పాండవులు అశ్వత్థామని చంపకుండా శ్రీకృష్ణుడు ఎందుకు అడ్డుకున్నాడు

మహాభారతంలో అశ్వత్థామను గొప్ప యోధునిగా చెబుతారు. అర్జునుడికి సాటిగా యుద్ధరంగంలో ఆరితేరాలని ఆశించనవాడు. బ్రహ్మస్రం పొందిన అతితక్కువమందిలో ఒకడు అశ్వత్థామ. కానీ కురుక్షేత్రంలో కౌరవులతో చేతులు కలిపిన అశ్వద్ధామ పాండవుల వంశం అనేది లేకుండా చేయాలనీ యుద్దానికి విరుద్ధంగా రాత్రి సమయంలో ఉపపాండవులను సంహరిస్తాడు. మరి అశ్వత్థామ ఎవరు? ఎందుకు ఉపపాండవులను చంపుతాడు? పాండవులు అశ్వత్థామని చంపకుండా శ్రీకృష్ణుడు ఎందుకు అడ్డుకుంటాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1-Rama

పాండవులకు, కౌరవులకు గురువైన ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ. అయితే ద్రోణాచార్యుడు తన శిష్యుడైన అర్జునుడితో సమానమైన విలుకాడిగా అశ్వత్థామను తీర్చిదిద్దాలని భావించాడు. కానీ అశ్వత్థామ కౌరవులతో స్నేహం చేస్తూ పాండవుల పట్ల మంచిగా ఉండకపోవడంతో అతడికి అందవలసిన విద్య అందలేదు. అయితే అశ్వత్థామ బ్రహ్మాస్ర్తాన్ని పొందినప్పటికీ దానికి ప్రయోగించడమే కానీ ఎలా ఉపసంహరించుకోవాలి తెలీదు.

2-Yudham

ఇక మహాభారత యుద్ధంలో పాండవులను చంపుతానని మాటఇవ్వగ, ఇక దుర్యోధనుడికి, భీముడికి భీకర యుద్ధం జరుగుతుండగా, యుద్ధం చేస్తున్న భీముడిని చూసి తొడలు చూపిస్తూ సంకేతాన్ని ఇవ్వడంతో భీముడు తన గదతో దుర్యోధనుడి తొడలపై గట్టిగ బాదడంతో ఒక్కసారిగా దుర్యోధనుడు కుప్పకూలుతాడు. అది చుసిన బలరాముడు ఒక్కసారిగా పట్టరానంత కోపంతో భీముడిపైకి వెళ్లి, గదా యుద్ధంలో నాభి కింది భాగంలో కొట్టకూడదనే నియమాన్ని ఉల్లఘించి నన్ను అవమానానికి గురి చేసావు అంటూ భీముడి పైకి దాడి చేయడానికి కోపంతో వెళ్లగా, అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడికి ఆపి అతడి కోపాన్ని తగ్గిస్తాడు.

3-munii

యుద్ధభూమిలో పడిఉన్న దుర్యోధనుడి దగ్గరికి అశ్వత్థామ వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకొని, పాండవుల వంశాన్ని లేకుండా చేస్తానని దుర్యోధనుడితో చెప్పి, రాత్రి సమయంలో కృష్ణాచార్యునితో కలసి పాండవుల శిబిరానికి వచ్చి నిద్రిస్తున్న ఉపపాండవులను చంపివేస్తాడు. దీంతో పాండవుల శిబిరంలో ఏడుపులు మొదలవ్వగా, ద్రౌపతి దుఃఖాన్ని చూసిన అర్జునుడు అశ్వత్థామ ని వెతుకుంటూ వెళ్లగా ప్రాణభయంతో అశ్వత్థామ పారిపోతూ ఇక చివరకి చేసేది లేక ప్రయోగించడమే కానీ ఉపసంహరించుకోవడం తెలియని బ్రహ్మాస్ర్తాన్ని అర్జునిడి పై ప్రయోగిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి తో తిరిగి అస్రాన్ని ప్రయోగించమని చెప్పగా, రెండు అస్రాలు ఢీకొట్టుకొని ముల్లోకాలు కంపించగా శ్రీకృష్ణుడు అర్జునుడితో ఆ రెండు అస్రాలు ఉపసంహరించేలా చేస్తాడు.

4-Krishna

ఆ తరువాత అర్జునుడు అశ్వత్థామ ని ఈడ్చుకెళ్లి ద్రౌపతి దగ్గరికి తీసుకెళ్లగా, రాత్రి సమయంలో దొంగ చాటుగ వచ్చి ఉపపాండవులను చంపడానికి మనసు ఎలా వచ్చిందని రోదిస్తుండగా, అశ్వత్థామని చంపడానికి పాండవులు రాగ, అప్పుడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడిని చంపితే బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందని చెప్పి, అశ్వత్థామ జుట్టు కత్తిరించి అతని దగ్గర ఉండే మని తీసుకొని కుష్ఠురోగంతో, ఎప్పటికి దీనికి శిక్షని అనుభవిస్తూ చావు అనేది లేకుండా చిరంజీవిగా ఉండు అని శపిస్తాడు.

5-Ashwathama

అందుకే అశ్వత్థామ ఇప్పటికి చిరంజీవిగా ఉన్నాడని చెబుతారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR