Home Unknown facts వివాహం జరిగిన స్త్రీలు మంగళ గౌరీ వ్రతం చేయడానికి కారణం?

వివాహం జరిగిన స్త్రీలు మంగళ గౌరీ వ్రతం చేయడానికి కారణం?

0

వివాహం జరిగిన ఆడవారు ఎన్నో నోములు, వ్రతాలు, ఉపవాసాలు చేస్తారు. అయితే అన్ని నోముల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యత పొందిన నోము మంగళ గౌరీ నోము. పెళ్లయిన స్త్రీలు సౌభాగ్యం కోసం చేసే శ్రావణ మంగళవారం నోముకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రద్ధతో తనను కొలిచే వారిని మంగళగౌరీ ఎంతటి త్యాగానికయినా సిద్ధపడి కన్నబిడ్డల మాదిరిగా కాపాడుతుందనడానికి చక్కటి కథ ప్రచారంలో ఉంది.

Mangala Gowri Vrathamకృతయుగంలో దేవతలు, దానవులు అమృతాన్ని ఆశించి క్షీరసాగర మథనం చేసే సమయంలో ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషం విరజిమ్మింది. భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని వేడుకోగా తన కర్తవ్యమేమిటో సెలవివ్వవలసిందిగా పార్వతి వంక చూశాడు. భర్త ఆంతర్యం గ్రహించిన పార్వతీమాత బిడ్డల యోగక్షేమాలను కాంక్షించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ తన మాంగల్యసౌభాగ్యంపై ప్రగాఢ విశ్వాసం ఉంచి, లోక వినాశనానికి కారణభూతమైన కాలకూట విషాన్ని పరమేశ్వరుడు మింగడానికి అనుమతించిందని చెబుతారు.

అంతటి త్యాగమూర్తి, సర్వమంగళ స్వరూపిణియైన శ్రీ భవానీమాతను శ్రీ మంగళగౌరీ వ్రతం పేరిట నూతనంగా వివాహమైన స్త్రీలు కొలిస్తే సౌభాగ్యంతో వర్థిల్లుతారని నమ్మకం.

వివాహిత స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని ఆరంభించి వరుసగా ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరిస్తే అటువంటి స్త్రీలకు శ్రీ మంగళగౌరీ కటాక్షం లభించి వైధవ్య బాధలు లేకుండా జీవితాంతం సర్వసౌఖ్యాలతో తులతూగుతారని పురాణాలు పేర్కొంటున్నాయి.

మొదట సూతమహాముని నైమిశారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునులకు వివిధ పురాణగాథలను చెబుతున్న సందర్భంలో ఈ మంగళగౌరీ వ్రతం గురించి వివరించారని, అనంతరం నారదుడు సావిత్రీ మాతకు వ్రతాన్ని ఉపదేశించాడని చెబుతారు. శ్రీకృష్ణుడు కూడా ఈ వ్రతం గురించి ద్రౌపదికి చెప్పి ఈ వ్రతాన్ని చేయించాడు.

 

Exit mobile version