Home Unknown facts రోజూ మహిళలు ఇలా చేస్తే మీ ఇల్లు లక్ష్మి నివాసంగా అవుతుంది ?

రోజూ మహిళలు ఇలా చేస్తే మీ ఇల్లు లక్ష్మి నివాసంగా అవుతుంది ?

0

తమ ఇంటిని లక్ష్మి నివాసంగా మార్చుకోవాలని ఎవరు మాతరం అనుకోరు.. మరి ఆలా మీ ఇల్లు లక్ష్మి నివాసంగా మారాలంటే కొన్ని పద్ధతులు పాటించాలని పండితులు చెప్తారు.. మరి అవేంటో తెల్సుకుందాం.. ఇల్లు అనగానే అందరికి గుర్తొచ్చేది ఇల్లాలు..ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు… ఎందుకంటే ఇంట్లో ఇల్లాలు  అనుసరించే విధానాలే ఆ ఇంట్లోని పిల్లల నడవడికపై ప్రభావం చూపుతాయి. ఇల్లును చూసి ఇల్లాల్ని చూడాలి అనికూడా అంటారు పెద్దలు..  ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మీ తాండవం చేస్తుంది. రోజూ మహిళలు ఇలా చేస్తే పేదరికం ఇంటి నుంచి పలాయనం చిత్తగించడం ఖాయం.

Laksmi Deviసూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మీ వెంటాడుతుంది.స్త్రీ ఇంటిని శుభ్రం చేయాలంటే, సూర్యోదయానికి ముందే చేయాలి. ఇలా చేయటం వలన ఇంటిల్లిపాది  త్వరగా లెస్ సంప్రదాయం అలవడుతుంది… సూర్యోదయం తరువాత శుభ్రం చేయడం వల్ల ఇంటి పేదరికం కలుగుతుంది.

ఇంటిని  శుభ్రపరిచిన వెంటనే స్త్రీ స్నానం చేయాలి. మధ్యాహ్నం ఆలస్యంగా స్నానం చేయడం వల్ల ఇంట్లో పేదరికంతోపాటు వంటికి బాధలు తప్పవు. కుటుంబ సభ్యులకు వంట చేయడం దేవునికి వండటం లాంటిదని అంటారు. అందువల్ల మహిళలు స్నానం చేసిన తర్వాతే కాకుండా స్నానం చేసిన తర్వాతే వంటగదిలోకి ప్రవేశించాలి. దైవ ప్రార్థన చేసిన, నైవేద్యం సమర్పించిన తర్వాతే ఏదైనా స్వీకరించాలి. కడుపునిండా ఆరగించి  దేవుడికి నమస్కారం చేస్తే లక్ష్మీదేవి కలత చెంది ఇంటి నుంచి వెళ్లిపోతుంది.

స్త్రీ ఎప్పుడూ కోపంగా లేదా చిరాకుగా ఉండే ఇంట్లో ఎప్పుడూ సంతోషంగా ఉండరు. అందువల్ల, స్త్రీ ఎటువంటి కారణం అయినా  కోపం, కలత చెందకుండా ఉండాలి. ఇది ఇంట్లో శాంతి మరియు ప్రశాంతతను దెబ్బ తీస్తుంది..  అలాగే ఇంట్లోని స్త్రీలు సూర్యాస్తమయం అయ్యాక తల దువ్వడం చేయరాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. ఆడవారే కాదు మగవారు కూడా సాయంత్రం అయ్యాక తలా దువ్వకూడదు..

ఇంటి నైరుతి మూలలో ఈత కొలను లేదా నీటి సంపులు వంటి నీటి వనరులను నిర్మించవద్దు. ఇది ఇంట్లో పేదరికం మరియు వేదనకు కారణమవుతుంది. మీ నగదు పెట్టె లాకర్‌ను ఇంటి ఉత్తరం వైపు తెరిచి ఉంచండి. కుబేర చిత్రాన్ని నగదు పెట్టెలో ఉంచడం ఇంట్లో శ్రేయస్సుకు దారితీస్తుందని కూడా నమ్ముతారు. మీ నగదు పెట్టెను మసక వెలుతురులో ఉంచవద్దు. అలా చేయడం వల్ల మీ సంపద అంతా పోయే ప్రమాదం ఉంది.ఇంట్లో ఎక్కువ సంపదను ఆకర్షించే మరో విధానం ఏమిటంటే నగదు పెట్టె ముందు అద్దం ఉంచడం. ఇలా చేయడం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది.

ఇంటి మొత్తాన్ని శుభ్రంగా ఉంచాలి. ముఖ్యంగా, మీ ఇంటి ఈశాన్య మూలలో ఏ వస్తువులు కూడా చెల్లాచెదురుగా ఉండకుండా  జాగ్రత్త వహించండి. ఈశాన్యంలో మెట్లు నిర్మించకూడదు. కొన్ని ఇండోర్ ప్లాంట్లు మరియు మనీ ప్లాంట్లను ఇంటి నైరుతి మూలలో ఉంచండి. ఇది ఇంట్లో సంపద ప్రవాహాన్ని స్థిరీకరిస్తుందని మరియు పేదరికాన్ని తగ్గిస్తుందని అంటారు.

ఇంటి ప్రవేశద్వారం అందంగా  ఆకర్షించేలా చేయండి. ఇంటి శ్రేయస్సు మరియు అభ్యున్నతి కోసం మహిళలు తమ పట్టుదలతో రోజువారీ జీవితాన్ని కొనసాగించడం కూడా చాలా ముఖ్యం. ఇలాంటి కొన్ని చిన్న చిన్న కిటుకులు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారడమే కాదు, ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది.

Exit mobile version