ఎర్రటి ప్రమిదలతో ఎన్ని దీపాలు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి

వివాహం అనేది కొత్త జీవితానికి నాంది. కానీ కొంత మంది జాతకంలో ఉండే కొన్ని దోషాల కారణంగా వివాహంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆడపిల్లలకు ఎటువంటి దోషాలు ఉన్నా వివాహం జరగడానికి ఏం చేయాలో తెలుసుకుందాం.

Deeparadanaఎర్రటి ఏడు ప్రమిదలతో దీపం వెలిగిస్తే కన్యలకు వివాహాది దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఏ ఆలయంలోనైనా ఏడు ప్రమిదల్లో శుక్రవారం లేదా మంగళవారం పూట నేతితో దీపం వెలిగిస్తే కన్యలకు మనస్సుకు నచ్చిన వారితో వివాహం జరుగుతుంది. ఇంకా వివాహితలు సైతం ఇలా తొమ్మిదివారాలు దీపమెలిగిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది.

Deeparadanaఇంకా ఒక ప్రమిదతో దీపం వెలిగిస్తే.. విద్యావకాశాలు, ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. రెండు ప్రమిదలతో దీపమెలిగిస్తే.. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. మూడు ప్రమిదలతో దీపమెలిగిస్తే.. దీర్ఘ ఆయుర్దాయం చేరూకుతుంది. నాలుగు ప్రమిదలతో దీపమెలిగించే వారికి.. గృహం, వాహనాల కొనుగోలు వంటి శుభఫలితాలుంటాయి. ఐదు ప్రమిదలతో దీపమెలిగిస్తే.. ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

Deeparadanaఆరు ప్రమిదలైతే.. మంచి స్నేహితులు, ఏడు ప్రమిదలైతే.. వివాహదోషాలు తొలగిపోతాయి. ఎనిమిది ఎర్రటి ప్రమిదలతో దీపమెలిగిస్తే.. శత్రుభయం తొలగిపోతుంది. తొమ్మిది ప్రమిదలైతే.. నవగ్రహదోషాలు హరింపబడుతాయి.

Deeparadanaపది ప్రమిదలతో దీపం వెలిగిస్తే శత్రుభయం ఉండదు. 108 ప్రమిదలతో దీపమెలిగిస్తే… అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 508 ప్రమిదలతో దీపమెలిగించే వారికి వివాహ దోషాలు తొలగిపోయి, మంచి భవిష్యత్తు చేకూరుతుంది. 1008 ప్రమిదలైతే.. సంతాన భాగ్యం కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR