కార్తీక దామోదర మాసం ఎందుకు కృష్ణుడికి ఇష్టమైనదో తెలుసా ?

శ్రీమహావిష్ణువుతో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం, కార్తీకమాసంతో సమానమైన మాసం లేదని అంటారు. కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు. శ్రీకృష్ణుడికి ఇష్టమైన మాసం. అసలు ఈ కార్తీక దామోదర మాసం ఎందుకు కృష్ణుడికి ఇష్టమైనదో తెలుసుకోవాలంటే ఈ కథనం తెలుసుకోవాల్సిందే.

కార్తీక దామోదర మాసంఓ రోజు కృష్ణుడు మజ్జిగ చిలుకుతున్న యశోదాదేవి వద్దకు వచ్చి ఆకలేస్తుందని చెప్పాడు. వెంటనే యశోదా దేవి ఆపనిని ఆపి కృష్ణుడికి పాలు ఇస్తుంధీ. తాను వంట గదిలో పొయ్యి వెలిగించి వచ్చిన విషయం గుర్తొచ్చి పాలు తాగే కృష్ణయ్యను కిందకు దింపి తాను వంట గదిలోకి వెళ్తుంది. తనను పాలు తాగనీయకుండా తన పని చూసుకోడానికి వెళ్లిన యశోద పైన కృష్ణుడు కోపగించుకుని అక్కడ ఉన్న వెన్నకుండను పగలకొట్టి ఒక రోలు మీద కూర్చుని తినసాగాడు.బయటకు వచ్చిన యశోదాదేవి తన బిడ్డ కనిపించకపోయేసరికి వెతకగా కృష్ణుడు రోలు మీద కూర్చుని వెన్న తింటూ కనిపించాడు. అప్పుడు యశోదాదేవి కృష్ణుడిని మందలిస్తూ ఒక కర్ర తీసుకుని తన వెంట పరిగెత్తుతూ కృష్ణుడిని పట్టుకుని, అక్కడ ఉన్న రోలుని కృష్ణుడి పొట్టకు ఒక తాడుతో కట్టసాగింది. ఎంత ప్రయత్నించినా కూడా ఆ తాడు కృష్ణుడి ఉదరమునకు తక్కువైంది.

కార్తీక దామోదర మాసంతన తల్లి తనను బంధించడానికి పడే కష్టాన్ని చూడలేని కన్నయ్య, తన తల్లి తనవల్ల బాధపడకూడదని. ఆ తాడు తన పొట్టకు సరిపోయేలాగా చేసుకుని కట్టించుకుంటాడు. ఇలా తన తల్లి పైన ఉన్న ప్రేమతో కృష్ణుడు ఆ దామము (తాడు)తో ఉదరముకి కట్టించుకున్నాడు. కాబట్టి ఈ మాసానికి కార్తీక దామోదర మాసము అని పేరు వచ్చింది. అలా తల్లి కట్టిన రోలుతో కృష్ణుడు ఆడుకుంటూ వుండగా ఉద్యానవనంలో ఉన్న రెండు చెట్ల మధ్యలో ఈ రోలు ఇరుక్కుపోయింది. ఆ రోలును కృష్ణుడు బలవంతంగా లాగడంతో చెట్లు రెండు వేర్లుతో సహా పెకిలించుకుని పడిపోయి శాప విముక్తి పొందుతాయి. ఇంతకీ శాపవిమోచనం కలిగిన వారు ఎవరంటే కుబేరుని కుమారులు నలకుబేర,మణిభద్రలు.

కార్తీక దామోదర మాసంరాజభోగాలు అనుభవిస్తూ కొలనులో మద్యాన్ని సేవిస్తూ స్నానం ఆచరిస్తుండగా అటుగా వెళ్తున్న నారద మునివర్యులని పట్టించుకోరు. కోపం వచ్చిన మునివర్యులు మద్దిచెట్లు కమ్మని శాపానికి గురైనట్లు నలకుబేర, మణిభద్రలు చెప్తారు. అయితే క్షమాబిక్ష కోరడంతో కృష్ణుడు మీకు శాపవిముక్తి చేస్తాడని చెప్పినట్లు వివరిస్తారు. ఇలా అర్జున చెట్లుగా ఉన్న తమకు విముక్తిని ప్రసాదించి తమను దీవించారని కృష్ణభగవానుడిని ఉద్దేశించి దామోదరాష్టకమును గానం చేసారు.

కార్తీక దామోదర మాసంఈ కార్తీక దామోదర మాసమును ప్రతి సంవత్సరం దేశములో ఉన్న అన్ని ఇస్కాన్ మందిరాలలోను జరుపుతారు. ఈ దామోదర, కార్తీక మాసంలో శ్రీ తులసీ ధాత్రీ సహిత దామోదర వ్రతం, శ్రీ రాధా దామోదర వ్రతం చేస్తారు.

కార్తీక దామోదర మాసంఅలాగే ఈ దామోదర మాసం లేదా కార్తీకంలో ఎవరైతే ప్రతిరోజూ నేతితో కేశవుని ఆలయంలో దీపం వెలిగిస్తారో వారికి సంతానం, ఆయుర్దాయం, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని స్కంద పురాణం చెప్తోంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR