Home Unknown facts రాక్షసుడిని సంహరించి వెలసిన అమ్మవారి ఆలయ రహస్యం

రాక్షసుడిని సంహరించి వెలసిన అమ్మవారి ఆలయ రహస్యం

0

ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ముగ్గురు అమ్మవార్లు ఈ ఆలయం లో రోజు పూజలనందుకుంటూ భక్తులకి దర్శనం ఇస్తారు. ఒక రాక్షసుడిని సంహరించి అమ్మవారు ఇక్కడ వెలిశారని, ఇంకా పరమశివుడు ఒక మహర్షి కోరిక ప్రకారం తానే స్వయంగా రూపుదిద్దిన ఒక పార్థివ లింగాన్ని ప్రసాదించాడని స్థల పురాణం చెబుతుంది. మరి ఆ మహర్షి ఎవరు? ఈ ఆలయం గొప్పతనం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Mookambika Temple Kollur

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో కొల్లూరులో మూకాంబిక దేవాలయం ఉంది. ఈ ఆలయం సౌపర్ణిక నది ఒడ్డున, కొండచాద్రి కొండపైన ఉంది. పూర్వము ఈ ఆలయం 3880 అడుగుల ఎత్తున ఉన్న కొండచాద్రి పర్వత శిఖరం పైన ఉండగా, సామాన్యులు అంత ఎత్తుకు ఎక్కి అమ్మవారిని దర్శించడం కష్టం అని ఆదిశంకరాచార్యులు ఈ ఆలయాన్ని తిరిగి కొల్లూరులో ప్రతిష్టించినట్లు తెలియుచున్నది. ఇక్కడి పంచముఖ గణేశ యొక్క శిల్ప నిర్మాణం విశిష్టంగా ఉంటుంది.

స్థల పురాణం ప్రకారం, ఒకప్పుడు కౌమాసురుడనే రాక్షసుడు తనకు లభించిన శక్తులతో అల్లకల్లోలం సృష్టించగా దేవతలు దూరంగా వెళ్లిపోతారు. ఆ సమయంలో రాక్షసునికి అంతం సమీపించిందని సమాచారం వస్తుంది. దీనితో కౌమాసురుడు భయపడు శివుని గూర్చి ఘోర తపస్సు ప్రారంభించాడు. శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని చెబుతాడు. రాక్షసుడు ఏ వరం కోరుతాడో ఊహించిన సరస్వతి అతని నాలుకపై నిలిచి వాక్కు రాకుండా చేస్తుంది. రాక్షసుడు మూగవాడవుతాడు అప్పుడు దుర్గాదేవి శక్తులను సమీకరించుకొని రాక్షసుని సంహరిస్తుంది. రాక్షసుడు వధింపబడిన స్థలం మరణకట్ట గా నిలిచిపోయింది. కన్నడంలో కొల్లు అంటే చంపు అని అర్థం. దీనితో కొల్లూరు అంటే చంపిన స్థలం అని అర్థమని కూడా చెబుతారు.

అయితే ఆ తరువాత కొన్ని ఏళ్లకు ఆది శంకర కుడజాద్రి కొండలలో ధ్యానం చేస్తున్నపుడు, దేవి ఆయన ఎదుట ప్రత్యక్షమై కోరిక అడగమని చెప్పింది. ఆయన దేవిని కేరళలోని ఒక ప్రాంతంలో తాను చెప్పిన చోట వెలిసి పూజలు అందుకోవాలని కోరారు. తద్వారా కేరళ సుభిక్షమవుతుందని ఆ ప్రాంతాన్ని సందర్శించిన వారికి వారు ఎన్నుకున్న రంగంలో జయం సిద్ధించేలా వరాలు ఇవ్వాలని కూడా అడుగుతాడు. ఇందుకు అంగీకరించిన దేవి మొదట నీవు వెళ్లాలని నిన్ను తాను వెంబడిస్థానాని అయన తన గమ్యం చేరే వరకు తిరిగి చూడరాదని ఒక పరీక్ష పెడుతుంది. గతంలో మూకాసురుడిని వధించిన ప్రాంతానికి వచ్చిన వెంటనే దేవి ఆగిపోతుంది. దేవి యొక్క గజ్జల శబ్దం వినబడకపోవడంతో, శంకరాచార్యలు హటాత్తుగా తిరిగి చూశాడు. వెంటనే దేవి శంకరను వెంబడించడం ఆపేసి అక్కడ మూకాంబికగా వెలుస్తుంది. దీంతో శంకరాచార్యలు విచారిస్తుండగా పార్వతి దేవి జరిగిన కథమొత్తం చెప్పి ఇక్కడ తన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమని కోరుతుంది. ఇక్కడికి వచ్చిన వారికి నీవు కోరినట్లే వారు ఎంచుకున్న రంగంలో విజయం సిద్ధిస్తుందని వరమిస్తుంది.

శ్రీ చక్ర మీద ఉన్న ఆ దేవత యొక్క పంచలోహ మూర్తిని ప్రతిష్టించారు. ఆ దేవత జ్యోతిర్-లింగ రూపంలో శివ మరియు శక్తి ఇద్దరినీ కలుపుకుని ఉంటుంది. ఇక ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో జరిగే నవరాత్రి ఉత్సవాలకి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version