మొఘల్ చక్రవర్తి కోసం దీనిని నిర్మించారని చెబుతారు. ఈ జంతర్ మంతర్ ప్రయోగశాలలో మొత్తం 13 ఆసక్తికరమైన ఖగోళ సంబంధ సాధనాలు ఉన్నాయి. మరి ఆ 13 ఆసక్తికరమైన ఖగోళ సంబంధ సాధనాలు ఏంటి? అవి చేసే పని ఏంటి? ఈ ప్రయోగశాల ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూఢిల్లీలోని పార్లమెంట్ వీధిలో జంతర్ మంతర్ అని పిలువబడే ప్రయోగశాల ఉంది. దీనినే సూర్యగడియారం అని అంటారు. ఇది కొన్ని ప్రత్యేక ఖగోళ సంబంధ సాధనాలు ఉన్న ప్రసిద్ధ పరిశోధన శాల. అయితే క్రీ.శ. 1725 వ సంవత్సరంలో రెండవ జైసింగ్ మహారాజు దీనిని నిర్మించారు.
భారతదేశంలో ఉన్న ఐదు ప్రదేశాలలో ఇది ఒకటి. పంచాంగం, జ్యోతిష్య శాస్ర పట్టికలను సవరించమని మొగుల్ చక్రవర్తి అడుగగా అయన కోసం మహారాజు దీనిని నిర్మించారు.
జ్యోతిష్య శాస్ర పట్టికలు తయారీ, సూర్యుడు, చంద్రుడు, గ్రహాల కదలికలను అంచనా వేయడం వంటి లక్ష్యాల కోసం నిర్మించిన ఈ జంతర్ మంతర్ లో మొత్తం 13 ఆసక్తికరమైన ఖగోళ సంబంధ సాధనాలు ఉన్నాయి. అయితే జంతర్ మంతర్ పేరుతోనే జైసింగ్ నిర్మించిన ఇతర ఐదు పరిశోధన శాలలు జైపూర్, వారణాసి, ఉజ్జయిని, మధురలలో ఉన్నవి.
పరికరాల గురించి జంతర్ మంతర్ లోని కొన్ని ప్రత్యేక పరికరాలు ఏంటంటే, రాం యంత్రం, మిశ్రమ యంత్రం, సామ్రాట్ యంత్రం, జయప్రకాశ్ యంత్రం. ఇక ఇందులో మిశ్రమ యంత్రం లో భూగోళంలోని అనేక ప్రాంతాలలో మధ్యాహ్నంగా మార్పు చెందడాన్ని సూచించే పనిచేసే నిర్మాణం ఉంటుంది. సామ్రాట్ యంత్రంలో, ఒక బ్రహ్మాండమైన 70 అడుగుల ఎత్తైన పరికరం వాస్తవానికి సూర్య గడియారానికి సమానంగా, ఇక జయప్రకాశ్ యంత్రంలో ఒక నక్షత్ర స్థానాన్ని సర్దుబాటు చేసే లక్ష్యంతో నిర్మించారు.
ఈవిధంగా నిర్మించిన జంతర్ మంతర్ ప్రయోగశాలని సందర్శించడం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంటుంది.