వాము వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

వాము.. దీనిని కొన్ని ప్రాంతాలలో   ఓమ అనికూడా అంటారు..  హిందీలో అజ వాన్‌ అని అంటారు. ఈ వాము మొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది. వాము శరీరంలో వాతాన్ని హరింపజేస్తుంది. శూలలను తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపు ఉబ్బరం, ప్లీహవృద్ధిని తగ్గిస్తుంది. వాంతులను తగ్గిస్తుంది. గుండెకు కూడా అత్యంత ఉపయోగకారి. దీని శాస్త్రీయ నామము ట్రాకీస్పెర్మమ్ కాప్టికమ్..  వాము మనకు తెలిసిన గొప్ప ఓషధం. ఈ వాము గింజల నుంచి సుగంధ తైలాన్ని డిస్టిలేషన్ విధానం ద్వారా వేరుపరిచి థైమాల్‌గా మార్కెట్ చేస్తుంటారు.
Health Benfits of Ajwainవాము జీర్ణశక్తికి మంచిది. చూడటానికి  జీలకర్రలా అనిపించినా వాము గింజ జీలకర్ర కంటే పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది. రూపంలో చిన్నదైనా, ఇది చేసే మేలు మాత్రం పెద్దడి..  ఈ వాము సాధారణంగా మన  వంటింట్లో కనిపించే దినుసు. ఆహారం జీర్ణం కానపుడు ‘కాసింత వాము వేణ్ణీళ్లతో కలిపి నమలితే . సమస్య తీరిపోతుంది’ అని మన పెద్దలు చెప్తుంటారు. ఈ  వామును జంతికలు, మురుకులు తయారీలో వాడుతుంటారు అని మనకి తెల్సు.. మరి ఈ వాము వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మనం ఇపుడు తెల్సుకుందాం..
Health Benfits of Ajwainవాము వాటర్ తాగిపించటం వలన చిన్నపిల్లల్లో జీర్ణప్రక్రియ బావుంటుంది.. వాము ఊబకాయాన్ని తగ్గిస్తుంది. రోజూ ఉదయం 2 నుంచి 3 టీస్పూన్ల వాము ఖాళీ కడుపుతో తినడం వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఈ విధంగా  2 నుండి 3 నెలల వరకు నిరంతరం చేయండం వల్ల కొవ్వు తగ్గుతుంది . వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి. వాము, ధనియాలు, జీలకర్ర – ఈ మూడింటినీ దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.  వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని, చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి. వామును త్రిఫలాలనే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ లతో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత వ్యాధులు తగ్గుతాయి.
Health Benfits of Ajwain
వాము నూనె అన్ని వాత వ్యాధులకు ఎంతో ఉపయోగకారి. వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర శబ్దాలు తగ్గుతాయి. వామును వివిధ అనుపానాలతో సేవిస్తే మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. వాము, వెనిగర్‌ లేక తేనెతో కలిపి వారం తీసుకుంటే మూత్రపిండాలలో ఉన్న రాళ్లు మూత్రం ద్వారా వెళ్లిపోతాయని ఆయుర్వేదంలో  చెప్పబడింది.. ప్రసవానంతరం స్త్రీలు వామును వాడితే చనుబాలు వృద్ధి అవుతాయి. జలుబు, మైగ్రెయిన్‌ తలనొప్పికి ఈ వాము మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది.  ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది. గుండెవ్యాధులు రాకుండా నివారించడంలో వాము ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
Health Benfits of Ajwain
వామునూనె కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. కాలిన గాయాలకు సైతం ఇది మంచిదని వైద్యశాస్త్రం చెబుతోంది. పంటినొప్పి ఉన్నవారు వామును గోరువెచ్చని నీటితో నమిలి పుక్కిలించినట్లైతే ఉపశమనం లభిస్తుంది.. దగ్గు వచ్చినపుడు వేడినీటిలో కొద్దిగా వాము తీసుకుని నమలాలి. వాముకు తమలపాకు కలిపి రాత్రిపూట నమిలితే రాత్రి పొడిదగ్గు రాదు. రెండు టీ స్పూన్ల వామును మెత్తగా దంచండి. ఒక గ్లాసు మజ్జిగకు కలిపి తీసుకుంటే కఫం పల్చబడి ఊపిరితిత్తుల్లోకి గాలిని చేరవేసే మార్గాలు శుభ్రపడతాయి. రెండు చెంచాల వాముని తీసుకొని నువ్వుల నూనెతో కాయాలి… తరువాత వడగొట్టి ఈ నూనెను చెవిలో రెండు మూడు చుక్కలు వేసినట్లయితే చెవిలో నొప్పి మాయమవుతుంది. నిద్రలో పక్కతడిపే అలవాటున్న వారికి ఉదయం మరియు రాత్రి, పావు టీస్పూన్ వామును  నీటితో లేదా బెల్లంతో కలిపి  ఇచ్చినట్లయితే  సమస్య పరిష్కరించబడుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR