదు ఏమైనా డబ్బులిస్తే కొడతారేమో అని మా వాచ్మెన్ అడుగుతుంటే ప్రసిడెంట్ గారిని అడుగు అని చెప్పి వచ్చేసా..

ఇప్పుడు ఆ సీరియల్ లో హీరో మహేష్ బాబూ వచ్చి కుర్చీ లో కూర్చున్నాడు…సీరియల్ఐపోయిన్నట్టుంది.. సూర్యకాంతం వచ్చే టైం ఇందట ఇంక సెలవు.

గమనిక: * తెలుగు లో తప్పులుంటే గూగుల్ దే పూర్తిబాధ్యత.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR