Home Unknown facts గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించిన ఆలయం

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించిన ఆలయం

0

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఏదో ఒక ప్రత్యేకత అనేది ఉండాలి. అలంటి ప్రత్యేకత లో ఈ ఆలయం చోటు సంపాదించుకుంది. ఈ ఆలయంలో బాల హనుమాన్ భక్తులకి దర్శనం ఇస్తున్నాడు. మరి ఈ ఆలయం ఎందుకు గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించింది? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడి బాల హనుమాన్ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Hanumanన్యూఢిల్లీలో ఈ ఆలయం రన్ మాల్ సరస్సుకు ఆగ్నేయంగా కన్నాట్ ప్లేసులో బాల హనుమాన్ దేవాలయం ఉన్నది. ఈ ఆలయం భారతదేశములోనే అతి ప్రాచీనమైన ఆంజనేయుని ఆలయాలలో ఒకటిగా చెప్తారు. స్వయంవ్యక్తమైన ఆంజనేయుడు బాల హనుమాన్ రూపములో భక్తులకి దర్శనమిస్తాడు. ఆలయం యొక్క ప్రధాన హాలు యొక్క ఉత్తరదిశలో భారీ ఆంజనేయుని విగ్రహం ఉన్నది. హనుమంతుడి విగ్రహానికి కుడివైపున సీతా,రామ,లక్ష్మణ విగ్రహాలు ఉన్నవి.

బాల హనుమాన్ విగ్రహానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. బాల హనుమంతుడు దక్షిణ దిశా ముఖంగా ఉండటం వలన ఒక కన్ను మాత్రమే మనకు కనిపిస్తుంది. బాలహనుమంతుడి ఎడమ చేతిలో గదను ధరించి,కుడిచేతిని ఛాతిపైన ఉంచి ప్రార్థన చేస్తున్నట్లు ఉన్న భంగిమ భక్తులకి కనువిందు చేస్తుంది. గంధ సింధూరం పూతతో ధగధగలతో శ్రీ బాల హనుమాన్ భక్తులకి దర్శనమిస్తారు.

ఈ బాల హనుమాన్ దేవాలయం ఇక్కడ ఎలా వెలసిందంటే,కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు విజయం సాధించిన తరువాత 5 దేవాలయాలను నిర్మించారని అందులో ఈ బాల హనుమాన్ ఆలయం ఒకటని స్థల పురాణం తెలియచేస్తుంది.

ఇక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు ఎప్పుడు సంపాదించింది అంటే ఆగస్టు 1, 1964 న ప్రారంభమైన “శ్రీరామ జయరామ జయజయ రామ” అనే శ్రీరామనామ జపం ఇప్పటికి నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నది. ఈ రామనామ జపం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదైనది.

ఈ ఆలయంలో హనుమాన్ జయంతి అత్యంత వైభంగా జరుగుతుంది. హనుమంతుడు ఎక్కడ లేని విధంగా బాల హనుమాన్ రూపములో ఇక్కడ ఉండటం, ఇది అతి ప్రాచీన దేవాలయం కావటం, గోపురం పైన చంద్రరేఖ ఉండటం ఇవ్వన్నీ కూడా ఈ ఆలయ ప్రత్యేకతలు గా చెప్పుతారు.

ఇన్ని ప్రత్యేకతలు ఉన్నవి కనుకనే ఈ బాల హనుమాన్ దేవాలయం అంతా ప్రాముఖ్యతని సంతరించుకుంది.

Exit mobile version