ప్రయాణం చేసేటప్పుడు వాంతులు వస్తున్నాయా ఈ చిట్కాలు ఫాలో అవండి

సాధార‌ణంగా చాలా మందికి ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు వాంతులు, వికారం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. కొంద‌రికి బ‌స్సుల్లో ప్ర‌యాణం చేస్తే వాంతులు అవుతాయి. కొంద‌రు కార్ల‌లో ఇబ్బందిగా ఫీల‌వుతుంటారు. అందుకే చాలామందికి ప్రయాణాలంటే ఇష్టం ఉన్నా బస్సు పడకపోవడంతో విరమించుకుంటుంటారు. బస్సు ఎక్కగానే వాంతి వస్తున్న ఫీలింగ్.. కడుపులో తిప్పినట్టు అనిపించి వాంతులు అవుతాయి. దాంతో తలనొప్పి, నీరసం, శరీరమంతా నొప్పిగా ఉంటుంది. ప్రయాణమంతా విసుగు వికారాలతో చేయాల్సి వస్తుంది.

వాంతులు తగ్గించే చిట్కాలుఅయితే నిజానికి ఇది అత్యంత స‌హ‌జ‌మైన విష‌య‌మే. ఇందుకు కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు డాక్టర్లు. ప్రయాణానికి ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ వాంతి సమస్యని సమర్ధంగా ఎదుర్కోవచ్చు. ప్ర‌యాణాల్లో వాంతులు కాకుండా చూసుకోవ‌చ్చు.

వాంతులు తగ్గించే చిట్కాలుఎక్కడికైనా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు దానికి ముందుగా భోజనం చేయరాదు. ఒకవేళ తినాల్సి వస్తే కొద్దిగా తీసుకోవాలి. ఎక్కువగా తింటే.. ప్రయాణంలో వాంతులు వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు.

ఈ సమస్య ఉన్నవాళ్లు ప్రయాణానికి ముందు చిన్న అల్లం ముక్కను బుగ్గన వేసుకుంటే వాంతి రాదట. ఎందుకంటే.. అల్లంలో ఉండే కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, జింక్ వంటివి మనకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. అందువల్ల, వాంతి రాకపోవడమే కాదు, అనేకరకాలుగా ఆరోగ్య ప్రదాయినిగా కూడా పనిచేస్తుంది.

వాంతులు తగ్గించే చిట్కాలుచాలామంది ప్రయాణాలు చేసేటప్పుడు మద్యం సేవిడం, పొగ తాగడం వంటివి చేస్తుంటారు. ఇలా చేస్తే.. వాంతి సమస్యను మనమే కొని తెచ్చుకున్నట్టవుతుంది. అలానే ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలను కూడా తినరాదు.

వాంతులు తగ్గించే చిట్కాలునిజానికి ఈ వాంతి సమస్య ఎక్కువగా సైకలాజికల్ ఫీలింగే. కాబట్టి, వాంతులు ఎక్కువగా వచ్చేవారు కారు లేదా బస్సు గానీ ఎక్కినప్పుడు ముందు సీట్లో కూర్చుని ప్రకృతి, పరిసరాలను ఆస్వాదించడం వల్ల కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు. అలాగే ప‌క్క‌న ఉండే కిటికీల్లోంచి బ‌య‌ట‌కు చూడ‌కూడ‌దు. నేరుగా చూడాలి. దీని వ‌ల్ల కూడా వాంతులు రాకుండా ఉంటాయి.

బస్సు ఎక్కగానే వక్కపొడిని చప్పరిస్తూ కళ్ళు మూసుకున్నా.. వాంతుల నుంచి బయట పడవచ్చు. లేదంటే లవంగాలు, సోంపు వంటివి దవడ కింద పెట్టుకుని చప్పరించినా, నములుతూ ఉన్నా కూడా వాంతులు రావు.

వాంతులు తగ్గించే చిట్కాలుప్రయాణంలో వాంతులు రాకుండా ఉండాలంటే.. పుదీనా ఆకులను నమిలినా, పుదీనా టీ తాగినా సమస్య తగ్గుముఖం పడుతుంది.

వాంతులు తగ్గించే చిట్కాలుఎక్కువగా ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసేటప్పుడు, బస్సు మలుపులు, కుదుపుల వల్ల కూడా ఈ వాంతి సమస్య మరింత ఎక్కువవుతుంది. అలాంటప్పుడు నిమ్మ వైద్యంతో కూడా వాంతిని అరికట్టవచ్చు. నిమ్మకాయను నలుపుతూ, ఆ నిమ్మ వాసనని ముక్కుతో పీలిస్తే కూడా వాంతుల సమస్యను దూరం చేస్కోవచ్చు. ఇలా చేయడం వలన కూడా ప్రయాణంలో వాంతులు రాకుండా చూసుకోవచ్చును.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR