Home Unknown facts థాయిలాండ్ లో ఇప్పటికి శ్రీరాముని వంశానికి చెందినవారే అక్కడ రాజుగా కొనసాగుతున్నారా ?

థాయిలాండ్ లో ఇప్పటికి శ్రీరాముని వంశానికి చెందినవారే అక్కడ రాజుగా కొనసాగుతున్నారా ?

0

తేత్రాయుగంలో రామాయణం జరుగగా రామాయణ గ్రంథాన్ని వాల్మీకి మహర్షి రచించాడు. ఒక్క భారతదేశంలోనే కాకుండా ఇండొనీషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ వంటి దేశాల్లో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది. అయితే థాయిలాండ్ లో ఇప్పటికి రామరాజ్యమే ఉందని, శ్రీరాముని వంశానికి చెందినవారే అక్కడ రాజుగా కొనసాగుతున్నారని చెబుతున్నారు. మరి థాయిలాండ్ లో నిజంగా రామరాజ్యం ఉందా? అలా అనడం వెనుక కారణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sri Rama Rajyam

వాల్మీకి మహర్షి బాలకాండలో శ్రీ రాముని వివాహం గురించి, తన తమ్ముల వివాహం గురించి వివరించడం జరిగింది. వాల్మీకి మహర్షి బాలకాండలో చెప్పిన దాని ప్రకారం, మిధిలా రాజ్యానికి రాజు జనకుడు. శ్రీరాముడికి జనకుడి కుమార్తె జానకితో వివాహం జరిగింది. జనకుడి తమ్ముడైన కుశధ్వజుడు కి శ్రుతకీర్తి, ఊర్మిళ, మాండవి అనే ముగ్గురు కూతుర్లు ఉండగా, లక్ష్మణుడు తో ఉర్మిళకు, భరతుడికి మాండవి తో, శత్రుఘ్నుడుకి శ్రుతకీర్తి తో వివాహం జరిగింది.

ఇది ఇలా ఉంటె, సీతారాములకు లవకుశులు, ఊర్మిలలక్ష్మణులకు అగంధ చంద్రకేతులు, మాండవిభరతులకు పుష్కరుడు, తక్షుడు, శ్రుతకీర్తిశత్రుఘ్నలకి సుబాహువు – శతృఘాతకుడు అనే వారు జన్మించారు. అయితే శ్రీరాముని సమక్షంలోనే రాజ్య విభజన జరుగగా, పశ్చిమాన లవకు లవపురం, తూర్పున కుశకు కుషావతి, తక్షణునికి తక్షశిల, అగంధునికి అంగదనగరం, చంద్రకేతునికి చంద్రావతి నగరాలను ఇవ్వడం జరిగింది.

వీరిలో తూర్పున కుషావతి పరిపాలిస్తున్న కుశుడు తన రాజ్యాన్ని తూర్పు దిక్కున విస్తరించుకొని నాగవంశపు కన్యను వివాహం చేసుకున్నాడు. ఇలా కుశుడు తూర్పున తన రాజ్యాన్ని విస్తరించుకోగా కుశుడి వంశం వారే థాయిలాండ్ లో రాజులుగా ఉన్నారని చెబుతున్నారు. ఇక్కడ రాజుల వంశం వారిని చక్రి వంశం అని అంటారు. చక్రి అంటే విష్ణువు అనే అర్ధం ఉంది. ప్రస్తుతం ఇక్కడ కుశుడు వంశానికి చెందిన భూమిబల్ అతుల్య తేజ్ అనే రాజు ఇక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడని చెబుతున్నారు.

ఇంకా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ కాగా అక్కడి ప్రభుత్వ రికార్డులో అధికారిక పేరు మాత్రం చాలా పొడవుగా ఉంటుంది. అతిపొడవైన రాజధాని పేరు ఇదే కాగా ఈ పేరు సంస్కృతంలో ఉండటం విశేషం. దీన్నే కొందరు మహింద్ర అయోధ్య అని పిలుస్తుంటారు. అంటే ఇంద్రుడు నిర్మించిన అయోధ్య అని అర్ధం. థాయిలాండ్ కి చెందిన రాజులందరూ కూడా ఇక్కడే నివసిస్తారని చెబుతున్నారు. అయితే థాయిలాండ్ లో బౌద్ధమతం స్వీకరించినవారు ఎక్కువ ఉన్నపటికీ వారి జాతీయ గ్రంథం మాత్రం రామాయణం. రామాయణ గ్రంధాన్ని వారు రామ్ కియేన్ అని పిలుస్తుంటారు. అంతేకాకుండా శివుడు, విష్ణువు, సూర్యుడు వంటి కొందరు హిందుదేవుళ్ళని కూడా వీరు ఎక్కువగా పూజిస్తుంటారు.

శ్రీమహావిష్ణువు యొక్క వాహనం గరుడపక్షి. పురాణాల్లో గరుత్మంతుడి గురించి ఎన్నో కథలు ఉన్నాయి. ఇక థాయిలాండ్ జాతీయ పక్షి కూడా గరుత్మంతుడు అవ్వడం విశేషం. శ్రీరాముడు శ్రీమహావిష్ణువు యొక్క అవతారం. ఈవిధంగా రామాయణం నిజమని థాయిలాండ్ లో ఒకప్పుడు రామరాజ్యమే ఉందని చెప్పడానికి ఇవే సాక్ష్యాలు గా చెప్పవచ్చు.

Exit mobile version