Home Unknown facts మహర్షి తప్పసు కారణంగా వెలిసిన వేంకటేశ్వరుడి ఆలయం ఎక్కడ ఉందొ తెలుసా ?

మహర్షి తప్పసు కారణంగా వెలిసిన వేంకటేశ్వరుడి ఆలయం ఎక్కడ ఉందొ తెలుసా ?

0

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన ప్రదేశం తిరుమల. ఎంతో పవిత్రమైన ఈ క్షేత్రాన్ని రోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కానీ ఏడుకొండలు ఎక్కి ఆ స్వామిని దర్శించుకోవాలంటే అదృష్టం కూడా ఉండాలని అంటారు. అయితే తిరుపతికి వెళ్ళే స్థోమత లేనివారు ద్వారకా తిరుమలలో మొక్కులను చెల్లించవచ్చట. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు కి 42 కి.మీ దూరంలో గల ద్వారకా తిరుమల ఎంతో పవిత్ర పుణ్య క్షేత్రం.

Dwarka Tirumalaపూర్వం ద్వారక మహర్షి అనే ముని ఇక్కడ కలియుగ నారాయణుడి గురించి తపస్సు చేసి ఆ దేవదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడట. కోరిన కోర్కెలు తీర్చే ఆ స్వామి మహర్షికి దర్శనము ఇచ్చి ఏమి కావాలో కోరుకోమని అడగగా ఆ మహర్షి నీ పాద సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించమని కోరుకున్నడట. అందుకే స్వామి అక్కడ వెలసినట్లు పురాణ గాథ. అయితే ఇక్కడ ఒకే గోపురం కింద రెండు మూలవిరాట్టు విగ్రహాలు ఉండటం విశేషం.

ద్వారకా మునికి ప్రత్యక్షమైన విరాట్టు వక్ష స్థలం వరకు మాత్రమే దర్శనమిస్తుంది. స్వామి పాదాలు పాతాళంలో ఉన్నాయి అని నమ్మిక. అందుకే శ్రీ రామానుజాచార్యుల వారు స్వామిని దర్శించుకున్నపుడు స్వామి వారి పెద్ద విరాట్టు చేశారు. మహర్షికి దర్శనము ఇచ్చిన విరాట్టుని మొక్కితే కోరిన కోర్కెలు తీరతాయని, ప్రతిష్ట చేసిన విరాట్టుని కొలిస్తే ధర్మార్త మొక్షాలు కలుగుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం.

ఇక్కడ స్వామికి సంవత్సరానికి రెండు సార్లు కళ్యాణోత్సవాలు జరుగుతాయి.ఈ స్వామి కి ఒక్కసారి కూడా అభిషేకాలు జరగకపోవడం విశేషం,ఎందుకంటే మూల విరాట్టు కింద భాగంలో ఉన్న ఎర్ర చీమలు చెదిరి విగ్రహం నిండా అవుతాయని అభిషేకం చేయరు.

తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ కూడా సంవత్సరం పొడవునా భక్తులు వచ్చి గోవిందుని చూసి తరిస్తారు.

 

Exit mobile version