Home Health రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఆహారంలో ఎలాంటి పదార్థాలు ఉండాలి?

రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఆహారంలో ఎలాంటి పదార్థాలు ఉండాలి?

0

అసలే ఇది కరోనా కాలం. కొంచెం నిర్లక్ష్యంగా ఉన్న భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వైరస్ కొంతమందికి తీవ్రమైన సమస్యలను కలిగించకపోవచ్చు, కాని 40 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం, పెద్దవారికి రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం. రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) మెరుగ్గా ఉంటే పలు వైరస్‌లు, వ్యాధులను కూడా సమర్థంగా ఎదుర్కొనే వీలుంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మరియు ఫ్లూ మరియు దాని సమస్యలను నివారించడానికి ఏం చేయాలి? ఆహారంలో ఎలాంటి పదార్థాలు ఉండాలి? ఎలాంటి పదార్థాలను దూరం పెట్టాలి? నిపుణులు పలు సలహాలు, సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Immunity Boosting Foodమనం తీసుకునే రోజువారీ ఆహారంలో ఈ పోషకాలన్నీ సమతులంగా ఉండేలా చూసుకుంటే, మనలో రోగ నిరోధక వ్యవస్థ శక్తమంతంగా తయారవుతుంది. అప్పుడు మనపై కోవిడ్-19 లాంటి వ్యాధులు దాడి చేసినా, ఎదుర్కొనే శక్తి మనలో ఉంటుంది. అందుకే, కరోనావైరస్ బాధితుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు బలవర్థకమైన ఆహారం అందిస్తున్నారు. ప్రధానంగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, కాయలు, తృణధాన్యాలు, దుంపలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్లు సమృద్ధిగా దొరుకుతాయి.

రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎ, ఇ, డి, సి, బి విటమిన్లు, జింక్, సెలీనియం, ఐరన్, కాపర్ తదితర ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. హానికారక సూక్ష్మ క్రిములను మనలోని రోగ నిరోధక వ్యవస్థ సమర్థంగా ఎదుర్కోవడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణలో విటమిన్ ఎ దోహదపడుతుంది. ఇ, బీటా కెరోటిన్, సి, బి విటమిన్లు, జింక్, సెలీనియంలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.

బొప్పాయి, జామ, ఆపిల్, ద్రాక్ష, మామిడితో పాటు అనేక రకాల పండ్లలో బీటా కెరోటిన్, సి, బి విటమిన్లు, పొటాషియం, ఫోలేట్ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకునేందుకు అవి ఎంతగానో సాయపడతాయి. నారింజ, నిమ్మకాయలు, బత్తాయి, బెర్రీ తదితర సిట్రస్ జాతి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.

ఆకుపచ్చ రంగు కూరగాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలలో కూడా సమృద్ధిగా ఉంటుంది. ఈ లక్షణాలన్నీ రోగనిరోధక శక్తిని పెంచడానికి బ్రోకలిని గొప్ప ఆహారంగా చెప్పొచ్చు. బ్రోకలీ శరీర నుంచి విషపదార్థాలను మొత్తం కూడా బయటకు పంపిస్తుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇందులో కాల్షియం, విటమిన్ సి, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు ఉన్నాయి. బ్రోకలీని రోజూ తీసుకుంటే శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఆయా కాలాల్లో పండే అన్ని కూరగాయలూ, సుగంధ ద్రవ్యాలలోనూ రోగ నిరోధక శక్తిని పెంపొందించే పలు రకాల సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభ్యమవుతాయి.

మధుమేహం లేదా ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి దాకా వాడుతున్న మందులను కొనసాగించవచ్చు. వ్యాయామం చేయాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. వైరస్ లాంటివి అటాక్ నా దాని నుండి బయట పడగలమనే ధైర్యం ఉండాలి.

కొన్ని పోషకాల లోపం వల్ల వ్యాధుల ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే, కొన్ని పోషకాలు మోతాదుకు మించి ఉన్నా కూడా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, అన్ని పోషకాలూ సరైన మోతాదులో ఉండేలా సమతుల ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే పిజ్జా, పాస్తా, బర్గర్లు, ఫ్రైస్ ఇటువంటి ఫాస్ట్ ఫుడ్స్‌కి వీలైనంత దూరంగా ఉండడం చాలా మంచిది. వీటిలో ఎక్కువగా అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఆల్కహాల్, కూల్‌డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి.

Exit mobile version