ఈతిబాధలు, గ్రహదోషాలు వీటన్నింటి నుంచి విముక్తి పొందాలంటే ఈ మార్గాలు తప్పనిసరి

రోజంతా కష్టపడి పనిచేసినా, బయట ఎన్ని చిరాకులు ఉన్నా ఇంటికెళ్లి కాస్త సేదతీరాలనుకుంటారు ఎవరైనా…ఎందుకంటే గృహమే సర్వసీమ అనేది మన పురాతన కాలం నుంచి నేటి వరకు వింటున్న మాట. అయితే ఇప్పుడున్న కాలంలో అనేక రకాల కారణాలతో ఇంట్లో బాధలు పెరిగి, ప్రశాంతత కరువవుతుంది.

ఈతిబాధలుదానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈతిబాధలు, గ్రహదోషాలు, నరఘోష, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నింటి నుంచి విముక్తి పొంది ఇంట్లో ప్రశాంతంగా ఉండటానికి పెద్దలు కొన్ని సులువైన మార్గాలు చెప్పారు. అవేంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం..

ముందు ఆవుపేడతో చిన్న ప్రమిదను చేసి, అందులో నువ్వులనూనె, ఒక చిన్న బెల్లపుముక్క వేయాలి. ఈ ప్రమిదను ఇంటి ప్రధాన ద్వార గుమ్మం మధ్యలో ఉంచాలి. దీనివల్ల గృహంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.

ఈతిబాధలుఒక కొబ్బరికాయకు నల్లదారం చుట్టి, పూజా స్థలంలో ఉంచాలి. ఒక రోజంతా అలా ఉంచి, సాయంకాలం ఆ దారంతో సహా కాల్చేయాలి. తొమ్మిది రోజులు ఈ ఉపాయం చేయడం వల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగుతాయి.

ఈతిబాధలుఇంట్లో తులసిమొక్క ఉంటే రోజూ సాయంకాలం దాని దగ్గర దీపం వెలిగించాలి. తులసి మొక్కకు దీపం పెట్టడం గృహానికి శుభకరం.

ఈతిబాధలుఇంటి ముఖ్య ద్వారం బయట వైపు శ్వేతార్క గణపతిని ఉంచితే శత్రు, రోగ, చోర భయాల నుండి రక్షణ లభిస్తుంది. ధన ధాన్య వృద్ధి కలుగుతుంది.

ఈతిబాధలుఈ రెమెడీస్ చేయడానికి ఒక శుభతిథి, వారం చూసుకుని చేయడం మంచిది. భక్తి, శ్రద్ధలతో నమ్మకం, విశ్వాసంతో ఈ రెమెడీస్ ఆచరిస్తే శుభఫలితాలను పొందవచ్చు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR