కర్మకు తగ్గ ఫలితం.. రామాయణంలో సీతారాముల అద్భుత సంభాషణ

0
782

ఒకసారి సీతాదేవి శ్రీరామునితో ఇలా అన్నదట… స్వామి.. అందరి కష్టాలనూ, దుఃఖాలనూ మీరు తీర్చించు కదా ? మీ రాజ్యంలోని ప్రజలందరూ సంతోషంగా ఉండేలా మీరు చేయవచ్చు కదా.. మీరు సంకల్పిస్తే అది సాధ్యమే కదా.. అయినప్పటికీ ఎందుకు వెనుకాడుతున్నారు అని,అందుకు శ్రీరాముడు బదులుగా , సీత.. ఏకకాలంలో అందరూ సంతోషంగా ఉండడం అనేది ఎలా సాధ్యం అవుతుంది కదా?  అని అన్నాడు. అపుడు సీత , ఎందుకు కాదు స్వామి మీరు తలచుకుంటే సాధ్యమే . ఎవరికి ఏమి కావాలో వాటిని కోశాగారం నుండి సరఫరా చేసేలా చూడండి అని చెప్తుంది..

Ram Sithaవెంటనే శ్రీరాముడు సీత మాటను మన్నించి, సరే.. నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని చెప్పి, తమ్ముడైన లక్ష్మణుని పిలిచి , ఇకపై ఎవరికి ఏమి కావలసినా వాటిని కోశాగారం నుండి తీసుకోవచ్చు అని ప్రకటన జారీ చేయమని ఆజ్ఞాపించాడు. దానితో ప్రజలందరు వెంటనే రాజభవనానికి వెళ్లి తమ తమ అవసరాలు తెలియచేయసాగారు.. . కోశాగారం తెరిచి అందులో ఎవరికీ ఏంకావాలో అవి వారికీ ఇచ్చేసారు.. అలా ప్రజలు అందరూ సుఖంగా జీవించసాగారు .

Sri Ramఅప్పుడు శ్రీరామ చంద్రమూర్తి మాయ యొక్క ప్రభావంతో సీతారాములు నివసిస్తున్న భవనం పై కప్పు వాన కారణంగా కారసాగింది . మరమ్మత్తు చేయడానికి మనుషులకై కబురు పంపుతారు… కాని అందరూ సుఖంగా ఉన్నారు.. ఎవరికీ ఏం కావాలన్నా కష్టపడకుండా రాజుగారి కోశాగారము నుండి తీసుకెళ్తున్నారు.. వారికీ కష్టపడే అవసరమే లేకుండా పోయింది.. కావున రాముల వారి నివాసం యొక్క ఇంటి కప్పు సరిచేసే పనిచేయడానికి ఎవరూ రాలేదు. దాంతో సీతమ్మవారు నా అజ్జ్ఞానపు కోరిక వలెనే ఇలా ఐనది అని గ్రహించి.. శ్రీరామునితో ఇలా అన్నది.. స్వామి ఇలా తడుస్తూ, తడుస్తూ ఇక భరించలేను.. అన్నిటిని మునుపు ఉన్నట్లే చేయండి. ఆలా చేస్తేనే ఈ పనులకు మనుషులు లభిస్తారు . ఏకకాలంలో అందరూ సంతోషంగా ఉండడం అనేది అసంభవం అని గ్రహించాను అని వేడుకుంది.. అపుడు శ్రీరాముడు అలాగే జరుగుగాక అని అన్నాడు. అన్నీ మునుపటిలా సర్దుకున్నాయి.. పనికి మనుషులు లభించసాగారు .

Rama Sithaఅప్పుడు సీత, ప్రభూ ఈ సృష్టి అంతా మీ అద్భుత లీల అని గ్రహించలేకపోయాను నన్ను క్షమించండి అని క్షమాపణ కోరుతుంది.. అపుడు శ్రీరాముడు సీతా.. ఈ సృష్టిలో ప్రతిదానిలోనూ కర్మకు తగినట్లే ఫలితం అందుకు తగినట్లే అవకాశాలు కూడా లభిస్తాయి.. సర్వవేళలా సంతోషంగా ఉండేవారు ఎవరూ ఉండరు , అలాగే అన్ని జన్మలలోను దుఃఖాన్నే అనుభవించేవారూ ఉండరు.. సృష్టి అంటేనే సుఖ దుఃఖాలతో కూడుకున్నదని అర్ధం.. అసలు దుఃఖమే లేకుంటే సుఖానుభూతి ఉండదు కదా… కాబట్టి అందరూ ఒకేసారి సుఖంగా ఉండటం అసాద్యం. కావున సుఖం వెంట దుఃఖం, దుఃఖం లోనుంచి సుఖానుభూతి కలుగుతుందని సెలవిస్తాడు..

SHARE