మార్కండేయుడికి దీర్ఘాయువును ప్రసాదించిన మృత్యు వినాశిని’ తీర్థం!

మార్కండేయుడు మహా శివభక్తుడు అనునిత్యం పరమశివుడిని పూజించేవాడు. ఆ స్వామి సేవలో .. ఆ స్వామి నామ స్మరణలో మునిగితేలేవాడు. అలాంటి మార్కండేయుడు అల్పాయుష్కుడుగా జన్మించాడు. 16 సంవత్సరాలు నిండిన మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి యముడు తన దున్నపోతుమీద బయలుదేరతాడు. యముడు వచ్చేటప్పటికి మార్కండేయుడు అకుంఠిత భక్తితో శివారాధన చేస్తుంటాడు.

Markandeyaయముడు తన యమపాశాన్ని విసిరేటప్పటికి మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని శివామహాదేవా కాపాడు అని మార్కండేయుడు అన్నవెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి, కాలరూపుడై యముడిపైకి వస్తాడు. దీన్ని చూసి యముడు భయపడిపొయి మహాదేవా క్షమించు కరుణించమంటాడు. పరమ శివుడు ఆయనను ఎదిరించి మార్కండేయుడికి దీర్ఘాయువును ప్రసాదించాడు.

Markandeyaఅలాంటి మార్కండేయుడు మృత్వువు నుంచి బయటపడటానికి ‘ మృత్యు వినాశిని’ అనే తీర్థంలో స్నానమాచరించడం కూడా ఒక కారణమని ‘తిరుప్పేర్ నగర్’ స్థలపురాణం చెబుతోంది. 108 దివ్య తిరుపతులలో ఒకటైన ఈ క్షేత్రాన్ని ‘బృహత్పురి’ అని కూడా పిలుస్తారు.

Markandeyaఇక్కడ స్వామివారు ‘అప్పకుడత్తాన్’ పేరుతోనూ అమ్మవారు కమలవల్లీ తాయారు పేరుతో పూజాభిషేకాలు అందుకుంటున్నారు. స్వామివారికి ‘అప్పాలు’ అంటే చాలా ఇష్టమట అందువల్లనే ఆయనకి ఆ పేరు వచ్చిందని అంటారు. ఇక్కడి మృత్యు వినాశిని తీర్థంలోనే మార్కండేయుడు స్నానమాచరించి దీర్ఘాయువును పొందాడని చెబుతారు. ఇక్కడ స్వామివారు పరాశర మహర్షికి ప్రత్యక్ష దర్శనం ఇచ్చాడు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR