కులు మనాలి అనే పేరు వెనుక మత్స్యావతారం నాటి విశేషం ఏంటో తెలుసా ?

నేటి రోజులలో వివాహం అవటం ఆలస్యం కొత్త జంటలు హనీ మూన్ ప్లాన్ చేయటం వారి వారి అనుకూలం మేరకు ఒకటి లేదా రెండు వారాలు ఆనందిన్చేసి రావటం అలవాటైంది. ఈ కొత్త జంటల హనీ మూన్ కు అనేక ప్రదేశాలు ఉన్నాయి. అయితే, ఎన్ని సార్లు చూసినా మరో సారి చూడాలనిపించే ప్రదేశం మనాలి. ప్రత్యేకించి మహిళలు ఈ ప్రదేశ అందాలకు ముగ్ధులై మరపు రాని పర్యాటక అనుభవాలను మూటకట్టుకొని రెట్టింపు ఉత్సాహంతో తమ వివాహ జీవితాలు మొదలు పెడతారనటం లో ఎటువంటి సందేహంలేదు. అక్కడి మంచు పర్వతాలను చూస్తే ఎవ్వరైనా చిన్న పిల్లలు అవ్వాల్సిందే ..! ఆ ప్రదేశంలో చిన్నా – పెద్దా అనే తేడా లేకుండా పోటీపడి మంచు ముక్కలతో ఆడుకుంటుంటారు. హిమాలయాలలో ఉన్న అన్ని ప్రాంతాల్లోకెల్లా కులు మనాలి స్థలాలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. అయితే కులు లోయలోని మనాలికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా! దీని వెనుక మత్స్యావతారం నాటి విశేషం ఉంది. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం.

Interesting Facts About Kullu Manaliవిష్ణుమూర్తి ధర్మాన్ని రక్షించేందుకు పది అవతారాలు ఎత్తిన విషయం మనకు తెలిసిందే. సృష్టిని మహాప్రళయం నుంచి రక్షించేందుకు విష్ణుమూర్తి ఎత్తిన తొలి అవతారమే మత్స్యావతారం. ఇందుకోసం ఆయన ఒక చిన్న చేపపిల్ల రూపంలో మనువు చెంతకి చేరాడు. ఆ చేప పిల్ల అంతంతకూ అమాంతంగా పెరిగిపోవడం చూసిన మనువు అది సాక్షాత్తూ దైవస్వరూపమని తెలుసుకున్నాడు. ఇంతలో ఆ చేప రూపంలో ఉన్న మహావిష్ణువు తాను వచ్చిన కార్యాన్ని చెప్పి, మహాప్రళయం తరువాత తిరిగి సృష్టి కొనసాగేందుకు మనువుకి ఒక బాధ్యతను అప్పగించాడు.

Interesting Facts About Kullu Manaliఆ రోజు నుంచి ఏడో నాటికి జల ప్రళయం సంభవిస్తుందనీ, ఆ ప్రళయాన్ని ఎదుర్కునేందుకు ఒక పెద్ద ఓడను నిర్మించుకోమనీ మనువుని ఆదేశించాడు విష్ణుమూర్తి. ఆ ఓడలోకి మునులనూ, ఔషధాలను, జీవజాతులనూ ఎక్కించుకుని సిద్ధంగా ఉండమని సూచించాడు. విష్ణుమూర్తి మాటప్రకారమే మహా ప్రళయం సంభవించడం, ఆ ప్రళయంలో మత్స్యావతార సాయంతో మనువు రూపొందించిన నావ చెక్కు చెదరకుండా నిలవడం అందరికీ తెలిసిన కథే! జలప్రళయం ముగిసేనాటికి మనువు ఎక్కడైతే అడుగుపెట్టాడో ఆ ప్రదేశమే మనాలి అని స్థానిక ఐతిహ్యం. అడుగుపెట్టడమే కాదు, ఆ ప్రదేశాన్ని తన నివాసస్థానంగా మార్చుకుని అక్కడే తపస్సునాచరించాడట. దాంతో ఈ ప్రదేశానికి ‘మనువు ఆలయం’ అన్న పేరు స్థిరపడింది.

Interesting Facts About Kullu Manaliఅదే క్రమంగా మనాలిగా మారింది. ఈ నమ్మకాన్ని బలపరుస్తూ అక్కడ మనువుకి ఓ అరుదైన ఆలయం కూడా ఉంది! మహాభారతంలో కూడా మనాలి ప్రస్తావన వస్తుంది. పాండవులు అరణ్యవాసం చేస్తూ ఈ దిశగా వచ్చారనీ. ఇక్కడే భీముడు, హిడిండిని వివాహం చేసుకున్నారనీ చెబుతారు. అందుకు సాక్ష్యంగా మనాలిలో అరుదైన హిడింబి ఆలయం కూడా ఉంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR