తిరుమల తిరుపతి సహజ శిలాతోరణం గురించి కొన్ని నిజాలు

0
1977

తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి. ఈ స్వామిని ఏడుకొండలవాడని, గోవింధుడని, బాలాజీ అని, తిరుమలప్ప అని, వెంకటరమణుడని, మలయప్ప అని ఇలా ఎన్నో పేర్లతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలి వచ్చే తిరుమల తిరుపతి లో సహజ శిలాతోరణం ఒకటి ఉంది. మరి సహజ శిలాతోరణం గురించి కొన్ని నిజాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Natural Arch Silathoranam

శ్రీ వేంకటేశ్వరస్వామి భూమిపైకి వచ్చినప్పుడు మొట్టమొదటి అడుగు తిరుమలలో ఉన్న శ్రీవారి పాదాలు లేదా శ్రీవారిమెట్టు అని పిలువబడే ప్రదేశంలో వేయగా, రెండవ అడుగు సహజ శిలాతోరణం దగ్గర, మూడవ అడుగు ప్రస్తుతం ఉన్న స్వామివారి మూలవిరాట్టు దగ్గర వేసాడని పురాణం. ఇక సహజ శిలాతోరణం విషయానికి వస్తే, స్వామివారి ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో సహజ శిలాతోరణం ఉంది.

Natural Arch Silathoranam

తిరుమల కొండ మీద ధనుస్సు ఆకారంలో ఉండే ఈ శిలాతోరణం సుమారు 26 అడుగుల వెడల్పు, 9.8 అడుగుల ఎత్తు ఉంటుంది. అయితే 1980 వ సంవత్సరంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలలో ఈ శిలాతోరణాన్ని గుర్తించినట్లుగా తెలియుచున్నది. శాస్త్రవేత్తలు చెప్పిన దానిప్రకారం, ఈ శిలాతోరణం సుమారు 250 కోట్ల సంవత్సరాల పూర్వం ఇవి ఏర్పడ్డాయని ఇంకా సముద్రమట్టానికి దాదాపుగా 30 వేల అడుగుల ఎత్తులో ఉన్న తిరుమలలో నీటి కోత కారణంగా ఈ శిలాతోరణం ఏర్పడింది చెప్పారు. వారుచెప్పిన దానిప్రకారం ఒకప్పుడు తిరుపతిలో అంత ఎత్తులో నీరు ఉండేదని తెలియుచున్నది.

Natural Arch Silathoranam

ప్రపంచం మొత్తంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణాలలో ఇది ఒకటిగా చెబుతారు. ఇక్కడ విశేషం ఏంటంటే, శిలాతోరణం మీద శంఖం, చక్రం, కటి హస్తం, పాదాలు, గరుడ పక్షి, నాగాభరణం ఇవన్ని కూడా ఎవరు చెక్కకుండానే సహజ సిద్ధంగా మనకి స్పష్టంగా కనబడతాయి.

SHARE