శంఖుడు, లిఖితుడు అనే అన్న తమ్ముల కధ ?

మనదేశంలో ప్రవహించే నదుల్లో ఒక్కోదానికి ఒక్కో చరిత్ర ఉంటుంది . పూర్వం ద్వాపరయుగంలో శంఖుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు అత్తిరాల ప్రాంతంలో నివసిస్తుండేవారు. వీరిద్దరూ సకల విద్యలలో, వేదాంతాలలో వీరికి వీరే సాటిగా వుండేవారు. వీరిద్దరూ ఒక్కొక్కటిగా తమతమ ఆశ్రమాలను స్థాపించుకుని, అక్కడే తపస్సు చేసుకునేవారు.

Bahuda Riverఒకనాడు లిఖితుడు తన అన్న అయిన శంఖుడిని చూడాలని, అతని ఆశ్రమానికి చేరుకుంటాడు. కానీ శంఖుడు ఆశ్రమంలో వుండడు. దీంతో లిఖితుడు తన అన్న కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అక్కడి చెట్లకు వున్న ఫలాలను కోసి తింటూ, కాలక్షేపం చేస్తూఉన్నాడు. ఇంతలోనే శంఖుడు తిరిగి వచ్చి తన తమ్ముడు ఫలాలను తింటుండగా చూస్తాడు. దీంతో శంఖుడు.. ‘‘నువ్వు ఎవరి అనుమతితో ఈ ఫలాలను తింటున్నావు?’’ అని ప్రశ్నిస్తాడు. లిఖితుడు తన తప్పును అర్థం చేసుకుని, పరిహారం చూపమని అర్థించాడు.

Bahuda Riverఅప్పుడు శంఖుడు.. ‘‘ఏదైనా ఒక వస్తువును అనుమతి లేకుండా తీసుకుంటే దానిని దొంగతనం అంటారు. ఇప్పుడు నువ్వు కూడా అదే చేశావు కాబట్టి రాజు దగ్గరకు వెళ్లి, నీ నేరానికి సరైన శిక్షను అనుభవించు’’ అని ఆజ్ఞాపించాడు. లిఖితుడు తన అన్న మాటను శిరసావహించి, రాజు భవనానికి వెళ్లాడు. లిఖితుడు వస్తున్నాడన్న ఆనందంలో సుదుమ్న్య రాజు తనను ఘణంగా ఆహ్వానించడానికి అన్నివిధాలు ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటాడు. అయితే లిఖితుడు దానిని తిరస్కరించి తను చేసిన తప్పు గురించి వివరించి, శిక్షను విధించమని కోరుకుంటాడు.

Bahuda River‘‘ఒక మహా తపస్వి చేసిన చిన్న నేరానికే నేను శిక్షించాలా’’ అంటూ బాధపడుతూనే తన మాట కాదనలేక అతని చేతులు నరకమని ఆజ్ఞాపిస్తాడు రాజు. లిఖితుడు రాజు విధించిన శిక్షను సంతోషంగా అనుభవించి, తన అన్న దగ్గరకు తిరిగి చేరుకుంటాడు. అప్పుడు శంఖుడు ‘‘నువ్వు చేసిన నేరాన్ని అంగీకరించి, శిక్షను అనుభవించినందుకు పునీతుడివయ్యావు. నదిలో వెళ్లి భగవంతుడికి, పితృదేవతలకు అర్ఠ్యం సమర్పించు. అంతా మంచి జరుగుతుంది’’ అని ఆదేశించాడు.

Bahuda Riverనదిలో మునిగి బయటికి వచ్చిన లిఖితుడికి తిరిగి చేతులు వచ్చేస్తాయి. ఈ విధంగా లిఖితునికి చేతులు ప్రసాదించినందుకు ఆ పవిత్ర నదికి ‘‘బాహుదా’’ అనే పేరొచ్చింది. దానినే ఇప్పుడు ‘‘చెయ్యేరు’’గా పిలుస్తున్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,640,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR