Home Health జామాకుల టీ గురించి తెలిస్తే ఇకమీదట ఇదే తాగుతారు!

జామాకుల టీ గురించి తెలిస్తే ఇకమీదట ఇదే తాగుతారు!

0
ప్రకృతితో మనిషికి విడదీయరాని అనుబంధం ఉంది. మనం గుర్తించలేకపోతున్నాం కానీ మనకు ఎదురయ్యే ప్రతీ సుమస్యకు ఈ ప్రకృతిలో సమాధానం దొరుకుతుంది. మనిషికి ఉపయోగపడే విధంగా మొక్కలు, జంతువులు ఎన్నో జన్మించాయి. మన ఆరోగ్యానికి మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ మనం వాటిని పెద్దగా పట్టించుకోము. ప్రతి చిన్న సమస్యకి మనము మందులు వేసుకోకుండా ప్రకృతి మనకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలను మనకు అందించింది.
డెంగ్యూ అనగానే చాలా భయపడుతుంటారు. ఎందుకంటే ఇది వచ్చిందంటే ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోతుంది. ప్లేట్లెట్ కౌంట్ పెంచడానికి జామ ఆకులు ఎంతగానో సహకరిస్తాయి. 9 జామ ఆకులను తీసుకొని మూడు కప్పుల నీటిలో వేసి మరిగించి అవి ఒక కప్పు నీరు అయ్యాక దించి చల్లారాక ఆ నీటిని డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఇస్తే ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. ఇలా రోజుకి మూడు కప్పులు ఇవ్వాలి.
పేదవాడి యాపిల్ గా పిలుచుకొనే జామకాయ తింటే ఎన్నో ఉపయోగాలున్నాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. కానీ అంతే స్థాయిలో జామ ఆకులు కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. మనకు వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలను ఈ జామ ఆకుతో నివారించుకోవచ్చు..
జామ ఆకులను శుభ్రంగా కడిగి నమలితే పంటి నొప్పి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.. చివుర్లు నొప్పి ఉన్నా.. నోట్లో పూత ఉన్నా జామ ఆకులు నమిలితే సమస్య నుంచి నివారణ లభిస్తుంది. రక్తం లో ఉన్న గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఈ ఆకుల్లో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి2 కణాల నిర్మాణంలో సహాయపడుతుంది. బి3, బి5, బి6 విటమిన్స్ చర్మ సౌందర్యానికి చాలా మంచివి.
పీరియడ్స్ సమయంలో చాలా మంది మహిళలు పొట్ట నొప్పితో బాధపడతారు. ఈ నొప్పిని జామ ఆకుల రసం ఈ నొప్పులను అదుపుచేస్తుంది. ముఖ్యంగా జామ ఆకులతో టీ తయారు చేసుకొని తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయి. జామాకులను శుభ్రంగా కడిగి.. నీటిలో వేసి మరిగిస్తే టీ తయారు అవుతుంది.. ఈ టీ ని రోజులో కొద్దిగా కొద్దిగా తాగుతుంటే అనేక ప్రయోజనాలున్నాయి.
అధిక కొవ్వు ఉన్న వారు ఈ టీ తాగితే మంచిది.  అజీర్ణ సమస్యలనుంచి ఆస్తమా నుంచి ఈ టీ ద్వారా విముక్తి లభిస్తుంది. జామ ఆకుల నుంచి తయారు చేసిన టీ మధుమేహ వ్యాధి గ్రస్థులు తాగడం వల్ల వారి శరీరంలో “ఆల్ఫా గ్లూకోసైడేజ్” ఎంజైమ్ చైతన్యత తగ్గుతుంది. దానివల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. అంతేకాదు.. శరీరంలో ఉండే సుక్రోజ్ మరియు మాల్టోజ్ గ్రహించడాన్ని తగ్గించి వేస్తుందీ జామ టీ అందుకని రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
అయితే ఈ జామ ఆకు టీ ని కనీసం 12 వారాలు తీసుకోవాల్సి ఉందని.. అలా చేస్తే.. ఇన్సులిన్ ఉత్పత్తి అధికం కాకుండా.. శరీర రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. జామ ఆకుల సీక్రెట్ తెలిసిన కొంత మంది దశాబ్దాలుగా వాటితో టీ పెట్టుకొని తాగారు. కాలక్రమంలో రకరకాల కొత్త టీలు వచ్చాక… ఈ టీ కనుమరుగైంది. ఇప్పడు మళ్లీ తెరపైకి వచ్చింది.
ఈ టీలో  యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. వాటిలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు, విటమిన్ సీ, పొటాషియం, ఫైబర్ మనకు ఎంతో మేలు చేస్తాయి. జామఆకులతో తయారుచేసిన టీ ని రెగ్యులర్ గా తాగడం వల్ల ఆకలి తక్కువగా ఉంటుంది. ఈ హెల్తీ బెవరేజ్ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. చాక్లెట్స్, ఇతర ఆహారాల మీద కోరికలు కలిగినప్పుడు, జామ టీ తీసుకుని కొద్ది రోజులు గమనించండి. తప్పనిసరిగా, క్రమం తప్పకుండా బరువు తగ్గడం గమనిస్తారు.
జామ ఆకులు శరీరంలో సంక్లిష్ట పిండి పదార్థాలు, చక్కెరలు గా మారటాన్ని నివారించి, శరీర బరువు తగ్గటాన్ని ప్రేరేపిస్తుంది. జామ ఆకులు కాలేయంలో కార్బోహైడ్రేట్లు విచ్చిన్నం జరిగి, అవసరమయ్యే పదార్థాలుగా మారే ప్రక్రియను నియంత్రించటం ద్వారా శరీర బరువు తగ్గటాన్ని ప్రేరేపిస్తుంది.
ప్రస్తుత కాలంలో నిద్రలేమి మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. గంటలకొద్దీ కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయడం ఆన్లైన్ క్లాసులు అటెండ్ కావడం, పని ఒత్తిడి వల్ల చాలా అలసటకు గురి అవుతున్నారు. దీని ద్వారా నిద్రలేమి అనుభవిస్తున్నాం. రాత్రి సరిగా నిద్ర పట్టని వారు ఈ జామ ఆకులతో టీ తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఇది మెదడుకు అందాల్సిన ఆక్సిజన్ ను సక్రమంగా అందించి మెదడు సక్రమంగా పని చేసేటట్లు చేస్తుంది.
జామ ఆకుల టీ వల్ల మతిమరుపు సమస్య తగ్గుతుంది. జామ ఆకుల టీ మూడు నెలలు తాగితే మన శరీరంలో ఉన్న అధిక కొవ్వు కరిగిపోయి ఎన్నో రకాల వ్యాధుల నుండి మనల్ని బయటపడేస్తుంది. మలబద్ధక సమస్యతో బాధపడేవారు జమ ఆకులను టీ  చేసుకొని తాగడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. విరేచనము సక్రమంగా జరుగుతుంది.
డయేరియా వ్యాధి తో బాధపడేవారు ఈ టీ తాగడం ద్వారా త్వరగా కోలుకుంటారు. అజీర్తి కే కాదు ఆకలి లేమి కూడా ఈ టీ  చక్కగా పనిచేస్తుంది. రెండు జామ ఆకులను నోటిలో పెట్టుకొని నమిలి రసాన్ని కొద్దిసేపు  నోట్లో పెట్టుకొని ఉసివేస్తే ఆకలి చక్కగా అవుతుంది. జామ ఆకుల టీ తాగడం వల్ల మన శరీరంలో క్యాన్సర్ కణాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది.
జామాకులు తినేవారికి దెబ్బ తలిగిన గాయమైన ఆ గాయాలు తొందరగా మానిపోతాయి. జలుబు దగ్గు ఉన్నప్పుడు ఈ కషాయం తాగడం వల్ల త్వరగా వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ డికాషన్లో విటమిన్ సి ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. అవి ఈ జలుబు దగ్గును  తొందరగా తగ్గేలా చేస్తాయి. ఈ  టీ తాగడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరిగి తొందరగా ఏ రోగాల బారిన పడకుండా ఈ
ఈ జామ ఆకుల టీ ఈ రోజు ఉదయాన్నే తీసుకోవడం ద్వారా మగవారిలో వీర్యవృద్ధి జరుగుతుంది. ఆకులను మెత్తగా పేస్ట్ లా చేసి ఆ పేస్టు మన దంతాలు తోముతూ ఉంటె దంత సమస్య పోవటమే కాకుండా భవిష్యత్తులో ఎటువంటి దంత సమస్యలు రావు.

Exit mobile version