రాముని స్పర్శ వల్ల తిరిగి మనిషిలా మారిన ఆ రాజు ఎవరో తెలుసా ?

రాముని స్పర్శ చేత రాయి అహల్య అయిందనే విషయం మనకు తెలుసు. కొన్ని సంవత్సరాల నిరీక్షణ తరువాత ఆమెకు ముక్తి దొరికింది రాముని వల్ల. మహా సాధ్వి అయిన అహల్య రాయిలా మారడానికి కారణం గౌతముని కోపం. ఏ కోపం వల్ల అయితే అహల్య రాయిలా మారిందో అదే గౌతముని కోపం ఒక రాజుని గద్దని చేసింది. రాముని స్పర్శ వల్ల తిరిగి మనిషిలా మారాడు. ఆ రాజు ఎవరో తన శాపానికి కారణం ఏమిటో చూద్దాం.

Brahmadattaఒక గుడ్లగూబా, గద్ద తగాదాపడి తీర్పు చెప్పమని రాముడి దగ్గరికి వచ్చాయి. ఒక వనంలో ఒక ఇల్లున్నది. ఆ ఇల్లు నాదంటే నాదని రెండు పక్షులు తగాదా పడుతున్నాయి. ఈ తగాదా తీర్చడానికి రాముడు పుష్పక విమానం మీద తన మంత్రులతో సహా ఆ ఇల్లున్న చోటికి వెళ్లాడు. ‘‘ఈ ఇంటిని నువ్వెప్పుడు కట్టుకున్నావు?’’ అని రాముడు గద్దని అడిగాడు. ‘‘భూమి మీద మనుషులు పుట్టిన కాలంలో నేనీ ఇల్లు కట్టుకున్నాను.’’ అని చెప్పింది.

Brahmadattaవెంటనే రాముడి మంత్రులు ఆ ఇల్లు గుడ్లగూబదేనని తేల్చారు. ఎందుచేతనంటే సృష్టిలో మొదట వచ్చినవి వృక్షజాతులు. గుడ్లగూబ ఇంటిని కాజెయ్యాలని చూస్తుంది కాబట్టి గద్దను శిక్షిస్తానన్నాడు రాముడు.

sri ramuduఅప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది. ‘‘రామా అసలే శాపం అనుభవిస్తూ ఉన్న ఈ గద్దను ఇంకా ఎందుకు శిక్షిస్తావు? ఈ గద్ద బ్రహ్మదత్తుడనే రాజు, మహా ధనికుడు, శూరుడు, సత్యవ్రతుడు. ఇతని ఇంటికి ఒక సారి గౌతముడు వచ్చాడు. అతిథిగా ఉన్నాడు అతిధి సత్కారాలు అందుకున్నాడు. గౌతముడికి రాజు స్వయంగానే ఆర్ఘ్యపాద్యాలిచ్చాడు.

Brahmadattaగౌతముడు బ్రహ్మదత్తుడి ఆతిథ్యం స్వీకరిస్తున్న సమయంలో ఒకనాడు ఆయన భోజనంలోకి పొరపాటున మాంసం వచ్చింది. అది చూసి గౌతముడు కోపంతో, రాజును గద్దవు కమ్మని శపించాడు. ఆ తర్వాత, ఇక్ష్వాకు వంశంలో పుట్టే రాముడు తాకినప్పుడు శాపవిముక్తి కలుగుతుందని గౌతముడన్నాడు. ’’

Brahmadattaఆకాశవాణి పలికిన ఈ మాటలు విని రాముడు ఆ గద్దను తాకాడు. వెంటనే గద్ద ఒక దివ్యపురుషుడుగా మారింది. ఆ పురుషుడు రాముడికి కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోయాడు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR