పంచకేదార్ క్షేత్రాలు యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా ?

పంచకేదార్ క్షేత్రాలు హిమాలయాలలో అయిదు ప్రముకమైన శివలింగ క్షేత్రాలు. అవి కేదార్నాధ్, మధ్య మహేశ్వర్, తుంగనాథ్, రుద్రనాధ్, కల్పెశ్వర్.

కేదార్నాధ్ :

పంచ కేదార్ లలో మొదటిది కేదార్నాధ్ క్షేత్రం. ఈ క్షేత్రం ఒక జ్యోతిర్లింగం. కేదార్నాధ్ యాత్ర చేయడానికి రుద్రప్రయాగ నుండి యాత్ర ప్రారంభించాలి. కేదార్నాధ్ యాత్రకుగాను రుద్రప్రయాగ నుండి గౌరీకుంద్ వరకు ఆగశ్యముని, గుప్తాక్షి, పాత, సీతాపూర్ మరియు సొనప్రయాగ ద్వారా రోడ్డు మార్గంలో టెంపోలో లేదా వేసవి కాలంలో అయితే బస్సులో చేరాలి. అక్కడి నుండి 14 కి.మీ గుర్రం పై గాని, నడచిగాని, పల్లకీపై గాని కేదార్నాధ్ చేరుకోవాలి. అలా ప్రయాణం చేయలేని వారు గుప్తకాశి వరకు రోడ్డు ప్రయాణం చేసి అక్కడ పాత హెలీపాడ్ నుండి హెలీకాప్టర్ ముందుగా బుక్ చేసుకొని కేదార్నాథ్ వెళ్ళి రావచ్చు.

పంచకేదార్ క్షేత్రాలుహేలీకాప్టర్ ఉదయం నుండి సాయంత్రం వరకు మాత్రమే ఉంటుంది. సముద్ర మట్టానికి సుమారు 12000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పవిత్ర శైవ పుణ్య క్షేత్రంలో ఆక్సిజన్ అందటం కొంచం కష్టమే. కాబట్టి హృదయ సంబంధిత వ్యాధులు ఉన్నవారు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో ఉంచుకోవాలి. కేదార్నాథ్ యాత్ర పెద్దవారికి పుణ్యం, చిన్నవారికి ఆహ్లాదం. శాస్త్రవచనం ప్రకారం శ్రీహరియొక్క రెండు అంశాలైన నర నారాయణుల ప్రార్థనతో ఆవిర్భవించిన జ్యోతిర్లింగం హిమవత్పర్వతం మీద వుంది. కేదారేశ్వరునిగా పేరు గాంచిన ఇక్కడి లింగారాధన సర్వాభిష్టాలనూ నెరవేరుస్తుంది.

మధ్య మహేశ్వర్ :

పంచకేదార్ క్షేత్రాలుపంచ కేదార్ లలో రెండవ ఆలయం మధ్య మహేశ్వర్. కేదారేశ్వర్ దర్శనం తరువాత తిరిగి కేదార్నాధ్ నుండి గౌరికుంద్ 14 కి.మీ. కాలినడకన లేదా పల్లకి లేదా గుర్రంపై చేరవచ్చు. అక్కడి నుండి 40 కి.మీ రోడ్డు మార్గం ద్వారా గుప్తకాశి నుండి కుండ్ చేరవరసి ఉంటుంది. కుండ్ నుండి ఉకీమఠ్ 6 కి.మీ. అక్కడి నుండి మాంసునా, రాసు సరస్సు అటు నుండి ఉనియన వరకు 16 కి.మీ. రోడ్డు ప్రయాణం చెయ్యాలి. ఉనియన ద్వారా రాంసి 4 కి.మీ. రాంసి నుండి దాదాపు 10 కి. మీ. కాలినడకన ప్రయాణించి మద్య మహేశ్వర్ చేరుకోవలసి ఉంటుంది. మధ్యమహేశ్వర్ లో రాత్రికి బస చేయాలి. అక్కడ వసతి గృహం ఉంటుంది.

తుంగనాథ్ :

పంచ కేదారాలలో మూడవ కేదార్ అని చెప్పబడే తుంగనాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ జిల్లాలో సుమారు ముప్పై ముప్పైయైదు కిమీ ల దూరంలో రుద్రప్రయాగ నుంచి అగస్త్యముని వెళ్ళేదారిలో ఓఖిమఠ్ కి సుమారు అయిదు కిమీ దూరంలో చోప్త అనే వూరు నుంచి కొండ పైకి ఎక్క వలసి వుంటుంది . అతి ఎత్తైన పర్వతం పైన వున్న శివకోవెలగా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది ఈ తుంగనాథ్. సముద్ర మట్టానికి సుమారు 12500 అడుగుల ఎత్తులో వున్న చంద్రశిల అనే పర్వతం మీద వున్న కోవెల తుంగనాథ్. ఈకోవెల గోపురం కనీసం వెయ్యి సంవత్సరాలకు పూర్వం నిర్మించబడిందని పురావస్తు పరిశోధకులు నిర్దారించారు. నంది రూపంలో ఉన్న శివుని శరీరం భాగాలై పడినప్పుడు చేతులు తుంగనాధ్ ప్రాంతంలో పడినట్లు స్థల పురాణం చెబుతుంది.

పంచకేదార్ క్షేత్రాలుతుంగనాథ్ నుండి చంద్రశిల శిఖరం రెండు కిమీ ల పైన వుంది. త్రేతాయుగం లో శ్రీరాముడు ఈ చంద్రశిల శిఖరం పైన తపస్సు చేసినట్లుగా రామాయణంలో చెప్పబడింది . ఒకటి రెండు రోజులు వుండడానికి వీలుగా చిన్న చిన్న రూమ్ లు తక్కువ ధరకే దొరుకుతాయి. ప్రొద్దున పది గంటలకు నడక ప్రారంభిస్తే తుంగనాధుని దర్శించుకొని భోజనం చేసుకొని సాయంత్రం నాలుగు అయిదు గంటలకి చోప్తా చేరుకోవచ్చు. అంతలోనే వాన అంతలోనే యెండ .. తుంగనాధ్ మందిరం కేదార్నాద్ మందిరాన్ని పోలివుంటుంది . లోపల శివ లింగం శివ కుటుంబంతో పాటు పాండవుల విగ్రహాలను కుడా చూడొచ్చు కాశి నగరానికి చెందిన బ్రాహ్మణులు ఇక్కడ నిత్య పుజాదులు నిర్వహిస్తున్నారు . ఆరునెలలనుంచి ఎనిమిది నెలలవరకు ఈ గుడి మూసివేస్తారు.

రుద్రనాధ్ :

పంచకేదార్ క్షేత్రాలుపంచ కేదార్ లలో నాలుగవ కేదార్ అనిపిలువబడే రుద్రనాధ్ ఉత్తరాఖండ్ హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న శైవ క్షేత్రం. సముద్ర మట్టానికి సుమారు 11800 అడుగుల ఎత్తున ఉన్న సహజ సిద్దమైన రాతితో నిర్మితమైన ఆలయం ఇది. ఈ ఆలయం చుట్టూ మరుగుజ్జు (ఎత్తు తక్కువ) గన్నేరుచెట్ల తోనూ పర్వత పచ్చిక బయళ్లతోనూ నిండిన దట్టమైన అటవీ ప్రాంతము ఉంది. పంచ కేదార్ యాత్ర లో రుద్రనాధ్ దేవాలయ దర్శనానికి ముందు కేదార్నాధ్, మధ్యమహేశ్వర్ మరియు తుంగనాధ్ క్షేత్రాలు దర్శించాలి. రుద్రనాధ్ తరువాత కల్పెశ్వర్ దర్శించుకోవాలి. శివుని ముఖ భాగం ఇక్కడ నీలకాంత్ మహదేవ్ పేరుతో కొలువబడుతుంది. గోపేశ్వర్ నుండి 3 కి.మీ దూరంలో ఉన్న సాగర్ అనే గ్రామం నుండి పర్వతారోహణ (నడక) ప్రారంభం అవుతుంది. ఇదికాక గోపేశ్వర్ నుండి 12 కి.మీ. పర్వతారోహణ (నడక) మార్గం ఉంది. ఈ మార్గం అనసూయాదేవి ఆలయం నుండి ఉంటుంది. ఈ పర్వతారోహణ చాలా కష్టం. మరియు సుమారు 24 కి.మీ దూరం ఉంటుంది. ఇంకొక మార్గం చొప్తా నుండి పానర్గుఫా అనే ప్రదేశం చేరుకోవాలి. అక్కడి నుండి 12 కి.మీ. 6 గంటలు ట్రెక్ (నడక) ద్వారా ప్రయాణించి రుద్రనాధ్ చేరవచ్చు. రుద్రనాధ్ లో మరియు కల్పెశ్వర్ ఆలయంలో ఆది శంకరాచార్యులు నియమించిన దాసనమీ గోసన కులస్థులు పూజా కార్యక్రమాలు చేస్తారు.

కల్పెశ్వర్ :

పంచకేదార్ క్షేత్రాలుపంచ కేదార్ లలో అయిదవ కేదార్ కల్పెశ్వర్ ఉత్తరాఖండ్ లో హిమాలయాలలో గారెవాల్ ప్రాంతంలో సుందరమైన ఉర్గంలోయ ప్రాంతంలో ఉంది ఇది. పంచ కేదార్ యాత్ర లో కేదార్నాధ్, మధ్యమహేశ్వర్, తుంగనాధ్ మరియు రుద్రనాధ్ క్షేత్రాలు ముందుగా దర్శించాలి. రుద్రనాధ్ తరువాత కల్పెశ్వర్ దర్శించుకోవాలి. రుద్రనాధ్ దర్శనం తరువాత తిరిగి 23 కి.మీ చామోలి నుండి హెల్లాంగ్ మీదుగా ప్రయాణించి దేవగ్రామ్ చేరి అక్కడి నుండి కల్పెశ్వర్ చేరుకోవచ్చు. శివుని జటాఝూటం ఇక్కడ శివభగవానునిగా కొలువబడుతుంది. కల్పెశ్వర్ సముద్ర మట్టానికి 7200 అడుగుల ఎత్తులో ఉంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR