బొట్టు వల్ల దృష్టి దోషం పోతుందా? దీని వేణిక కారణం ఏమిటి ?

నుదుటన బొట్టు పెట్టుకోవడానికి కొంతమంది హిందువులు సిగ్గు పడుతుంటారు. హిందూ ధర్మంలో తిలక ధారణకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. భ్రుకుటికి మధ్యలో ధరించే ఈ కుంకుమ వల్ల కొన్ని నాడులు ఉత్తేజితము అవుతాయని శాస్త్ర పరిశోధనలలో తేలింది. అలాగే ఎదుటివారు మన ముఖము చూడగానే కనిపించే ఈ బొట్టు వల్ల దృష్టి దోషం కూడా ఉండదని చెపుతారు.

బొట్టు విశిష్టతనుదుటి యందు సూర్య కిరణాలు సోకరాదు,ఇది ఆరోగ్య సూత్రం. మనలోని జీవాత్మ జ్యోతి స్వరూపుడిగా మధ్యమంలోని ఆజ్ఞాచక్రంలో సుషుప్త దశలో హృదయస్థానంలో అనగా అనాహత చక్రంలో ఉంటాడు.ఈ బొట్టు(తిలకం) ధరించడం వలన మనిషి భక్తి, ముక్తి కలిగి నిజాయతీగా ఉండడానికి ఉపయోగపడుతుంది.

బొట్టు విశిష్టతఅంతే కాదు నుదుటి పైన బొట్టు ధరించిన వారిని చూస్తే ఎదుటి వారిలోనూ పవిత్ర భావనను కలుగ చేస్తుంది, గౌరవాన్ని కూడా పొందుతారు. పూర్వకాలంలో కాలములో చతుర్ వర్ణాలవారు అయిన బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య, శూద్రులు వేరు వేరు చిహ్నాలను ధరించేవారు. పౌరోహిత్యము లేక శాస్త్ర సంబంధమైన వృత్తిని కలిగిన బ్రాహ్మణులు పవిత్రతకు చిహ్నంగా తెల్లని చందనాన్ని ధరించేవారు.

బొట్టు విశిష్టతక్షత్రియ వంశానికి చెందిన క్షత్రియులు వారు తమ వీరత్వానికి చిహ్నంగా ఎర్రని కుంకుమను నుదటన ధరించే వారు. వర్తక వ్యాపారాల ద్వారా సంపదను పెంపొందించుకునే వైశ్యులు అభివృద్ధికి చిహ్నంగా పసుపు పచ్చని కేసరిని ధరించేవారు.శూద్ర జాతికి చెందిన వారు నల్లని భస్మాన్ని లేక కస్తూరిని ధరించేవారు. విష్ణు ఉపాసకులు U ఆకారముగా చందన తిలకాన్ని, శైవ ఉపాసకులు భస్మ త్రిపున్డ్రాన్ని, దేవి(అమ్మవారి) భక్తులు ఎర్రని కుంకుమ బొట్టును ధరించేవారు.

బొట్టు విశిష్టతభగవంతునికి సమర్పించిన చందనము, కుంకుమ, భస్మము భగవత్ ప్రసాదముగా భావించి తర్వాత నుదుటన పెట్టబడుతుంది. జ్ఞాపక శక్తి మరియు ఆలోచనా శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశములో తిలకమును పెట్టుకుంటాము. యోగ పరిభాషలో ఈ నుదుటి ప్రదేశాన్ని “ఆజ్ఞా” చక్రముగా పిలవ బడుతుంది. బొట్టు పెట్టుకున్న ప్రతి వ్యక్తి భావన విమలంగా,నిర్మలంగా ఉంటుంది. ప్రతి మనిషిలోను దైవాన్ని చూస్తూ ,మానవ సేవయే మాధవ సేవ అన్న భావనతో వ్యవహరిస్తారు. ఈ భక్తి భావన అన్నికార్యకలాపాలలోనూ వ్యాపించుగాక నేను అన్ని వ్యవహారాలలో ధర్మబద్ధముగా ఉందును గాక అనే సంకల్పంచే బొట్టు పెట్టుకో బడుతుంది.

బొట్టు విశిష్టతమనము ఈ వాస్తాలను తాత్కాలికముగా మరచిపోతున్నాం ,కాని ఇతరుల నుదుటిపై ఉన్న బొట్టును చూడగానే మనకు వెంటనే మన భావం గుర్తుకు వస్తుంది. అందుకే ఈ తిలకం ద్వార మనకు భగవంతుని యొక్క ఆశీర్వాదము, అధర్మ భావననుండి విముక్తి కలిగిస్తూ ,వ్యతిరేక దుష్ట శక్తులనుండి రక్షణ కల్పిస్తుంది. మానవ శరీరము మొత్తము ప్రత్యేకించి కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానమును విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని ప్రసరింపజేస్తుంది.

బొట్టు విశిష్టతఅందువలననే విచారముగా నున్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది. తిలకము లేక బొట్టు మన నుదిటిని చల్లబరచి వేడి నుండి రక్షణ నిస్తుంది. శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది. కొన్ని సమయాలలో చందనము లేక భస్మము నుదుట మొత్తము పూయబడుతుంది. బొట్టుకు బదులుగా వాడే ప్లాస్టిక్ బిందిలు అలంకార ప్రాయమే కాని నిజానికివి ప్రయోజనాన్ని కలిగించవు సరికదా చర్మహానిని కలిగిస్తాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR