మీ వంటగదిలో ఇవి ఉన్నాయా? అయితే ఏ వైరస్ మిమ్మల్ని ఏమి చేయలేదు!

ఇప్పుడంటే ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా హాస్పిటల్ బాట పడుతున్నాం కానీ పూర్వం అలా కాదు. ప్రతీ సమస్యకి ప్రకృతిలో దొరికే ఔషధాలనే వాడేవారు. నిజానికి మన వంటగదిని మించిన ఫార్మసీ మరొకటి లేదు. ఎందుకంటే… అక్కడ ఉండేవన్నీ మన ఆరోగ్యాన్ని, ఆయుష్షునూ పెంచేవే. మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు చాలా వున్నా… కొన్నింటి వల్ల అదనపు ప్రయోజనాలుంటాయి. అవే ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం. వాస్తవానికి ఇవన్ని రోజు వంటల్లో వాడేవే. కాకపోతే వైరస్‌లు ఎక్కువవుతున్న ఈ సమయంలో ఇలాంటి వాటిని కాస్త ఎక్కువగా ఉపయోగించాలి.

Immunity Boosterఇవి మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్‌కి ఎనర్జీని ఇస్తాయి. అదెలా అనుకుంటున్నారా…!

ఉల్లిపాయలు:

Onionఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు… అన్ని ఉపయోగాలు ఉంటాయి ఉల్లిపాయల వల్ల. ఉల్లిలో విటమిన్ C, సల్ఫర్, జింగ్, సెలెనియం, క్వెర్సెటిన్ ఉంటాయి. ఇవి మన వ్యాధినిరోధక శక్తిని అలా పెంచేస్తాయి. ముఖ్యంగా క్వెర్సెటిన్ యాంటీవైరల్ గుణాలు కలిగి ఉంటుంది. సెలెనియం కూడా అంతే. ఇవి వైరస్‌ల వల్ల అలెర్జీలు రాకుండా చేస్తుంది. కాబట్టి తినే ప్రతీ వంటలో వీలైనంతవరకు ఉల్లి ఉండేలా చేసుకోవాలి.

వెల్లుల్లి:

Velluliవెల్లుల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కాల్షియం, పొటాషియం, సల్ఫ్యూరిక్ కాంపౌండ్‌లతో… వ్యాధి నిరోధక శక్తిని భారీగా పెంచడంలో వెల్లుల్లిని మించింది లేదు. బాడీలో క్రిములతో పోరాడే తెల్ల రక్త కణాలను వెల్లుల్లి పెంచుతుంది. వెల్లుల్లిని పచ్చిది తింటే మంచిది. ఎందుకంటే… వేడి చేస్తే… అందులోని సల్ఫర్ ఎంజైములు పోతాయి. పచ్చి వెల్లుల్లి తినలేమని అనుకుంటే… ఓ నాలుగు రెబ్బల్ని పచ్చడి చేసి… నీటిలో కలుపుకొని తాగేయాలి. మన పెద్దోళ్లు… పచ్చళ్లలో వెల్లుల్లి రెబ్బలు వేసేది కూడా ఇందుకే. జలుబు, జ్వరం లాంటివి వచ్చినప్పుడు వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. జ్వరం వచ్చిన వాళ్ళకి వెల్లుల్లి, జిలకర, ఎండు కారం పేస్ట్ గా చేసి అన్నంలోకి తినిపిస్తే మంచిది.

అల్లం:

Zingerఅల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చలువ. శరీరంలోని వేడిని తగ్గించి వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో అల్లం బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఊపిరి తిత్తుల సమస్యలతో బాధపడేవారు… శ్వాస సమస్యలతో బాధపడేవారు… పచ్చి అల్లం రసం చేసుకొని తాగితే మంచిది. తలనొప్పి, అజీర్తి చేసినప్పుడు టీలో అల్లం వేసుకొని తాగితే మంచి ప్రభావం ఉంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR