Home Unknown facts పూర్వం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి దాగిఉన్న పుట్ట గురించి తెలుసా?

పూర్వం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి దాగిఉన్న పుట్ట గురించి తెలుసా?

0

తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి. ఈ స్వామిని ఏడుకొండలవాడని, గోవింధుడని, బాలాజీ అని, తిరుమలప్ప అని, వెంకటరమణుడని, మలయప్ప అని ఇలా ఎన్నో పేర్లతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. మరి శ్రీనివాసుడి దాగి ఉన్న పుట్ట గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వస్వామి వారి దర్శనానికి మనం వెళ్ళినప్పుడు ముందుగా మనం వెండివాకిలిని దాటి తరువాత బంగారు వాకిలి గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటాం. అయితే ఈ వెండివాకిలి గోపురం యొక్క ప్రాకారానికి, బయట ఉన్న మహాద్వారా ప్రాకారానికి మధ్యనున్న సుమారు 30 అడుగుల ప్రదక్షిణ మార్గాన్ని సంపెంగ ప్రదక్షిణం అని అంటారు. మనం ఆలయంలోకి ప్రవేశించగానే మొదటి ప్రదక్షిణ మార్గమే ఈ సంపెంగి ప్రదక్షిణ మార్గం. అయితే పూర్వం సంపెంగి ఆవరణం లోని మహాద్వారానికి దగ్గరలో  ఒక పెద్ద చింత చెట్టు ఉండేదట. ఆ చెట్టు కొమ్మలు పెరిగి బాగా విశాలంగా వ్యాపించి ఆ చెట్టు ఎటు తిరగక ఆ వృక్షం మూలంలోనే స్థిరంగా ఉండేదట. అందుకే ఈ చెట్టు నీడ తిరగని చెట్టుగా ప్రసిద్ధిచెందింది. ఇంకా ఈ చెట్టు నిరంతరం చిగురిస్తూ, పుష్పించడం వలన ఈ చెట్టు నిద్రపోని చెట్టుగా పిలవబడిందని చెబుతారు. అయితే ఈ చెట్టు కింద ఉన్న పుట్టలోనే శ్రీనివాసుడు కొంతకాలం దాగి ఉన్నాడు. ఆ తరువాత కొంతకాలానికి విగ్రహమూర్తిగా స్వామివారు స్వయంభువుగా  పుట్టలో నిక్షిప్తమై ఉండగా, ఆ నీడ తిరుగని, నిద్ర ఎరుగని చింత చెట్టు సాక్షాత్తు ఆదిశేషుడని, ఆ చెట్టుకింద ఉన్న పుట్ట దేవకీదేవి అని పురాణం.

srinivasuduఇది ఇలా ఉంటె, మొదటిసారిగా గోపీనాథుడు ఇక్కడకి వచ్చి పుట్టలో ఉన్న స్వామివారిని దర్శించి ప్రస్తుతం స్వామివారి ఉన్న ఆ చోటనే ప్రతిష్టించి అక్కడే ఉంటూ రోజు స్వామివారికి పూజలు చేసాడట. ఆ తరువాత కొన్ని రోజులకి రంగదాసుడు అనే భక్తుకు ఈ ప్రాంతానికి వచ్చి ఒక బావిని తవ్వి సంపెంగ, చేమంతి, మున్నుగు చెట్లని పెంచి స్వామివారి పూజకి అవసరమయ్యే పూలను, పండ్లని సమర్పిస్తూ అర్చకుడిగా గోపీనాథుడికి సహాయంగా ఉండేవాడట.

ఆ రంగదాసే మళ్ళీ జన్మలో తొండమాన్ రాజుగా జన్మించి స్వామివారికి గోపురప్రాకారాదులు నిర్మించాడట. ఇంకా వెంకటాచలామహత్య గ్రంధం ప్రకారం, శ్రీ వేంకటేశ్వరస్వామి తనకి అత్యంత ప్రీతికరమైన చింత చెట్టు కి కొంతదూరంలో ఉన్న లక్ష్మీదేవికి ప్రియమైన ఎల్లప్పుడూ పుష్పించే చంపకవృక్షాన్ని మాత్రం రక్షించి మిగిలిన చెట్లని తొలగించి ఆలయప్రాకారాదులు నిర్మించవలసిందిగా తొండమాన్ రాజుకి ఆదేశించాడట.  అయితే భగవద్ద్రామానుజుల కాలం 11వ శతాబ్దంలో ఈ చెంత చెట్టును దర్శించినట్టుగా పరమయోగివిలాసం అనే గ్రంధంలో వ్రాయబడింది. శ్రీ వేంకటాచల ఇతిహాసం అనే గ్రంధం ప్రకారం శ్రీరామానుజాల వారు నిత్యం వాటికీ పూజాదికార్యక్రమాలు నిర్వహించినట్లుగా పేర్కొనబడింది. అంతేకాకుండా చిన్నన్న రాసిన అన్నమాచార్య జీవిత చరిత్ర ఆధారంగా, తాళ్ళపాక అన్నమాచార్య మొదటిసారిగా వేంకటాచల యాత్ర చేసినప్పుడు నీడతిరగని చింత చెట్టుని దర్శించి సేవించినట్లుగా పేర్కొనబడింది.

Exit mobile version