ఈ ఆలయానికి మధుకేశ్వరస్వామి ఆలయం అనే పేరు ఎలా వచ్చింది ?

ఇప్పటివరకు ఎన్నో లింగాల గురించి విని ఉంటాము. కానీ చెక్కతో అదికూడా ఇప్పచెట్టుతో తయారు చేయబడిన శ్రీముఖలింగం ఎప్పుడైనా చూసారా? ఆ లింగం గురించి తెలుసుకుందాం శ్రీముఖ లింగం ఆలయం శ్రీకాకుళం నుండి 46 కిలోమీటర్ల దూరప్రాంతంలో వుంది. ఈ ఆలయం ఎంతో పురాతనమైంది. ఈ ఆలయానికి చుట్టుపక్కల ప్రదేశాలలో చరిత్రలోనే ప్రసిద్ధిచెందిన సోమేశ్వరస్వామి, భీమేశ్వరస్వామి ఆలయాలు కూడా వున్నాయి.

Madhukeshwara Swamy Templeపూర్వం నుండి ఇఫ్పటివరకు మారుతున్న కాలాలమధ్య ఈ ప్రదేశంలో బౌద్ధ, జైన, హిందూమతాలు ఈ ప్రాంతంలో వర్ధిల్లాయని సమాచారం. ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ ప్రదేశ ఆవరణలో దొరికిన శాసనాలు, ఆధారాల ప్రకారం ఎక్కడా శ్రీముఖలింగం అని పేరు చెప్పబడలేదు. పూర్వం దీనికి కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనరగం అనేక రకరకాల పేర్లతో రాయబడివుంది.

Madhukeshwara Swamy Templeఆలయ వివరాలు :

సాధారణంగా ఆలయాల నిర్మాణం రాతితో నిర్మించడం జరుగుతుంది. కానీ ఈ ముఖలింగం మాత్రం రాతితో చెక్కింది కాదు. పూర్వం ఈ ప్రదేశంలో వున్న ‘ఇప్ప’ చెట్టు మొదలను నరికివేయగా.. అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందిందని అంటారు.

Madhukeshwara Swamy Templeఇప్ప చెట్టు మొదలపై ముఖం కనిపిస్తుందని, ఆ మొదలే క్రమంగా రాపిడికి గురయి లింగంగా అవతారం ఎత్తిందని చెబుతుంటారు. ఇప్ప చెట్టును సంస్కృతంలో ‘మధుకం’ అంటారు కాబట్టి ఈ ఆలయానికి ‘మధుకేశ్వరస్వామి ఆలయం’ అనే పేరొచ్చిందని అంటుంటారు.

Madhukeshwara Swamy Templeఈ ఆలయంలో కొన్ని ప్రత్యేక విషయాలు కూడా వున్నాయి. కేవలం గర్భాలయమే కాక ఎనిమిదివైపులా ఎనిమిది లింగాలు నిర్మించబడి వున్నాయి. ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్యవిగ్రహాలు కూడా వుండటం విశేషం.

Madhukeshwara Swamy Templeభీమేశ్వరాలయం శిథిలావస్థలో వుంది. ఇందులో కుమారస్వామి, దక్షిణామూర్తి, బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి. సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే వుంది. ఆనాటి కాలంలో పిడుగు ఒక శిఖరంపై పడటంతో అది కిందకు పడిపోయింది. ఆనాటి శిల్పకళాకారులు దానిని తిరిగి అదే కొండపై అమర్చారు.

Madhukeshwara Swamy Templeపూర్వం ఈ ప్రాంతంలో నిర్వహించిన తవ్వకాలలో సరస్వతి విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహాలు లభించాయి. ఈ విగ్రహాలను బట్టి తెలిసిందేమింటే.. క్రీ.శ. 10వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడు అనే రాజు ఈ ఆలయాన్ని కట్టించాడు. అతని కుమారుడైన అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,730,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR