ఆంజనేయస్వామి పాదాల దగ్గర తాకకూడదుఎందుకో తెలుసా ?

0
1278

హనుమంతుని గుడి లేని ఊరు అరుదు. రామాయణంలో రామునికున్నంత ప్రాముఖ్యం హనుమకూ ఉంది. హనుమాన్ అంజనాదేవి, కేసరిల సుతుడు. కోరిన కోర్కెలు తీర్చే అంజన్న.. భక్తులు పూలు, పత్రులతో పూజించగానే కొండంత అండై నిలుస్తాడు.ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ధైర్యన్నిస్తాడు. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయస్వామి ప్రత్యక్షమవుతారని భక్తుల విశ్వాసం. ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ శ్రీరామచంద్రులవారు తప్పక ఉంటారు. శ్రీరాముని పేరు వినగానే మనకు ఆంజనేయస్వామి తప్పక గుర్తు వస్తారు. హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు.

Hanumanఅయితే హనుమంతుడిని పూజించే విషయంలో ఖచ్చితంగా కొన్ని ఆచారాలున్నాయి. ముఖ్యంగా ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి. అన్ని దేవాలయాల్లో మూడు ప్రదక్షిణలు చేస్తుంటాం.. కానీ ఆంజనేయస్వామి ఆలయంలో ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసే సమయంలోనూ ‘శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్’అని చదవడం మంచిది. సకల రోగ, భూతప్రేత పిశాచాది బాధలు తొలగించడంలో ఆంజనేయస్వామి ముందుంటాడు. కాబట్టి భక్తులు ఏ బాధలో ఉన్నా కూడా ప్రదక్షిణలు చేస్తే ఆ బాధలన్నీ పోతాయి.

Hanumanకొంతమంది ఒకేరోజు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తుంటారు. అలా చేయలేని వారు 54, 27 పర్యాయాలు చేసినా మంచిదే.. అయితే, లెక్క తప్పకుండా చేయాలి. అలాగే ఆంజనేయస్వామి పాదాల దగ్గర తాకకూడదు.. ఎందుకంటే భూత ప్రేత పిశాచాలను తన పాదాక్రాంతం చేసుకున్నాడని అందుకే పాదాలను తాకకూడదని చెప్తారు.. భక్తులు హనుమంతుడికి ఎం సమర్పించాలన్నా పూజారిగారి చేతులమీదగానే సమర్పించాలి.. ముఖ్యంగా ఆడవారు హనుమంతుణ్ణి తాకకూడదని అంటారు.. ఎందుకంటే అంజనీ సుతుడు బ్రహ్మచారంలో ఉంటాడు..

 

SHARE