Inspirational teachers striving for the future of those who can’t even afford decent education.

0
2812

ఉపాధ్యాయులు అంటే…రాబోయే తరానికి…కాబోయే పౌరులు అయినటువంటి బాలల్లో చెడు అనే ఉపద్రవం నిండకుండా చూసి…వారిని ప్రయోజకుల్ని చేసే సాధనాలు…మరి అలాంటి ఉపాధ్యాయులు పిల్లల కోసం, సమాజం కోసం వారి పరిధిని దాటి మరీ ఆలోచన చేస్తే…సమాజంలో ఉన్న సమస్యలపై తమదైన శైలిలో వారు సమర శంఖం పూరిస్తే? సమాజమే దేవాలయం…నేటి బాలలే రేపటి పౌరులు అని మహానుబావులు చెప్పిన మాటలను చేతల్లో చూపించే క్రమంలో తమ సరిహద్దులను చెరిపేసి మరీ వారి వ్యక్తిగత జీవితాలను పక్కకు పెట్టి మరీ ఆలోచన చేస్తే…ఎలా ఉంటుందో కదా…మరి అలా చేసిన అతి తక్కువ మంది ఉపాధ్యాయుల్లో కొంత మంది కొంతైనా గురించి తెలుసుకుందాం రండి….

ఆనంద్ కుమార్!
తాను మంచి టాలెంట్ ఉన్నప్పటికీ, చదువుకోవాలి అన్న ఆశ, ఆసక్తి ఉన్నప్పటికీ పేదరికం వల్ల కుదరకపోవడంతో, తనలాంటి పేద విధ్యార్ధులను దృష్టిలో పెట్టుకుని “సూపర్ 30 ప్రోగ్రామ్”ని నిలకొల్పి, చదవగలిగి, చదువుకుంటాను అనే వాళ్ళలో చదువుకొనలేని వారికి ఐఐటీ-జేయీయీ కోచింగ్ ను ఫ్రీగా అందిస్తున్నాడు. 2000వ సంవత్సరంలో మొదలు పెట్టిన ఈ ప్రోగ్రామ్ పుణ్యమా ఆని, 2015 నాటికి…450మంది విద్యార్ధులు ఐఐటీ-జేయీయీ కోచింగ్ తీసుకోగా, అందులో 391మంది ఉత్తీర్ణులు కావడం విశేషం. ఈయన చేస్తున్న కృషిని డిస్కవరీ ఛానెల్ వాళ్ళు ఒక డాక్యుమెంటరీగా గంట పాటు తమ ఛానెల్ లో ప్రోగ్రామ్ చెయ్యడం నిజంగా హర్షించదగ్గ విషయం…ఇక అదే క్రమంలో ఈయన జీవిత చరిత్రను ఆధారంగా ఒక సినిమా కూడా తెరకెక్కబోతూ ఉండడం విశేషం.1 - Anand Kumar

ఆదిత్య కుమార్…
చదువుకోవాలి అన్న ఆశ ఉండి, చదువు కొనలేని స్థితిలో ఉన్న వారికి అండగా నిలిస్తూ వారికి విధ్యని అందిస్తున్న మహా మనిషి ఈ ఆదిత్య కుమార్… పేదవాళ్ళకి, చదుకోలేని వాళ్ళకి…లక్నో నుంచి రాంచీ వరకూ సైకిల్ పై వెళ్ళి, విధ్య, ప్రస్తుత సమాజంలో దాని అవసరం, అదే క్రమంలో చావుకోలేని స్థితిలో ఉండి, చదువుకోవాలి అన్న ఆశ ఉన్న విధ్యార్ధులకు ఇంగ్లీష్, మరియు మ్యాథ్స్ పాటలను ఉచితంగా నేర్పుతూ ముందుకు సాగుతున్న మాస్టర్ ఈ ఆదిత్య…ఇక ఈయన చేస్తున్న సేవల పుణ్యమా అని, అఖిలేశ్ యాదవ్ నుంచి ప్రశంసలు అందుకున్నారు.2 - Aditya Kumar

రాజేష్ కుమార్ శర్మ!
ఒక సామాన్య కిరాణా షాపు నడుపుకునే వ్యక్తి ఒక మెట్రో రైలు వంతెన కింద చిన్న స్కూల్ స్టార్ట్ చేసి, ఎంతో మంది పేద విధ్యార్ధులకు చదువు నేర్పుతున్నాడు…2007లో ఇద్దరు విధ్యార్ధులతో మొదలైన ఈ స్కూల్, దాదాపుగా 200 విధ్యార్ధులతో ముందుకు సాగుతూ ఉండడం విశేషం.3 - Rajesh Kumar Sharmaఅబ్దుల్ మాలిక్!!
తాను పాటాలు చెప్పాల్సిన పిల్లకు టైమ్ కి సరైన విధ్యను అందించే క్రమంలో అబ్దుల్ మాలిక్ అనే ఉపాధ్యాయుడు దాదాపుగా 9కిలోమీటర్ల మేర ఒక నదిని దాటుకుంటూ, ఆ మురుకి నీళ్ళలో, బట్టలు, భోజనం, పుస్తకాలు అన్నింటినీ తన ఎడమ చేత్తో పట్టుకుని విధ్యార్ధులకు టైమ్ కి విధ్యను అందిస్తున్నాడు. అయితే బస్సులో వెళితే ఇదే దూరాన్ని దాటడానికి దాదాపుగా మూడు గంటల సమయం పట్టి ఆలస్యం అవుతుంది అన్న ఆలోచనతో ఈ సాహసం చేస్తున్నాడు అబ్దుల్. ఇక ఈయన చేస్తున్న ఈ మంచి పనికి తమ వంతు సహాయంగా ఒకరు ఫైబర్ బోట్ ని ఇచ్చి అతనికి అండగా నిలిచారు.4 - Abdul Maalik

బాబర్ అలీ!!
పశ్చిమ బెంగాల్ లోని మూర్షిదాబాద్ ప్రాంతంలో బాబర్ అలీ అనే యువ ఉపాధ్యాయుడు చేస్తున్న కృషి అనిర్వచనీయం…తాను ష్కూల్ లో ఉండగానే చిన్న స్కూల్ ని స్థాపించి తాను ఏదుగుతూనే ఆ స్కూల్ ని కూడా పెంచుకుంటూ వచ్చాడు. పేద విధ్యార్ధులకు అండగా…నిలుస్తూ, ఇప్పుడు దాదాపుగా 10మంది టీచర్స్తో 800మంది విధ్యార్ధులకు చదువును ఉచితంగా అందిస్తున్నాడు. ఇక ఈ యువ కెరటం చేస్తున్న ఈ కృషికి ఫలితంగా ప్రఖ్యాత బీబీసీ ఛానెల్ వాళ్ళు “యంగెస్ట్ హెడ్ మాస్టర్ ఇన్ థి వర్ల్డ్” అని అతన్ని ప్రత్యేకంగా కీర్తించారు.5 - baber Alli

ఆరవింద్ గుప్తా!!
చెత్త నుంచి బొమ్మలు తయారు చేసి నేర్చుకోవడం అనేది భారం అని కాకుండా, నేర్చుకోవడం ఒక క్రీడా లాంటిది, అంటూ చెప్పి, ఎందరో విధ్యార్ధులకు బాసట నిలిచిన వ్యక్తి ఆరవింద్.6 - Aravind Gupta

రోషిని ముఖర్జీ!
9వ తరగతి, 12వ తరగతి విధ్యార్ధులకు మంచి విధ్యని అందించాలి అన్న ఆలోచనతో, ఇప్పుడున్న విధ్యారంగంలో కాస్త నాణ్యత తగ్గింది అని ఆలోచనతో విప్రోలో పనిచేస్తున్న రోషిని, “ఎగ్స్యామ్ ఫియర్” ను మొదలు పెట్టి, దాదాపుగా 3800 వీడియోలను తయారు చేసి, పిల్లలకు అందిస్తుంది. ఇక ఇప్పటికీ ఈమె పేజ్ ని ఫాలో అవుతున్న వారి సంఖ్య 75000.7 - Roshini Mukarjee

సందీప్ దేశాయ్
రాజస్థాన్, మహారాష్ట్రలో తాను పేద విధ్యార్ధుల కోసం నడుపుతున్న స్కూల్స్ కి డొనేషన్స్ కోసం, లోకల్ ట్రేన్స్ లో బెగ్గింగ్ చేస్తూ, తాను అలా సంపాదించిన డబ్బును ష్కూల్ పిల్లల కోసం, వారి చదువుల కోసం ఖర్చు చేస్తూ ఉంటాడు సందీప్.8 -Sandeep Desai

విమలా కవుల్!!
81ఏళ్ల పెద్దావిడ, ఒక స్కూల్ టీచర్ గా రిటేర్ అయ్యాక, ఇప్పుడున్న ప్రభుత్వ పాటశాలల్లో సటైన విధ్య అందడం లేదు అని గమనించి తానే ఒక నాలుగు గదుల ఆపార్ట్‌మెంట్ తీసుకుని, గుల్దస్తా అనే పేరుతో ఒక చిన్న పాటి ష్కూల్ ని నడిపిస్తుంది. ఇక 2009వరకూ ఆమె భర్త సైతం ఆమెతో పాటు ఉంది ఈ ష్కూల్ ను నిలబెట్టారు..ఇక ఆ ఏడాది ఆయన అసువులు బాయడంతో ఆమె అంతా అయ్యి స్కూల్ ను నడిపిస్తుంది.9 - Vimala Kaul

భారతి కుమారి!
బాబర్ అలీ లాగానే ఈమె కూడా ష్కూల్ లో చదువుకుంటున్న సమయంలోనే ఒక స్కూల్ ను మొదలు పెట్టి పిల్లలకు అండగా నిలుస్తూ ముందుకు సాగుతుంది…ఒక మామిడి చెట్టు కింద పేద విధ్యార్ధులకు మ్యాథ్స్, ఇంగ్లీష్, హింది అన్నీ నేర్పిస్తుంది భారతీ.10 - Barath Kumari

బరున్ బిస్వాస్!
పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న రాజకీయ రేప్స్, మర్డర్స్ ను అక్కడ సూతియా అంటారు. అయితే వాటన్నింటినీ ఎదిరించే క్రమంలో, పేదవారికి అండగా నిలిచి, వాటిపై పోరాడాలీ అంటే చదువు, చైతన్యం ఒక్కటే మార్గం అని భావించి పేద విధ్యార్ధులకు చదువు చెబుతూనే, మరో పక్క ఈ ఆక్రమాలపై పేదవారు గళం ఎత్తేలా చేసి…చివరకూ 2012లో ఈ ఆక్రమాల, ఆక్రమార్కుల చేతిలో హత్యకు గురయ్యాడు.11 - Barun Biswas

మొతియుర్ రెహ్మాన్ ఖాన్.
విధ్య అనేది…పేదవారికి అందని ద్రాక్ష అయిన నేపధ్యంలో కేవలం 11 రూపాయలకే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆరెస్ వంటి పరీక్షలకు శిక్షణ ఇస్తూ, ఆదర్శ గురువుగా నిలిచాడు రెహ్మాన్.12 - Reshamn Khan