కార్తీకపౌర్ణమి రోజున 365వత్తులతో దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు?

సాధారణంగా కార్తీక మాసం ముగిసే వరకూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగించి దేవతలను పూజిస్తారు. అందులో కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి పరమ పవిత్రమైన రోజు. ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని ”త్రిపురి పూర్ణిమ”, ”దేవ దీపావళి” అని కూడా అంటారు. ఈ కారీక పౌర్ణమి రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు.

కార్తీకపౌర్ణమిరోజూ దీపాలు వెలిగిస్తారు కదా మరి కార్తీక పౌర్ణమి రోజు 365వత్తులతో దీపాన్ని వెలిగించడానికి కారణం ఏంటి? కార్తిక పౌర్ణమి రోజున గుత్తి దీపాలు పెట్టడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒక ఇల్లు కడితే ఆ ఇంట దీపం లేకుండా ఒక్క రోజూ ఉండకూడదు. మనం కట్టుకున్న ఇంటికి తాళం పెట్టి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఇంటి పురోహితుణ్ణి పిలిచి- ‘‘మా పూజామందిరంలో దీపం వెలిగించి, స్వామికి నైవేద్యం పెట్టండి’’ అని చెప్పి, ఇంటి తాళం ఇచ్చి వెళ్ళాలని శాస్త్రం చెబుతోంది.

కార్తీకపౌర్ణమిఎందుకంటే ఇంట దీపం వెలగలేదు అంటే అది పరమ అమంగళకరమైన గృహం అని చెబుతారు. ‘స్వగృహే’ అని ఎక్కడ కూర్చొని సంకల్పం చెప్పుకుంటామో అక్కడ అన్ని చోట్లా దీపం వెలగాలి. అలా దీపం వెలగకపోతే దోషం మనకే వస్తుంది. ఆ ఇంట్లో తిరిగినందుకు కలిగే పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా లభించిన అద్భుతమైన తిథి కార్తిక పౌర్ణమి. అందుకే కార్తిక పౌర్ణమి నాడు 365 వత్తులను ‘గుత్తిదీపం’ గా ఆవునేతిలో ముంచి వెలిగిస్తారు.

కార్తీకపౌర్ణమిరోజు దేవునికి దీపారాధన చేయలేని వారు రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తం పూజించిన పుణ్యఫలం ఈ రోజు వత్తులు వెలిగించడం వలన వస్తుంది.

కార్తీకపౌర్ణమికొందరు దీపాలను అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR