జీవితంలో అదృష్టవంతులుగా ఉండే అయిదు రాశులవారు

జ్యోతిష్యం.. మనలో చాలామందికి దీనిపై అపారమైన నమ్మకం. ఒక మనిషి భూత, భవిష్యత్ వర్తమాన కాలాలను తెలియజేస్తుంది జ్యోతిష్యం. ముఖ్యంగా భవిష్యత్తు గురించి దైనందిన, వార, మాస, వార్షిక రాశిఫలాలను తెలుసుకుంటుంటారు చాలామంది. గ్రహాల కదలికల ఆధారంగా ఒక్కో రాశికి కొన్ని నిర్దిష్టమైన విలువలు ఉంటాయి.. అయితే రాశి చక్రంలోని ప్రతి రాశికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది… రాసి ఫలాలు గ్రహాల కదలికపై ఆధారపడి ఉంటాయి.. ఈ రాశి ఫలాల ఆధారంగానే ఓ వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘటనల్ని కూడా చెప్పవచ్చంటారు పండితులు.. జ్యోతిషశాస్త్రం ప్రకారం నవగ్రహాల ప్రభావం కొన్ని రాసుల వారికీ అనుకూలంగానూ కొన్ని రాసుల వారికీ ప్రాతికూలంగానూ ఉంటాయి.. ప్రతికూల ప్రభావాలు గురించి జ్యోతిష్య పండితుల ద్వారా ముందే తెల్సుకుని పరిహారాలు కూడా చేసుకోవచ్చు.. అయితే నవగ్రహాల ప్రభావం అనుకూలంగా ఉంది వారి జీవితంలో అదృష్టవంతులుగా ఉండే అయిదు రాశులవారి గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.

Rasi Phalaluజ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు అదృష్టాన్ని ఆభరణాలుగా ధరిస్తారు.. అదృష్టం అంటే ఐశ్వర్యం మాత్రమే కాదు.. మంచి స్వభావం.. కస్టపడి పని చేసి తద్వారా జీవితంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తుంటారు.. అలాంటి లక్షణాలున్న రాశుల్లో తులా రాశి ఒకటి..

Thula Raiతుల రాశి వారికి గొడవలు, తగాదాలు, వివాదాలంటే అస్సలు ఇష్టముండదు. వీరు శాంత స్వభావులు.. దీనికి అనుగుణంగా చాలా శాంతంగా, మృదుభావాల్ని కలిగి ఉంటారు. అందరితో కలిసి ఆనందంగా జీవనం సాగించడానికి వీరు ఎంతో ఇష్టపడుతుంటారు. చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కోవడాన్ని ఎంతగానో ఇష్టపడుతుంటారు. తుల రాశి అధిపతి అయినటువంటి శుక్రడు కదలిక వల్ల అనుకూల ప్రభావంతో ఏ విషయంలోనూ ఈ రాశి వారికి టెన్షన్లు, ఆందోళనలను కలిగించడు.. కష్టపడి చాలా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు..

Simha Rasiఇక రెండోది 12 రాశులకు రారాజుగా పిలిచే సింహ రాశి.. వీరివద్ద నుండి ఎవరైనా ప్రేమ పాఠాలను నేర్చుకోవచ్చు.. ఈ రాశి వారు ఎల్లప్పుడు ఆనందంగా ఉండటాన్ని ఎంతో ఇష్టపడుతుంటారు. అంతేకాడు జీవితంలో ఎలాంటి కష్టాలనైనా ధైర్యం గ ఎదుర్కొని చాలా సులభంగా వాటిని అధిగమిస్తుంటారు. ఈ సింహ రాశి వారితో ఎవరైన గొడవ పడినప్పటికీ వీరు పట్టించుకోరు.. వీరికి కోపం అంతగా రాదు. ఎదుటివారు గొడవ పడ్డప్పటికీ అంతా మర్చిపోయి తిరిగి వారితో ముందులాగే అంతే ప్రేమగా ఉంటారు. వీరు ప్రేమతోనే దేన్నైనా సాధిస్తారు..

Dhanasu Rasiఇక మూడవది ధనుస్సు రాశి.. ఈ రాశి వారు మానవత్వం, మృదు స్వభావానికి ప్రతీకలు అని చెప్పాలి.. వీరు తమ వినయంతో ప్రజల ఆదరణ చూరగొంటారు. ఏ విషయాన్నైనా వీరు చాలా సులభంగా తీసుకుంటారు. అనవసర విషయాల్లో అస్సలు కలగజేసుకోరు, అంతేకాదు ఇతరుల విషయాల్లో ఎప్పుడు జోక్యం చేసుకోరు. ఇలాంటి వాటికి ఎంతో దూరంగా ఉంటారు. వీరికి ఏమి తెలియదని మాత్రం అనుకోకూడదు.. ఎందుకంటే ధనుస్సు రాశి వారు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తారు, కానీ తమ పనిలో తాము నిమగ్నమైపోతారు…. వీరు వీరి పనిలోనే ఆనందాన్ని వెతుక్కుంటారు. అలాగే స్నేహితులు, శ్రేయోభిలాషులతో సంతోషంగా గడిపేందుకు ఇష్టపడతారు.. అందరితో చాలా కలివిడిగా ఉంటారు..

Meena Rasiఇక నాల్గవది మీనా రాశి.. రాశి చక్రంలో ఉన్న 12 రాశుల్లో మిగిలిన వారితో పోలిస్తే మీన రాశి వారు చాలా సున్నిత మనస్కులు. అంతే ప్రశాంతంగా ఆలోచిస్తారు కూడా… ఎదుటివారిని బాధ పెట్టేలా నిర్ణయాలు ఎప్పుడు తీసుకోరు. పరిస్థితి ఎలాంటిదైనా.. ఎంత కష్టంగా ఉన్నా.. సమస్యను పరిష్కరించి శాంతి పరుస్తారు. అయితే వీరుకొన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే వీరు బంధాలకు విలువనిస్తూ చాలా భావోద్వేగంగా ఉంటారు. అయితే వీరి జీవితంలో సంతోషానికి మాత్రం కొదవ ఉండదు. ఎందుకంటే ఎదుటి వారి సంతోషాన్ని ఆశించిన వాళ్ళకి తిరిగి సంతోషమే లభిస్తుంది..

Midhuna Rasiమిథున రాశి వారు కూడా అదృష్ట జాతకులు.. వీరితో అందరూ ఎంతో స్నేహభావంతో ఉంటారు. వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు.. ఎక్కువగా నవ్వుతూ.. ఇతరులను నవ్విస్తుంటారు. ఈ రాశి వారికి హాస్య భావం ఎక్కువ. అంతే సెన్స్ ఆఫ్ హ్యుమర్ కూడా కలిగి ఉంటారు… భవిష్యత్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి ప్రణాళికలు వేసుకోరు. అయినప్పటికీ ఎంతో అదృష్టవంతులు.. ఎందుకంటే వీరు జీవితంతో పాటు ప్రయాణాన్ని సాగించడానికి ఇష్టపడతారు… ఎదుటివారు కోపంతో ఊగిపోతున్నప్పటికీ వీరు మాత్రం చాలా శాంతంగా ఉంటారు. ఇలా ఎన్నో మంచి గుణాలు వీరికి ఉండటం వలన వీరెంతో ఉన్నతస్థాయిని చేరుకుంటారు..

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR