ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రానైట్ ఆలయం ఎక్కడ ఉందొ తెలుసా

పురాతన దేవాలయాలకు తమిళనాడు పెట్టింది పేరు. అందులోనూ తంజావూరు లో చాలా గొప్ప క్షేత్రాలు ఉన్నాయి. తంజావూరుకు ఆ పేరు తంజన్ అనే పదం నుండి వచ్చింది. హిందూ మత పురాణం ప్రకారం తంజన్ అనే రాక్షసుడు ఈ ప్రదేశంలో శివుని చేతిలో హతమయ్యాడు. ఆ రాక్షసుని ఆఖరి కోరిక మేరకు ఆ స్థలానికి ఆ పేరు పెట్టారు. తంజావూరుకు ఆ పేరు రావటానికి మరొక కారణం కూడా ఉంది. ‘తన్-జా -ఊర్’ అంటే నదులు మరియు ఆకుపచ్చ వరి పొలాల్లో చుట్టూ ఉన్న స్థలం అని అర్ధం. చోళ రాజు కరికలన్ సముద్రం ద్వారా వరదలు సంభవించినప్పుడు పూంపుహార్ కు ఆ సమయంలో వారి రాజధాని నగరంగా తంజావూరును ఉంచటం జరిగింది.

Brihadeeswara Templeతంజావూరులోని బృహదీశ్వర ఆలయం ప్రాచీన హిందూ దేవాలయం. ఇది శైవాలయం (శివాలయం). దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో చేత ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడింది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుతుంది.

Brihadeeswara Templeఎక్కడైనా వేయి సంవత్సరాల ఆలయాలు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి కానీ ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ అత్యధ్భుతంగా కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయంగా ఈ ఆలయం చెప్పబడుతుంది. ఈ ఆలయానికి వేయి సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతుంటారు.

Brihadeeswara Templeఈ ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు, వింతలు ఉన్నాయి. 13 అంతస్థులతో నిర్మితమైన ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎలాంటి ఉక్కు గాని సిమెంట్ కాని వాడలేదు. ఈ ఆలయం నిర్మాణం పూర్తిగా గ్రానైట్ రాయితో చేయబడింది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది.

Brihadeeswara Templeఇక్కడి శివలింగం ఎత్తు దాదాపుగా 3.7 మీటర్లు ఉంటుంది. అంతే కాదు ఈ ఆలయంలో ఉన్న నందీశ్వరుని విగ్రహం ఎత్తు 2.6 మీటర్లు ఉంటుంది. ఇక ఈ ఆలయ గోపుర కలశం 80 టన్నుల ఏకశిలతో నిర్మించడం ఈ ఆలయ విశేషం. ఎవరైనా భక్తులు ఆ ఆలయంలో మాట్లాడుకుంటే ఆ శబ్దాలు ఆలయంలో మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఙానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు.

Brihadeeswara Templeఇక ఈ ఆలయంలో మరో విశిష్టత ఏంటంటే మిట్ట మధ్యాహ్న సమయంలో ఈ ఆలయ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా ఆలయ గోపురం నీడ మాత్రం కనిపించదు. ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి. ఈ రంద్రాలు ఎందుకు పెట్టారనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియని ఒక రహస్యంగానే ఉంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR