21 రోజులు హనుమంతుని వ్రతాన్ని ఇలా ఆచరిస్తే ప్రతికూల వాతావరణం తొలిగిపోయి శుభం జరుగుతుంది!

రామ భక్తుడు హనుమంతుడు రామాయణంలో ముఖ్యమైన పాత్ర. సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవబడుతున్న దేవుడు ఆంజనేయుడు.
మంగళవారం ఆంజనేయస్వామి కి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు స్వామివారు ప్రత్యేక పూజలు అందుకుంటారు.

lord hanumanఆంజనేయ స్వామిని శ్రీరామచంద్రుడి భక్తులలో అగ్రగణ్యుడు గా భావిస్తారు. రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు, సీతాన్వేషణలో శ్రీరామునికి ఎంతో సహాయపడ్డారు.

చైత్రశుద్ధ పౌర్ణమి నాడు హనుమంతుడు అంజనా దేవి, కేసరి దంపతులకు జన్మించాడు. వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందు వల్ల ఆంజనేయుడు ఎంతో బలసంపన్నుడుగా అవతరించాడు.

hanuman and anjani deviచిరంజీవిగా ఉంటూ, నిత్యం శ్రీరామ నామస్మరణంతో శ్రీరాముని కొలుస్తూ ఉండే హనుమంతుడు మంగళవారం విశేష పూజలను అందుకుంటాడు. భక్తిశ్రద్ధలతో ఆంజనేయుడిని మంగళవారం పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని, ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగల మనోధైర్యం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

మంగళవారం ఉదయం తలంటు స్నానం చేసి, ఎరుపు రంగు దుస్తులను ధరించి ఆ హనుమంతునికి పూజ చేసి హనుమాన్ చాలీసా పఠించాలి.

hanuman chalisaఈ విధంగా 21 మంగళ వారాలు సూర్యోదయానికి ముందే పూజ చేయాలి. ఆంజనేయునికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయడం ద్వారా ఎంతో ప్రీతి చెందుతాడు. అంతేకాకుండా కేసరిని నైవేద్యంగా స్వామివారికి సమర్పించటం ద్వారా ఆ ఆంజనేయుని అనుగ్రహం మనమీద కలుగుతుంది.

betel leafమంగళవారం పూజ చేసేటప్పుడు స్వామివారికి బెల్లం ముక్కను,5 అరటి పండ్లు తమలపాకులు సమర్పించి, స్వామివారికి దీపారాధన చేయాలి. ఇలా 21 మంగళవారాలు చేయడం ద్వారా మన ఇంటిలో ప్రతికూల వాతావరణం తొలిగిపోయి, అనుకూల వాతావరణం ఏర్పడటమే కాకుండా, ఈతిబాధలు తొలగిపోయి, ఆర్థికంగా ఎంతో రాణిస్తారు.సంతానం లేని వారికీ సంతాన ప్రాప్తి కలుగుతుంది.

lord hanumanఉపాధి కోసం ప్రయత్నించేవారు 21 వారాలు ఆంజనేయస్వామికి ఈ విధంగా పూజించడం ద్వారా ఉపాధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్రతాన్ని ముఖ్యంగా పురుషులు చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందుతారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR