పూజ గదిలో పెద్ద సైజు రాతి విగ్రహాలు, లోహపు విగ్రహాలు పెట్టకూడదా?

వాస్తు శాస్త్రం ఇంట్లో దేవున్ని పూజించేందుకు ఎలాంటి చోటులో దేవుడి గది ఉండాలో చెబుతోంది. సిమెంటు పలకలు లేదంటే చెక్కతో చేయించిన పలకలమీద తమ ఇష్టదైవం పటాలను పెట్టుకోవాలి. పూజ గది వల్ల ఈశాన్యం మూత పడకూడదు. అదే విధంగా పూజ గదిలో సిమెంటు మెట్లు పెట్టకూడదు.

Puja Roomపూజ గది నిర్మాణం, విగ్రహాలు అనేది ఆ ఇంటి వైశాల్యం పైన ఆధారపడి ఉంటుంది. ఇల్లు పెద్దగా ఉన్నప్పుడు పూజగది ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. చిన్నగా ఉండి పూజగదిని నిర్మించటానికి వీలు లేనప్పుడు గోడలో అలమరా చేయించి పెట్టుకునే వీలుంది. ఒకే ఒక్క గదిలో నివాసం ఉన్నవారైతే గదికి ఈశాన్యంలో దేవుని పటం పెట్టుకుని కర్టెన్ వంటిది ఏర్పాటు చేయాలి.

Puja Roomపూజ చేసే గదిలో పెద్ద సైజు రాతి విగ్రహాలు, లోహపు విగ్రహాలకు చోటు ఇవ్వద్దు. ఒకవేళ అలాంటి విగ్రహాలను పూజలో పెట్టినట్లయితే నిష్టగా పూజ చేయాల్సి ఉంటుంది. అలా చేయలేని వారు వాటిని పూజ గది నుంచి తొలగించాలి.

Puja Roomపూజలు సరిపోని విగ్రహాలు కొంతకాలానికి రుణదృవ శక్తి నిలయాలుగా మారిపోయి ఆ ఇంటివారికి హాని చేస్తాయి. ఇక భగవంతునికి చేసే ప్రార్థన విషయానికి వస్తే తూర్పుకు తిరిగి ప్రార్థన చేయటం అనాదిగా వస్తున్న ఆచారం.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR