Home Unknown facts కొండ గుహల్లో వెలసిన మల్లన్న ఆలయం ఎక్కడ ఉంది?

కొండ గుహల్లో వెలసిన మల్లన్న ఆలయం ఎక్కడ ఉంది?

0

పరమశివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే ఎన్నో ప్రసిద్ద శివాలయాలు ఉన్నాయి. ఇక్కడ శివుడు ఒక కొండ గుహలో మల్లన్నగా పూజలందుకుంటున్నాడు. మరి కొండ గుహల్లో వెలసిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ శివుడు ఎలా వెలిశాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Mallanna Swamy

తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, జైపూర్ మండలం లో మల్లన్న గుడి ఉంది. ఇది చాలా పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో చేసే జాతర సమయంలో ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

ఇక పురాణానికి వస్తే, ఈ గ్రామానికి చెందిన ఒక బాలుడు ప్రతి రోజు తన పశువులను కాసేందుకు గుట్టపైకి వచ్చి పశువులను మేపుతూ ఉండేవాడు. ఇక ఆ బాలుడు మల్లన్న స్వామి అని పిలిస్తే పలికేవాడని, తన పశువులు కూడా ఎక్కడకి వెళ్లకుండా అక్కడే మేస్తూ ఉండటంతో ఒకసారి అక్కడికి వచ్చిన తోటి కాపరులు మల్లన్న ని చూసి దూషించడంతో ఆ బాలుడు మాయం అవ్వడంతో అప్పటినుండి ఆ గుహలో ఉన్న శివలింగాన్ని పూజించడం ప్రారంభించారని పురాణం.

ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, ఈ గుహలో ఏ కాలం లో అయినా శుద్ధ జలం ఉంటుందని ఇక్కడి స్థానికులు చెబుతుంటారు. ఇలా వెలసిన ఆ శివుడిని కొండల్లో ఉన్న మల్లన్న, కోటి దండాలు నీకన్నా అంటూ భక్తులు తరిస్తారు. అయితే శివరాత్రి కి పది రోజుల ముందు నుండే భక్తులు ఈ ఆలయానికి వచ్చి చేరుకుంటారు.

అయితే శివరాత్రి రోజున మల్లన్న గుడితో పాటు సమీపంలో గుట్టపై ఉన్న గట్టు మల్లన్న దేవాలయాలు కూడా జాతరకు సిద్ధం అవుతాయి. జాతరలో భాగంగా భక్తులు బోనాలు పోసి, పట్నాలు వేసి వారి మొక్కులను తీర్చుకుంటారు. ఈ సమయంలో కొన్ని వేల సంఖ్యలో భక్తులు ఇక్కడి తరలి వస్తుంటారు.

Exit mobile version